ప్రగతి భవన్లో అవార్డు సర్టిఫికెట్ ప్రదానం చేసిన ఐరాస ప్రతినిధులు
ప్రజాతంత్ర, హైదరాబాద్, జనవరి 18 : యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి గ్రామానికి ఇటీవలే వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు వరించింది. ఈ సందర్భంగా ప్రగతిభవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌కు వరల్డ్ బెస్ట్ టూరిజం అవార్డు సర్టిఫికేట్ ను ఐక్య రాజ్య సమితి ప్రతినిధులు అందజేశారు.
ఇటీవల యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ నిర్వహించిన ‘వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్’ అవార్డు కోసం సుమారు ప్రపంచ వ్యాప్తంగా 170 దేశాలు పోటీపడగా, మన రాష్ట్రం నుండి భూదాన్ పోచంపల్లి గ్రామం వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు గెలుచుకోవడం గొప్ప విషయం. ఈ కార్యక్రమంలో పర్యటకాభివృద్ధి సంస్థ ఎండి మనోహర్ పాల్గొన్నారు.