Take a fresh look at your lifestyle.

మహిళలకు అండగా…సఖి తోడుగా

  • పోకిరిలకు అడ్డుకట్ట వేయడం కోసం సఖి వన్‌ ‌స్టాప్‌ ‌సెంటర్‌లో అతివలకు సత్వర న్యాయం
  • ధిత మహిళలకు అన్ని సేవలు ఒకే చోట
  • హింసలపై అవగాహన కల్పిస్తున్న సఖీ బృందం
  • 175 సదస్సుల ద్వారా 28,726 మందికి అవగాహన
  • కేంద్రానికి చైర్మన్‌గా కలెక్టర్‌ ‌వ్యవహరణ

నాగర్‌కర్నూల్‌ ‌జూలై 14,ప్రజాతంత్ర విలేకరి: మహిళలకు తోడు.. అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం సఖి కేంద్రాలను ఏర్పాటుచేసింది. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మహిళలపై దాడులు, హత్యలు, ఆత్మహత్యలు, గృహ హింసలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని కట్టడి చేయటానికి ఈ కేంద్రాన్ని నాగర్‌ ‌కర్నూల్‌ ‌పట్టణ కేంద్రంలో 2019 ఏప్రిల్‌ ‌లో ప్రారంభించారు. ఇప్పటికే పోలీస్‌ ‌శాఖ వారు పోకిరీల భరతం పట్టేందుకు షీ టింలను నడిపిస్తుంది. కానీ అనేక సందర్భాల్లో మహిళలు, యువతులు వారికి జరుగుతున్న దాడులకు అవమానాలను బయటికి చెప్పుకోలేక మదన పడిపోతుంటారు. అలాంటి వారికోసమే ఈ సఖి కేంద్రాలు. భారతదేశంలోని 25 రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో సఖి కేంద్రాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహిస్తున్నాయి. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఒక భిన్నమైన ఆ చరణకు శ్రీకారం చుట్టారు. స్త్రీ ఆధ్వర్యంలో పని చేస్తున్న కొన్ని స్వచ్చంద సంస్థలను టాటా ఇన్‌స్టి ట్యూట్‌ ఆఫ్‌ ‌సోషల్‌ ‌సైన్స్ ‌ప్రోత్సాహంతో ఎంపిక చేసి సఖి కేంద్రాల నిర్వహణ బాధ్యతను అప్పగించారు. నాగర్‌ ‌కర్నూలు మహిళా శిశు అభివృద్ధి శాఖ, శ్రామిక వికాస కేంద్రం సొసైటీ (ఎస్వికె), స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో 2019 ఏప్రిల్‌ ‌లోసఖి కేంద్రాలను ప్రారంభించారు.

గుట్టుగా సమస్య పరిష్కారం
చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎలాంటి స మస్యలున్నా సఖి కేంద్రం గుట్టుగా సమస్యను పరిష్క రిస్తోంది. అత్తమామలతో గాని, భర్తతో గాని గొడవలు జరిగినప్పుడు సఖి కేంద్రాన్ని ఆశ్రయించే మహి ళలకు 1 నుంచి 5 రోజుల పాటు వసతి సౌకర్యం కల్పిస్తారు. బట్టలు, సబ్బులు, టవాల్‌, ‌బొట్టు, నూనె వంటి 12 రకాల వస్తువులతో కూడిన వెల్‌కం కిట్టును ఉచితంగా ఇస్తారు. గృహహింసలకు, వరకట్న, పనిచేసే చోట వేధింపులకు, లైంగిక హింసలకు, ఆడపిల్లల అమ్మకం వంటి చర్యలను అరికట్టడం కోసం సఖి కేంద్రం పనిచేస్తుంది. ముఖ్యంగా లాక్‌ ‌డౌన్‌ ‌సమయంలో గృహ హింస కేసుల సంఖ్య ఎక్కువగా పెరిగాయని అవి పరిష్కరించేందుకు ఆ సమయంలో కూడా సఖి వన్‌ ‌స్టాప్‌ ‌సెంటర్‌ ‌సేవలు కొనసాగాయి. అందుకోసం హెల్ప్‌లైన్‌ 181 ‌నంబర్‌ ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లాకు ప్రత్యేక ల్యాండ్‌ ‌నంబర్‌ 08540-298000‌తో పాటు సెల్‌ ‌నెంబర్‌ 9951940181 ‌వినియోగంలో ఉంచారు. దీంతో ఫోన్‌లో సలహాలు, సఖి కేంద్రంలో కౌన్సిలింగ్‌, ‌పోలీస్‌స్టేషన్‌లో రక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. హింసలు, దాడులు, వేధింపులకు గురైన వారు సఖి కేంద్రాన్ని ఆశ్రయిస్తే వన్‌ ‌స్టాప్‌ ‌సెంటర్‌(ఓఎస్‌డీ)సేవలను అందిస్తారు. సహజంగా దాడు లకు గురైన మహిళలు మొదట పోలీసులను, ఆసుపత్రిని ఆశ్రయించి, కోర్టులో పరిష్కా ర మార్గాలను వెతుకుతారు. అలాంటి వారికోసం ఈ ఓఎస్‌డీ పనిచేస్తుంది. సఖి కేంద్రంలో 14మంది స భ్యులతో కూడిన బృందం పనిచేస్తోంది.

విస్తృత ప్రచారం….
జిల్లా కేంద్రంలో ఏర్పాటైన సఖి కేంద్రం పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంత మహిళల వరకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అందుకోసం గోడ పత్రికలు, కరపత్రాలు, కళాజాత, మహిళ సమాఖ్య, బడులు, కళాశాలల్లో, అంగన్‌వాడీల్లో అవగాహన కార్యక్ర మాలు ఏర్పాటుచేశారు. బాధితుల అవసరాల కోసం వెళ్లేందుకు ప్రత్యేక ఒక వాహనాన్ని సమకూర్చారు. 2019 ఏప్రిల్‌ 8 ‌నుంచి నేటి వరకు సఖి బృందం 60మంది అధికారులను కలిసి వివిధ కార్యక్రమాల ద్వారా 175 సదస్సులు నిర్వహించి 28,726 మందికి సఖి కేంద్రంపై అవగాహన కల్పించారు. ఇప్పటివరకు సఖిలో 254 కేసులు రిజిష్టేషన్‌ ‌చేసుకోగా నేటి వరకు వరకు 222 కేసులను పరిష్కరించారు. వాటిని తిరిగి ఆరు నెలల వరకు పర్యవేక్షిస్తూ ఉంటారు. 32 కేసులు పరిష్కరించేందుకు వివిధ దశల్లో చర్చిస్తున్నారు. మహిళలకు ఎంతో ఉపయోగం, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని శ్రీమతి ప్రజ్వలలి సఖి కేంద్రం మహిళలకు ఎంతో ఉపయోగకరం. దాడులకు, హింసలకు, లైంగిక దాడులకు గురైన వారికి ఒక్క పైసా ఖర్చు కాకుండా ఉచిత సేవలు అందిం చడమే కాకుండా, వసతిగృహ ఎర్పా టుతో పాటు, వెల్‌కం కిట్టు ఇస్తారని, ప్రతి మహిళా తమ హక్కులతోపాటు తమను తాము కాపాడుకోవాలని ఆమె తెలిపారు.

అతివల సమస్యలపై సత్వర స్పందన, సఖి కేంద్రం సెంటర్‌ అడ్మినిస్ట్రేటర్‌ అధికారిణి పుట్టపాగ సునీత
సఖి వన్‌ ‌స్టాప్‌ ‌సెంటర్లో ప్రస్తుత సమాజములో స్త్రీలు, బాలికలు ఎదుర్కొంటున్న వివిధ వేదింపులు హింసల నుండి రక్షణ కల్పించడానికి సఖి వన్‌ ‌స్టాప్‌ ‌సెంటర్‌ ‌కృషి చేస్తుందని, గృహ హింస, పనిచేసే చోట లైంగిక వేదింపులు, స్త్రీలు, పిల్లలు అక్రమ రవాణా, విద్య సంస్థలలో లైంగిక వేదింపులు, అత్యాచారాలు, యాసిడ్‌ ‌దాడులు మొదలైన హింసల నుండి రక్షణ కల్పించడం జరుగుతుందని, వేదింపులు గురి కాబడిన, కట్టు బట్టలతో ఇండ్ల నుండి బయటకు వచ్చిన బాధిత స్త్రీల కోసము సఖి కేంద్రము లో 1. కౌన్సిలింగ్‌ ‌సేవలు 2. న్యాయ సేవలు 3. పోలీస్‌ ‌సేవలు 4 . వైద్య సేవలు 5 . అత్యవసర తాత్కాలి వసతి అందించబడుతున్నాయని, 24 /7 గంటలు బాధిత మహిళకు కోసం సఖి కేంద్రాన్ని సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.

Leave a Reply