Take a fresh look at your lifestyle.

మద్యం దుకాణాలపై మహిళల దాడులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ లో మద్యం అమ్మకాలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.మద్యం బాటిళ్లను, నాటుసారాను ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు. చర్ల మండలం కొయ్యూరు పంచాయతీలో నాటు సారా అమ్మకాలపై శివమెత్తిన గిరిజన మహిళలు మద్యం స్థావరాలపై దాడులు చేశారు. రాత్రి నుంచి సారా..బెల్టు దుకాణాల పై దాడులు… నిర్వహిస్తున్నారు. దీపావళి నుంచి గ్రామాల్లో నాటు సారా, మద్యం అమ్మకాలు సాగిస్తే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆబ్కారి అధికారులు పై నిప్పులు చెరిగిన మహిళలు ప్రధాన రహదారిపై నాటుసారా , మద్యం సీసాలు ధ్వంసం చేసి నిప్పంటించారు. కుటుంబాలను చిద్రం చేస్తున్న సారా..మద్యం అమ్మకాలు నిలిపి వేయాలని నిరసన నిరసన వ్యక్తం చేశారు.

Leave a Reply