Take a fresh look at your lifestyle.

‘‘ఆడబిడ్డలకు అండ కావాలి, అత్యాచారాలకు అడ్డుకట్ట వేయాలి’’

అర్థరాత్రి స్త్రీలు స్వేచ్ఛగా సంచరించినప్పుడే నిజమైన స్వాతంత్య్రం’’అని గాంధీ అన్నారేమోకానీ అర్ధరాత్రి కాదు పట్టపగలే తిరగలేని దుస్థితి దాపురించింది. ఇంటి నుంచి బయటికి వెళ్లిన అమ్మాయి లేదా మహిళ  క్షేమంగా తిరిగి వస్తుందన్న నమ్మకం లేదు. ఎన్ని చట్టాలు చేసుకున్నా,  మహిళకు భద్రత కరవే. రోజులో ప్రతి గంటకు ఇద్దరు మహిళలు అత్యాచారానికి గురవుతున్నరన్న గణాంకాలు దారుణ పరిస్థితికి నిదర్శనం.”

నిర్భయ, దిశ, మనిషా.. మళ్ళీ మరో అభాగ్యురాలు. ఇలా రోజూ దేశంలో ఎక్కడో ఒకచోట మహిళలపై అత్యాచారాలు నిత్యకృత్యం అయి పోతున్నాయి. ఈ వార్తలు లేని ప్రసార మాధ్యమం ఒక్కటీ కనిపించదు. నాగరిక సమాజంలో ఆటవిక చర్యలు  అత్యంత విచారం. ఆడదైతే చాలు, పసిపాప నుంచీ పండు ముసలి వరకు అత్యాచారాలకు పాల్పడడం ఒళ్ళు గగుర్పొడుస్తుంది.  హృదయ విదారక సంఘటనలు జరుగుతున్న ఈ దేశం ఎటువైపు పయనిస్తోంది,?  అసమానతలు అంతరాలు పెరిగిపోతున్న భారత సమాజంలో మహిళలపై   అత్యాచారాలు, అఘాయిత్యాలు మగవారిలో పాశవికతకు నిదర్శనం. స్త్రీలపై రకరకాల హింస. భ్రూణహత్యలు, వరకట్న దురాచారం, లైంగిక వేధింపులు, లింగ వివక్షత, కొనసాగుతూనే ఉన్నాయి.  ‘‘అర్థరాత్రి స్త్రీలు స్వేచ్ఛగా సంచరించినప్పుడే నిజమైన స్వాతంత్య్రం’’అని గాంధీ అన్నారేమోకానీ అర్ధరాత్రి కాదు పట్టపగలే తిరగలేని దుస్థితి దాపురించింది. ఇంటి నుంచి బయటికి వెళ్లిన అమ్మాయి లేదా మహిళ  క్షేమంగా తిరిగి వస్తుందన్న నమ్మకం లేదు.

ఎన్ని చట్టాలు చేసుకున్నా,  మహిళకు భద్రత కరవే. రోజులో ప్రతి గంటకు ఇద్దరు మహిళలు అత్యాచారానికి గురవుతున్నరన్న గణాంకాలు దారుణ పరిస్థితికి నిదర్శనం.  2012లో దేశంలో మహిళలపై 2,44,270 నేరాలు జరిగాయట. 2019లో   87 వేల అత్యాచారాల కేసులు నమోదు కాగా, 2020లో మహిళలపై పాల్పడిన నేరాలకు సంబంధించి 4.05లక్షలకు పైగా కేసులు నమోద య్యాయని నేషనల్‌ ‌క్రైమ్‌ ‌రికార్డస్ ‌బ్యూరో వెల్లడిస్తున్నది. గతంలో కంటే అత్యాచారాలు 7.3 శాతం పెరిగాయి.
రామ రాజ్యం అని చెప్పుకునే  ఉత్తరప్రదేశ్‌,  ‌హథ్రాస్‌ ‌జిల్లా బుల్‌ ‌గార్గిలో నలుగురు యువకులు గతనెల 14న పశువులు మేపే19సంవత్సరాల మనిషా వాల్మీకి అనే యువతిపై సామూహిక అత్యాచారంచేసి,  నోటమాట రాకుండా నాలికను కోసిన దుర్ఘటన జరిగింది. అత్యాచారం వెలుగులోకి రాకుండా ఢిల్లీ  సఫ్దర్‌ ‌జంగ్‌ ఆసుపత్రిలో… ఈ సంఘటనలో పోలీసుల తీరు ఆక్షేపణీయం. కనీసం కేసు సమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌ ‌దాఖలు చేయలేదు. బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉండాల్సిన పోలీసులు, వారిని బెదిరించి,  బంధించి కడసారి చూపు నోచుకోకుండా యువతి అంత్య క్రియలు చేయడమేమిటి?  అత్యాచారాల హత్యల ఘటనల్లో బాధితులు  బడుగు వర్గాలకుచెందిన వారైతే ఒకరకంగా, అగ్ర కులాల వారైతే మరొక విధంగా పోలీసు, మీడియా స్పందనలో వివక్ష కనపడుతున్నది. మహిళల సంరక్షణకు పార్లమెంట్‌ 1956 ‌నుంచి 2005 వరకు…  నిర్భయ చట్టం, దిశ చట్టం, ఫోక్సో …ఇలా ఎన్నో, ఎన్నెన్నో చట్టాలు చేసినా,  అత్యాచారాలు పెరుగుతునే ఉన్నాయి. ఈ చట్టాల గురించి ,ప్రతి మహిళ తెలుసుకోవాలి. మహిళల మీద జరిగే దాడులను ఉపేక్షిస్తూ మౌనంగా ఉంటే  కుదరదు.

మహిళలపై తరుచుగా జరిగే ఈ ఆకృత్యాలకు ,అక్రమాలకు కారణాలు ఏమిటి? మహిళలను శారీరకంగా మానసికంగా బలహీనులుగా అసమానత పెంచడం వలన వారిపై దాడులు జరుగుతున్నాయని సామాజిక శాస్త్రవేత్తలు అంటున్నారు. స్త్రీ అంగాంగ ప్రదర్శన, వర్ణనలకు ప్రాధాన్యతనిస్తూ, శృంగార వస్తువుగా చిత్రీకరిస్తూ  చలన చిత్రాలలో చూపడం  దారుణం. నియంత్రణ లేని ఆశ్లీల సాహిత్యం, అసభ్యకర దృశ్యాలు నేడు మొబైల్స్ ,‌కంప్యూటర్లలో లభిస్తుండటంతో  యువత అత్యాచారాలకు పాల్పడేలా దోహదపడుతున్నది. చిన్నతనం నుంచి ఆలోచన విధానం, వ్యక్తిత్వం, క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ కరవై క్రమశిక్షణ రాజకీయ పలుకుబడి, పోలీస్‌ ‌వ్యవస్థ పనితీరుకూడా  ఇందుకు కారణంకావచ్చు. జస్టిస్‌ ‌వర్మ కమిటీ నివేదికలో  మహిళలపై అత్యాచారాలు పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వాల పాలనా వైఫల్యం, పోలీసుల స్పందనా రాహిత్యం అని పేర్కొన్నారు. మరి దీనికి పరిష్కారం ఏమిటి? సత్వర న్యాయాన్ని  అంతర్భాగంగా చూడాలి. మౌలిక వసతులు కల్పించి  వ్యవస్థా గత మార్పులో భాగంగా న్యాయమూర్తుల సంఖ్య పెంచి ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టులు ఏర్పాటు చేయాలి.మహిళలపై నేరాలకు ప్రధాన కారణం ఉన్మాదం,  మద్యం. అందుకే మద్య నియంత్రణ అవసరం.

మీడియా ప్రసారాలు,  సినిమాలు, టీవీ సీరియల్స్, ‌వ్యాపార ప్రకటనల లో  మహిళలను చిత్రీకరించే ,చూపించే పద్ధతిలో సంస్కారవంతమైన మార్పు రావాలి.  తలిదండ్రులు మగ పిల్లలను మహిళల పట్ల గౌరవ భావం పెంపొందేలా పెంచాలి. పాఠశాలలో ఆత్మరక్షణ విద్యలైన కరాటే, జూడో  నేర్పాలి. పోలీస్‌ ‌సహాయం లభించే 100/1098 ఫోన్‌ ‌నెంబర్ల అవసరం చెప్పాలి. తమ వెంట పెప్పర్‌ ‌స్ప్రే, సేఫ్టీ రాడ్‌, ‌కారం పొడి లాంటివి ఉంచుకోవాలి.  నిర్మానుష్య ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకూడదని చెప్పాలి. నిన్నగాక మొన్న ఖమ్మం పట్టణంలో 13 ఏళ్ల బాలికను ఇంటి యజమాని కుమారుడు బలాత్కరించి పెట్రోల్‌ ‌పోసి నిప్పంటించటం  ఎంత దుర్మార్గం..? మహిళను కాపా డుకుంటేనే  భేటీ బచావో  నినాదానికి అర్థం ఉంటుంది. లేకుంటే, భేటీ బచావో కాదు  బేటీ మర్‌ ‌జావో అవుతుంది. అచ్చే దిన్‌ ‌కాదు సచ్చే దిన్‌ అవుతుంది….

Tanda Sadanandam, District
తండా సదానందం, జిల్లా
ఉపాధ్యక్షుడు, టి.పి.టి.ఎఫ్‌. ‌మహబఃబాద్‌ ‌జిల్లా. 9989584665

Leave a Reply