Take a fresh look at your lifestyle.

లోకేశ్‌ ‌శవరాజకీయాలు చేయడం తగదు

మహిళా కమిషన్‌ ‌చైర్‌పర్సన్‌ ‌వాసిరెడ్డి పద్మ

అమరావతి,సెప్టెంబర్‌ 9 : ఇప్పు‌డే లోకేష్‌ ‌పర్యటన చేయాల్సిన అవసరమేముందని మహిళా కమిషన్‌ ‌చైర్‌పర్సన్‌ ‌వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. గురువారం ఆమె డియాతో మాట్లాడుతూ, శవాల ద పేలాలు ఏరుకుంటూ లోకేష్‌ ‌రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆడపిల్లల చావులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడమేంటి.. ప్రతిపక్షంగా కు బాధ్యత లేదా అని ఆమె ప్రశ్నించారు. అన్యాయం జరిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేస్తోంది. జరుగుతున్న ఘటనలు దురదృష్టకరం. దిశ చట్టాన్ని  హయాంలో ఎందుకు తీసుకురాలేదు. దిశ చట్టం ద్వారా మహిళలకు న్యాయం జరిగేలా ప్రయత్నిస్తు న్నామని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఇకపోతే లోకేష్‌ ‌శవ రాజకీయాలు చేస్తున్నారని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు.

గురువారం ఆయన డియాతో మాట్లాడుతూ, ఏడు నెలల క్రితం అనూష చనిపోతే లోకేష్‌కు ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. నిందితుడిని 24 గంటల్లోనే పోలీసులు అరెస్ట్ ‌చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని మూడో రోజే అందించాం. అనూష కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంది. కులమతాల మధ్య చిచ్చుపెట్టడానికి లోకేష్‌ ‌ప్రయత్నిస్తున్నారు. మొన్న రమ్య మృతదేహం అడ్డంపెట్టుకుని లోకేష్‌ ‌రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నించారు. ఇవాళ 7 నెలల క్రితం చనిపోయిన అనూష కేసును అడ్డంపెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు హయాంలో జరిగిన కాల్‌ ‌మనీ వ్యవహారంలో ఏం జరిగిందో అందరికీ తెలుసునని గోపిరెడ్డి అన్నారు.

Leave a Reply