Take a fresh look at your lifestyle.

మద్యం అమ్మకాలపై మహిళల ఆందోళనలు

  • లాక్‌డౌన్‌ ‌నిబంధనల సడలింపులపై ఆగ్రహం
  • పట్టించుకోని ప్రభుత్వాలు

కొరోనాకు మద్యం కూడా తోడైతే మా బతుకులు ఏమైపోతాయని మహిళలు ఆందోళన చెందుతున్నారు. గత 40రోజలుగా తామంతా సుఖంగా ఉన్నామని పలువురు మహిళలు అంటున్నారు. కొన్నిచోట్ల మహిళలు తీవ్రంగా ప్రతిఘటించి దుకాణాలు బలవంతంగా మూసివేయిస్తున్నారు. అలాగే ఆందోళనలకు దిగుతున్నారు. తమ ప్రాంతాల నుంచి షాపులను తరలించాలని కోరుతున్నారు. ప్రజల ప్రాణాల పట్ల పాలకులకూ శ్రద్ద లేదని ఆరోపిస్తున్నారు. కరోనాను ఎదుర్కోవాలంటే రోగనిరోధకశక్తి అవసరమనీ, రోగనిరోధకశక్తిని తీవ్రంగా హరించివేసే మద్యపానాన్ని అనుమతించడం విచిత్రం అంటూ విమర్శలకు దిగుతున్నారు. మద్యనిషేధాన్ని కొనసాగించాలంటూ పలుచోట్ల మహిళలు ధర్నాలకు దిగారు. అయినా ప్రభుత్వాలు వారి ఆందోళనలను పట్టించుకునే స్థితిలో లేవు. ఆదాయాలు తీవ్రంగా దెబ్బతిని ఉన్న స్థితిలో ప్రజలను మరింత పీల్చిపిప్పిచేయడానికి పాలకులు సంకల్పించడంపై ఆందోళన చెందుతున్నారు. సరిహద్దు రాష్టాల్లో్ర మద్యం విక్రయాలు ఆరంభమైన స్థితిలో తెలంగాణలో కూడా మద్యం అమ్మకాలకు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చారు. కరోనా నియంత్రణకోసం సరిహద్దులను కఠినంగా కాపాడుకున్నవారికి దృఢసంకల్పం ఉంటే మద్యం అక్రమరవాణానికి అడ్డుకోవడం పెద్దకష్టమే కాదు. ప్రభుత్వాలు మద్యనిషేధం అమలు చేయడం మాట దేవుడెరుగు, కనీసం లాక్‌డౌన్‌ ‌పూర్తిగా ఎత్తివేసేంత వరకూ విక్రయాలపై నిషేధం అమలు జరిపితే బాగుండని మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు అంటున్నారు.

మద్యం అమ్ముకోవచ్చన్న కేంద్రం వెసులుబాటును అనేక రాష్ట్రాలు ఆత్రంగా అందిపుచ్చుకున్నాయి. ఇంతకాలమూ నాల్కలు పిడచకట్టుకుపోయి ఉన్న మద్యపాన ప్రియులు నిబంధనలను తోసిరాజని ఒక్కసారిగా మద్యం దుకాణాల దకు ఎగబడ్డారు. చాలా చోట్ల ఉదయం ఆరుగంటలనుంచే వందలాది మంది బారులు తీరారు. ఆరడుగుల భౌతికదూరం, దుకాణం ముందు ఏకకాలంలో ఐదుగురు మాత్రమే ఉండాలన్న నియమాలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. కనీసం మాస్కులు కూడా ధరించనివారు కోకొల్లలు. తోపులాటలు, వాగ్వాదాలు, భౌతికదాడులను పోలీసులు నియంత్రించలేక లాఠీచార్జీ చేయవలసి వచ్చింది. పరిస్థితి అదుపు తప్పడంతో షాపులు కూడా మూసివేయించవలసి వచ్చింది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ‌మరికొంతకాలం కొనసాగించాలన్న లక్ష్యం నీరుగారిపోయింది. లాక్‌డౌన్‌ను మరింత పొడిగించినా, మద్యం దుకాణాలను మాత్రం తక్షణమే తెరవాలని ప్రజలు డిమాండ్‌ ‌చేశారన్న ధోరణిలో ప్రభుత్వాల ఉన్నాయి. ఇకపోతే మద్యం దుకాణాల ముందు ఈ విపరీతమైన రద్దీని నివారించాలంటే తెరిచివుంచే సమయాన్ని మరింత పెంచాలని కొన్ని రాష్ట్రాల్లో పోలీసులు నివేదికలు ఇచ్చినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మద్యపాన ప్రియులు ఇలా ఒక్కసారిగా ఎగబడతారనీ, నిబంధనల ఉల్లంఘన తీవ్రంగా జరుగుతుందని ప్రభుత్వాలకు తెలియదను కోలేం. పేదలను ఇంతకాలమూ నిబంధనల పేరిట తీవ్రంగా హింసించిన ప్రభుత్వాలు, ఈ మద్యం విక్రయాల కోసం వందలాదిమందిని రోడ్డుదకు యధేచ్ఛగా తీసుకొచ్చి నలభైరోజుల లాక్‌డౌన్‌ ‌కష్టాన్ని నీరుగార్చింది. సంపూర్ణ మద్యనిషేధ లక్ష్యాన్ని ఓ నవరత్నంగా ప్రకటించుకున్న ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో కొరోనా విజృంభణ తీవ్రంగా ఉన్నా, మద్యం అమ్మకాలు ఆరంభించడంతో పాటు ప్రభుత్వం ధరలను సైతం పెంచింది. పైగా, కొనుగోళ్ళను నిరుత్సాహపరచేందుకే అదనపు సర్‌చార్జి విధించామనీ, మద్యనిషేధంవైపే ఇలా అడుగులు వేస్తున్నామని ప్రకటించుకుంది. ఇంతకాలం మూతబడిన దుకాణాలను తెరిచి, ధరలు పెంచడం వేలకోట్లు కూడబెట్టుకోవడానికే కానీ, ప్రజలకు మేలుచేయడానికి కాదని టిడిపి, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్‌ ‌పార్టీలు విమర్శించాయి.

Leave a Reply