Take a fresh look at your lifestyle.

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

రెబ్బెన, మే 9, ప్రజాతంత్ర విలేఖరి : బెల్లంపల్లి ఏరియాలోని నెలకొ న్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని టిబిజికెఎస్‌ ‌నాయకులు ఏరియా జనరల్‌ ‌మేనేజర్‌ ‌కె.కొండయ్య కలిసి వివిధ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని ఏరియా ఆసు పత్రిని కరోనా ఐసోలేషన్‌ ‌సెంటర్‌గా మార్చినందున వెంటనే సింగరేణి కార్మికులకు వైద్యసేవల నిమిత్తం పాత జీఎం కార్యాలయంలో ఆసు పత్రిని ప్రారంభించి సేవలందించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టిబిజికెఎస్‌ ‌ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి, డైరెక్టర్‌ ‌పా దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, దీని విషయంలో జీఎం వెంటనే సహకరించి ఆసుపత్రిని ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఖైరిగూర ఓపెన్‌కాస్టులో ప్రాజెక్టు ఆఫీసర్‌ ‌కోసం నూతనంగా నిర్మించిన భవనాన్ని వెంటనే ప్రారంభించాలని దాని వలన అక్కడ ఉద్యోగులకు మరింత వెసులుబాటు కలుగుతుందని కోరగా త్వరలో ప్రారంభిస్తామని తెలియజేశారు.

బెల్లంపల్లి పట్టణంలో ని రిజియన్‌ ‌స్థాయి ఎక్స్ల్పోరేషన్‌ ‌డిపార్టుమెంట్‌లో తగ్గించ తలపెట్టిన డ్రిల్స్‌ను సాధ్యమైనంత ఎక్కువ డ్రిల్స్‌ను నడపాలని ఎక్కుమంది రిగ్మెలను ఇక్కడే ఉంచాలని కోరవడం జరిగింది. బెల్లంపల్లి ఏరియాలోని ఉద్యోగులందరికి కరోనా వ్యాధి వ్యాపించకుండా తగిన సౌకర్యాలు కల్పించాలని అవసరమైన ఏర్పాటు చేయాలని కోరాము. మాదారం, గోలేటి టౌన్‌ ‌షిప్‌లలో ఖాళీగా ఉన్న క్వార్టర్లను నామమాత్రమే అద్దెతో మాజీ కార్మికులకు, కాంట్రాక్టు కార్మికులకు ఇవ్వాలని కోరాము. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మలరాజ్‌ శ్రీ‌నివాసరావు, టిబిజికెఎస్‌ ‌చీఫ్‌ ఆర్గనైజింగ్‌ ‌కార్యదర్శి సంఘం ప్రకాశరావు, కార్పొరేట్‌ ‌చర్చల ప్రతినిధి ధరావత్‌ ‌మంగీలాల్‌, ‌కేంద్ర కమిటి సభ్యులు అబ్బు శ్రీనివాస్‌ ‌రెడ్డి, జీఎం కమిటి సభ్యులు రామ్‌రెడ్డి, మారిన వెంకటేష్‌, ‌సమ్మయ్య, చీఫ్‌ ఆర్గనైజింగ్‌ ‌కార్యదర్శి కానుగంటి కుమారస్వామి, బెల్లంపల్లి ఏరియా అసిస్టెంట్‌ ఏరియా కార్యదర్శి మందనపు రామారావు, అలవేణి సంపత్‌, ‌చంద్ర కుమార్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply