Take a fresh look at your lifestyle.

కూలీలకు ఉపాధి కల్పించాలి

  • సిద్ధిపేట జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి
  • అకాల వర్షాలతో తడిసిన ధాన్యం కొనుగోళ్ల పై రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో మంత్రి హరీష్‌ ‌రావు టెలీ కాన్ఫరెన్స్

ఒక ప్రజా ప్రతినిధిగా.. ప్రజలకు సేవ చేయడం కంటే., ఇంకేం పెద్ద పని లేదని జిల్లా ప్రజాప్రతినిధులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ ‌రావు దిశానిర్దేశం చేశారు. హైదరాబాదులోని మంత్రి నివాసం నుంచి బుధవారం జిల్లాలో నిన్న(మంగళవారం) కురిసిన అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యం కొనుగోళ్లు, ఉపాధిహామీ పనులు పెంచేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని జిల్లాలోని ఎమ్మెల్యేలు, మండలాల వారీగా ఏంపీపీలు, జెడ్పిటీసీలు, ఏంపీడీఓలు, ఏపీఓలు, పీఏసీఎస్‌ ‌చైర్మన్లు, పీఏసీఎస్‌ ‌సీఈఓలు, సివిల్‌ ‌సప్లయ్‌ అధికారులు, జిల్లా అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌పద్మాకర్‌, ఇతర జిల్లా అధికారిక సిబ్బంది మొత్తం 108 మందితో మంత్రి టెలి కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కొనుగోళ్ల పై రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేయాలని జిల్లా అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌పద్మాకర్‌, ‌జిల్లా అధికారిక వర్గాలకు మంత్రి హరీశ్‌ ‌రావు ఆదేశించారు .జిల్లాలో ఇప్పటిదాకా 83 వేల 640 క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు చేశామని, రూ.53 కోట్ల 20 లక్షల రూపాయల చెల్లింపులు రైతులకు చెల్లించామని మంత్రి వెల్లడించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో ధాన్యం తడిసిన నేపథ్యంలో కొనుగోళ్ల కేంద్రాలకు ఆరబెట్టిన ధాన్యం తేవాలని రైతులకు అవగాహన కల్పిస్తూ., ప్రతి ప్రజాప్రతినిధి క్షేత్రస్థాయిలో కొనుగోళ్ల కేంద్రాల్లో పర్యటించి అవగాహన కల్పించాలని ప్రజాప్రతినిధులకు మంత్రి సూచన చేశారు.లాక్‌ ‌డౌన్‌ ‌కారణంగా పనులు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్లకు, హామాలీలకు, నాయి బ్రాహ్మణులకు, రజకులకు 24 గంటల్లో ఉపాధి హామీ కార్డులు ఇవ్వాలని అధికారులకు మంత్రి హరీశ్‌ ఆదేశాలు జారీ చేశారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు ఏ గ్రామానికి వెళ్లినా.. నర్సరీలు, డంప్‌ ‌యార్డులు, స్మశాన వాటికలు, ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను సందర్శించాలన్నారు.జిల్లాలో ఉపాధి హామీ పనులు పెంచండి. జిల్లాలో కేవలం 67 వేల మందితో పనులు చేస్తున్నాం. కూలీల సంఖ్య లక్ష దాటాలని, సిద్ధిపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి సూచన చేశారు.జిల్లాలోని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌ ‌లతో ఆయా నియోజకవర్గ పరిధిలోని కొనుగోళ్ల కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు, కొనుగోళ్ల కేంద్రాల్లో రైతులకు ఉత్పన్నమవుతున్న సమస్యలపై చర్చించారు. హుస్నాబాద్‌, ‌దుబ్బాక, గజ్వేల్‌, ‌జగదేవ్‌ ‌పూర్‌, ‌కొమురవెళ్లి, చేర్యాల, మద్దూర్‌, ‌సిద్ధిపేట అర్బన్‌, ‌సిద్ధిపేట రూరల్‌, ‌చిన్నకోడూర్‌ ‌తదితర మండలాల వారీగా పలువురు ప్రజాప్రతినిధులతో ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల పనితీరుపై, అక్కడి క్షేత్ర స్థాయి సమస్యలపై మంత్రి ఆరా తీశారు. హుస్నాబాద్‌, ‌దుబ్బాక ఎమ్మెల్యేలు సతీశ్‌, ‌రామలింగారెడ్డిలతో జిల్లాలో కరోనా నివారణ, ధాన్యం కొనుగోళ్ల స్థితిగతులపై చర్చించారు. జిల్లాలో ఉపాధి హామీ కూలీల సంఖ్య ఇంకా పెరగాలని, ఇలాంటి కరోనా విపత్కర కష్టకాలంలో.. ప్రభుత్వం విధించిన లాక్‌ ‌డౌన్‌ ‌నేపథ్యంలో నిత్యం రెక్కాడితే కానీ డొక్కాడని నిరు పేదలకు ఈజీఎస్‌ ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి హరీశ్‌ ‌రావు చెప్పారు. సిద్ధిపేట జిల్లా కరోనా ఫ్రీ అయ్యిందని, ఎవ్వరూ రిలాక్స్ ‌కావొద్దని నిరంతరం కరోనా నివారణకు చేపట్టాల్సిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!