Take a fresh look at your lifestyle.

రుణాలు సకాలంలో తీరుస్తున్న మహిళలు..!

శక్తివంతులని మంత్రి హరీష్ రావు ప్రశంస
సంగారెడ్డి ,ఫిబ్రవరి 12:మహిళలు శక్తివంతులని, రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లిస్తుంది మహిళ లేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. శుక్రవారం నాడు సంగారెడ్డి పట్టణంలోని కింగ్స్ ప్యాలెస్ లో ఏర్పాటుచేసిన రుణాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడుతూ, బ్యాంకులు అప్లికేషన్ ఫీజ్ ,ప్రాసెసింగ్, ఇన్స్పెక్షన్ చార్జెస్ అని ఏదో ఒక పేరుతో ఇచ్చిన అప్పు లో కొంత మినహాహించుకుంటున్నాయని అన్నారు.

మహిళ స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్న రుణాలపై వసూలు చేస్తున్న వడ్డీ లో కొంత మొత్తాన్ని జిల్లా సమాఖ్య కు ప్రోత్సాహకంగా అందించాలని గ్రామీణ అభివృద్ధి శాఖ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మధ్య ఒప్పందం మేరకు వసూలైన వడ్డీలో .5 శాతం చెల్లించేందుకు డి సి సి బి ముందుకు వచ్చిందన్నారు. డి సి సి బి పరిధిలోని సంగారెడ్డి జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాలకు గత సంవత్సరం జూలై నుంచి ఈ సంవత్సరం జనవరి వరకు 53 కోట్ల రూపాయల రుణాలు అందించారని, మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలపై ఆయా సంఘాల ద్వారా రూ 75 లక్షలు వడ్డీ రూపంలో బ్యాంకుకు వచ్చిందనితెలిపారు. అట్టి మొత్తంలో .5 శాతం సుమారు రూ.4 లక్షల చెక్కును జిల్లా సమాఖ్యకు మంత్రి అందజేశారు.

మహిళ స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్న రుణాలపై వడ్డీని 12 శాతం నుండి 11 శాతానికి తగ్గించి ఇవ్వాలని మంత్రి డి సి సి బి చైర్మన్ ను కోరారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సంగారెడ్డి జిల్లా సమాఖ్య కు వసూలైన వడ్డీ లో కొంత ప్రోత్సాహకాన్ని ఇస్తున్నామన్నారు. భవిష్యత్తులో సిద్దిపేట మెదక్ జిల్లాలలో కూడా అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.మహిళా గ్రూపులను బలోపేతం చేయడంలో భాగంగానే ఇట్టి ప్రోత్సాహకాలు మరింత ఉపయోగపడతాయన్నారు.

మహిళ స్వయం సహాయక సంఘాలు కట్టిన వడ్డీ లో వారి వాటా కొంత ఇచ్చి జిల్లా ,మండల, గ్రామ సమాఖ్యల బలోపేతానికి శ్రీకారం చుట్టామని మంత్రి అన్నారు.మహిళ సంఘాలకు 20 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజి చెక్కును మంత్రి అందజేశారు. ఖరీఫ్ రబీ 2019-20 సీజన్ లకు సంబంధించి ఫ్యాక్స్ సెంటర్లకు వరి ధాన్యం అమ్మకాల కమిషన్ రూ.2.03 కోట్ల చెక్కులను మంత్రి అందజేశారు.జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార సంఘం ద్వారా స్వయం ఉపాధి పథకం కింద ఎస్సి యువతకు మంజూరైన (3) మొబైల్ టిఫిన్ సెంటర్ వాహనాలకు మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.

3 యూనిట్లు ఒక్కొక్కటి రూ. 7.50 లక్షల తో మంజూరు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి , ఫరూడొద్దీన్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ రాజర్షి షా, శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, డి సి సి బి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ డిసిఎంఎస్ చైర్మన్, డి సి సి బి బ్యాంక్ డైరెక్టర్, పాలకవర్గం సభ్యులు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు, మండల గ్రామ ఐక్య సంఘాల మహిళలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply