Take a fresh look at your lifestyle.

ఎంఐఎం ‌విముక్త హైదరాబాద్‌ ‌కోసం కృషి

  • మేయర్‌ ఎన్నికలో ఎందుకు ఆలస్యం
  • కెసిఆర్‌ ‌జైలుకెళ్లడం ఖాయం
  • భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్న సందర్భంగా బండి సంజయ్‌
  • ‌కార్పొరేటర్లతో అభివృద్ధికి పాటుపడతామని ప్రమాణం

ఎంఐఎం విముక్త హైదరాబాద్‌ ‌కోసం కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. జీహెచ్‌ఎం‌సీ ఎన్నికలలో అత్యధిక సీట్లలో విజయం సాధించిన సందర్భంగా.. గోషా మహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి ఆయన చార్మినార్‌ ‌భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. వీరితో పాటు కొత్తగా ఎన్నికైన 48 మంది కార్పొరేటర్లు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అమ్మవారి సమక్షంలో పార్టీ అధికార ప్రతినిధి రాకేష్‌ ‌రెడ్డి..బీజేపీ కార్పొరేటర్లతో ప్రమాణం చేయించారు. ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూనే అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని నూతన కార్పొరేటర్లు ప్రమాణం చేశారు. జీహెచ్‌ఎం‌సీలో అభివృద్ధి పనులకు తమ పార్టీ సహకరిస్తుందని స్పష్టం చేశారు.

- Advertisement -

సీఎం వైఖరి వల్లే హైదరాబాద్‌లో అభివృద్ధి జరగటం లేదన్నారు. భాజపాకు మేయర్‌ ‌పీఠం దక్కనప్పటికీ హైదరాబాద్‌ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఒక వర్గం కోసం మెజార్టీ ప్రజలను అధికార పార్టీ అవమానిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌ను ఎంఐఎం నుంచి విముక్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. పాతబస్తీలో ఎందుకు అభివృద్ధి జరగటంలేదో ప్రజలు ఆలోచించుకోవాలని బండి సంజయ్‌ ‌విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల తర్వాత అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటామని బండి సంజయ్‌ ఎన్నికలకు ముందు అన్నారు.

అమ్మవారి దయతో జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో విజయం సాధించామన్న ఆయన.. నూతన కార్పొరేటర్లతో కలిసి శుక్రవారం అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కార్పొరేటర్ల కొనుగోలుకు టీఆర్‌ఎస్‌ ‌ప్రయత్నిస్తోందని, అయితే మా ఒక్క కార్పొరేటర్‌ను కెలికెతే.. మేం వంద మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కెలుకుతామని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. ఇప్పటికైనా టీఆర్‌ఎస్‌ ‌గుణపాఠం నేర్చుకోవాలి. బీజేపీ కార్పొరేటర్లతో కలిసి వరదసాయం కోసం పోరాటం చేస్తాం. కేసీఆర్‌ ‌పొర్లుదండాలు పెట్టినా జైలుకెళ్లడం మాత్రం ఖాయమన్నారు. సీఎం అనాలోచిత నిర్ణయాల వల్ల రిజిస్ట్రేషన్‌ ‌వ్యవస్థ నాశనం అయిందని బండి ఆరోపించారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి ఆలయంలో భారీ పోలీస్‌ ‌బందోబస్తు ఏర్పాటు చేశారు. జై శ్రీరాం నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగి పోయింది. భాజపా నేతల పర్యటన సందర్భంగా చార్మినార్‌ ‌వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave a Reply