Take a fresh look at your lifestyle.

అద్భుతమయిన చిరునవ్వు ..ఇర్ఫాన్

ఇర్ఫాన్ ప్రతి అడుగులో తోడుగా నిలిచినా వ్యక్తి  సుతాపా సిక్దార్ . సుతాపా గత రెండు దశాబ్దాలకు పైగా ఇర్ఫాన్ ఖాన్ సహాయక వ్యవస్థ. ఆమె తనకంటూ తాను ఎదుగుతూ, ఇర్ఫాన్ ఖాన్ అద్భుతమైన విజయాలలో  కీలక పాత్ర పోషించారు. ఇర్ఫాన్ ఖాన్ అతి పెద్ద విమర్శకురాలు సుతాపా . ఆమెకు నటనపై మంచి అవగాహన ఉంది. ఇర్ఫాన్ ఖాన్ వేసే ప్రతి అడుగులో తోడు వుండిన సుతాపా సిక్దార్ గురించి మనం మాటాడి, ఇర్ఫాన్ ఖాన్ పై మన ప్రేమ.. అభిమానం తెలిపితే ఆ మహా నటుడికి అతి ప్రేమ పూరితమైన శ్రద్ధాంజలి అవుతుంది.”

aruna
అరుణ ,జర్నలిస్టు ,న్యూ దిల్లీ

విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ చనిపోయారు. ఎన్నో అంతర్జాతీయ సినిమాల్లో భారతీయ సినిమాల్లో నటించిన ఇర్ఫాన్ ఖాన్ నటన ఓ అద్భుతం. ఆయన నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా ఇన్సిట్యూట్ లో చదువుకుని. అదే ఇన్సిట్యూట్ లో “ఇర్ఫాన్ ఏక్టింగ్” అనే ఇర్ఫాన్ ఖాన్ నటనా శైలి గురించి విద్యార్థులు అభ్యసించే సబ్జెక్టు అయిపోయారు. నటన ఇర్ఫాన్ కు యెంత ఇచ్చిందో…. ఇర్ఫాన్ కూడా నటనకు అంతే తిరిగి ఇచ్చారు.ఈ రోజు మీకు ఇర్ఫాన్ గురించి చెప్పే రిపోర్ట్స్ అన్ని చోట్ల దొరుకుతాయి. ఎందుకంటే ఇర్ఫాన్ వెళ్లిపోయిన బాధలో అయన గురించి రాయటానికి అన్ని కాలాలు ఏడుస్తాయి. కానీ ఇర్ఫాన్ ఓ అద్భుతమైన చిరు నవ్వు. ఓ ఆనంద హేల. ప్రేమ నిండిన కళ్ళు ఇర్ఫాన్. భారతీయ గంగయమునా సంస్కృతీ ఇర్ఫాన్. అందుకే ఇర్ఫాన్ ఖాన్ గురించి ప్రేమగా రాయాలని వుంది. దుఃఖాన్ని పక్కన పెట్టి ఆయన ప్రేమ గురించి చెప్పాలని వుంది. ఇర్ఫాన్ ఓ ప్రేమ సాగరం ఆయన ప్రేమ గురించి నాలుగు మాటలు చెప్పాలని వుంది. ఇర్ఫాన్ ప్రతి అడుగులో తోడుగా నిలిచినా వ్యక్తి సుతాపా సిక్దార్ . సుతాపా గత రెండు దశాబ్దాలకు పైగా ఇర్ఫాన్ ఖాన్ సహాయక వ్యవస్థ. ఆమె తనకంటూ తాను ఎదుగుతూ, ఇర్ఫాన్ ఖాన్ అద్భుతమైన విజయాలలో కీలక పాత్ర పోషించారు. ఇర్ఫాన్ ఖాన్ అతి పెద్ద విమర్శకురాలు సుతాపా . ఆమెకు నటనపై మంచి అవగాహన ఉంది. ఇర్ఫాన్ ఖాన్ వేసే ప్రతి అడుగులో తోడు వుండిన సుతాపా సిక్దార్ గురించి మనం మాటాడి, ఇర్ఫాన్ ఖాన్ పై మన ప్రేమ.. అభిమానం తెలిపితే ఆ మహా నటుడికి అతి ప్రేమ పూరితమైన శ్రద్ధాంజలి అవుతుంది. సుతాపా సిక్దార్ చలనచిత్ర డైలాగ్స్ రచయిత. సుతపా అస్సామీ హిందూ కుటుంబంలో పుట్టారు. ఢిల్లీలో కేంద్రీయ విద్యాలయ పాఠశాల విద్య పూర్తీ చేసి సుతాపా ఢిల్లీలోని ప్రతిష్టాత్మక నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరి నటనను అభ్యసించారు. అయితే కథ స్క్రీన్ ప్లే అంటే ఆశక్తి ఉండి డైలాగ్స్ రచయిత అయ్యారు.

irfan smile

1987 లో ఇర్ఫాన్, సుతాపా ఎన్ఎస్డిలో గ్రాడ్యుయేషన్ పూర్తీ చేసారు. చదువుకునేటప్పుడు వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఫిబ్రవరి 23, 1995 న, సుతాపా ఇర్ఫాన్ ఖాన్‌ కోర్టులో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు బాబిల్, అయాన్ ఖాన్ ఉన్నారు. ఇర్ఫాన్, సుతాపా గ్రాడ్యుయేషన్ తర్వాత ఉపాధి కోసం టీవీ కార్యక్రమాలు చేపట్టి 1993 నుండి 1997 వరకు కలిసి పనిచేశారు. వీరు కలిసి చేసిన ప్రోగ్రాంలలో అత్యంత ప్రాచుర్యం పొందిన షో ‘బనేగి అప్ని బాత్’. ఇందులో ఇర్ఫాన్ నటించారు. సుతాపా స్క్రీన్ ప్లే రచయిత. ఈ షో కథాంశం, స్క్రీన్ ప్లే గురించి ఇర్ఫాన్ చాలా శ్రద్ధ తీసుకునేవారు. ఈ షో 11 ఎపిసోడ్లను సుతాపాతో చర్చించి ఇర్ఫాన్ రీరైట్ చేయించారు. ఇద్దరు కలిసి టీవీ రంగంలో పని మొదలు పెట్టి ఎదుగుతున్న సమయంలో. 1996 లో, సుతాపాకు దర్శకుడు సంజయ్ లీల బన్సాలి సంగీత నాటక చిత్రం ‘ఖమోషి: ది మ్యూజికల్’ సినిమా కోసం డైలాగ్స్ రాసే అవకాశం వచ్చింది.ఆమె ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఈ సినిమా పెద్ద హిట్. అటుపై ఆమె ఎన్నో పెద్ద సినిమాలకి డైలాగ్స్ రైటర్. అటుపై సుతాపా 2000లో, ‘అల్విదా ’ అనే ఒక టెలివిజన్ సిరీస్ రాశారు. ఇది చాల పెద్ద హిట్ అయ్యింది. ఈ షో రాబోయే యువ రచయితలు దర్శకులకు మంచి వేదికగా నిలచింది. సుతాపా రాసిన ఈ షోకు ఇర్ఫాన్ ఖాన్, దర్శకత్వం వహించారు. 2016 సంవత్సరంలో ‘మదరి’ చిత్ర నిర్మాతగా సుతాపా సిక్దార్ చిత్ర నిర్మాణలోకి ప్రవేశించారు. ఇది ఆమె తొలి చిత్రం. ఈ సినిమా సోషల్ థ్రిల్లర్ చిత్రం, నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ నటింప జేయాలి అని సుతాపా సిక్దార్ అనుకున్నారు . అయితే ఇర్ఫాన్ బలహీనమైన కథను, స్క్రీన్ ప్లేని అంగీకరించరని తెలిసి, నా సినిమాలో నటించు.. అని అడగటానికి ముందు మరొక రచయితతో కలిసి ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాలం ‘మదరి’ సినిమా కథపై పనిచేసారు. అటుపై ఇర్ఫాన్ కి తన సినిమా కథను చెప్పారు. ఇర్ఫాన్ కు ‘మదరి’ కథ నచ్చి వెంటనే ‘మదరి’ లో పనిచేయడానికి ఒప్పుకున్నారు. ఇర్ఫాన్ సుతాపా చదువుకుంటున్న కాలం నుంచి స్నేహితులుగా మసలుకుని, జీవిత ప్రయాణంలో నిత్యం ఒకరికి ఒకరు తోడుగా ప్రయాణం చేసారు. ఇర్ఫాన్ సుతాపా పక్కపక్కన నిల్చుంటే ‘ఇర్ఫాన్ గర్వం సుతాపా’ అని సినీప్రముఖులు అంటే… కాదు. ‘సుతాపా నీడ ఇర్ఫాన్’ అని ఇద్దరి స్నేహితులు చెప్పేవారు. అంత బలమైన ప్రేమ బంధం నుంచి ఇర్ఫాన్ ఎలా విడిపించుకు పోయారో ఏమో…. ఇర్ఫాన్ గర్వం సుతాపా సిక్దార్ కి ఇప్పుడు మనమందరి ప్రేమ కావాలి. ఇర్ఫాన్ యమునా నది అయితే సుతాపా సిక్దార్ గంగా నది. గంగకు యమునా లేని లోటు తెలియకుండా మనమంతా సుతాపా సిక్దార్ ని ప్రేమించాలి . ఇదే మనం ఇర్ఫాన్ ఖాన్ కు ఇవ్వగలిగిన నిజమైన అంజలి.

Leave a Reply