Take a fresh look at your lifestyle.

భారత్‌కు ప్రపంచ బ్యాంకు బిలియన్‌ ‌డాలర్ల సహాయం..!

  • పిపిఈ కిట్స్, ‌కొత్త ఐసొలేషన్‌ ‌వార్డులకు వాడాలని సూచన..

కొరోనావైరస్‌ ‌ను ఎదుర్కోడానికి భారతదేశంకు ఒక బిలియన్‌ ‌డాలర్ల అత్యవసర నిధిని ఇవ్వడానికి ప్రపంచ బ్యాంక్‌ ఆమోదం తెలిపింది. దీనితో ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశంకి ప్రపంచ బ్యాంక్‌ ‌నిధులలో అతిపెద్ద వాటాను అందినట్లు అయ్యింది. భారత దేశంలో కరోనా వైరస్‌ ‌కాంటాక్ట్, ‌ట్రేసింగ్‌, ‌పరిశోధనకు మద్దతు ఇవ్వడానికి ఒక బిలియన్‌ ‌డాలర్లు ప్రపంచ బ్యాంకు ఇస్తున్నది. వ్యక్తిగత రక్షణ పరికరాల పీపీఇ కిట్స్ ‌కోసం, కొరోనా సోకినా వారికి కొత్త ఐసోలేషన్‌ ‌వార్డులను ఏర్పాటు చేయడానికి ఈ నిధులు వాడాలని ప్రపంచ బ్యాంకు భారత ప్రభుత్వానికి చెప్పింది. ఇరవై ఐదు అభివృద్ధి చెందుతున్న దేశాలలో కొరోనావైరస్‌ ‌ను ఎదుర్కొనేందుకు కోసం చేసే కార్యకలాపాల నిమిత్తం తోలి విడతగా 1.9 బిలియన్‌ ‌డాలర్ల అత్యవసర నిధులను ఆమోదించినట్లు ప్రపంచ బ్యాంక్‌ ‌గురువారం తెలిపింది, భారతదేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కొరోనా వైరస్‌ ‌వ్యాప్తితో పోరాడటానికి సగానికిపైగా నిధులు కేటాయించారు.

రాబోయే రోజులలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ ‌దేశాల ప్రాజెక్టులపై ద్రుష్టి పెడతామని ప్రపంచ బ్యాంక్‌ ‌ప్రకటించింది. ప్రస్తుత ప్రపంచ బ్యాంక్‌ ‌ఫైనాన్స్‌డ్‌ ‌ప్రాజెక్టులలో 1.7 బిలియన్‌ ‌డాలర్ల నిధులను కరోనా వైరస్‌ ‌మహమ్మారిని ఎదుర్కోవడానికి మళ్లించే అందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రపంచ బ్యాంక్‌ ‌తెలిపింది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి రాబోయే 15 నెలల్లో 160 బిలియన్‌ ‌డాలర్ల వరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు బ్యాంక్‌ ‌తెలిపింది. ప్రపంచ బ్యాంక్‌ ‌ప్రెసిడెంట్‌ ‌డేవిడ్‌ ‌మాల్పాస్‌ ‌మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న దేశాల సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి, ఆర్థిక సామాజిక పునరుద్ధరణ చేయడానికి ప్రపంచ బ్యాంకు సత్వర చర్యలు తీసుకుంటున్నది అని ప్రకటించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy