ఐదు సంవత్సరాల నుండి తాసిల్దార్ కార్యాలయం చుట్టూ భూమి పట్టా చేయమని తిరిగి వీఆర్వో కు పైసలు ఇచ్చిన కూడ పని కాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో మహిళా రైతు ఆవేదనతో తన కుమారుడితో కలిసి ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి సిద్దమైండి వివరాల్లోకి వెళితే బుధవారం మండలంలోని లింగ్యా తండా (కురవి) గ్రామపంచాయతీ కి చెందిన ఇస్లావత్ క్రాంతి తనకున్న ఒక ఎకరం 20 గుంటల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ తన ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటూ ఉంది. భర్త ఇస్లావత్ లఘుపతి గత పది సంవత్సరాల క్రితమే మరణిం చాడు. సాదాబైనామాలో భూమి పట్టా చేయాల్సిం దిగా వీఆర్వో కొమురయ్యకు తన పేర ఉన్నా భూమి కాగితాలను ఆయనకు ఇచ్చి నెలలు గడుస్తున్నా భూమి పట్టా చేయకపోవడంతో తన అసిస్టెంట్ తో మాట్లాడమని చెప్పటంతో 15 వేల రూపాయలు ఇస్తే పట్టా చేస్తా అని చె ప్పటంతో మహిళా రైతు నివ్వెరపోయింది. డబ్బులు తీసుకొని రా నీ పని అయిపోతుంది అని కరాఖండిగా చెప్పడంతో చేసేదేమీలేక తం డాలో 15 వేల రూపాయలు అప్పు చేసి విఆర్ఓ కీ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
224/సర్వే నెంబరు ఇస్లావత్ కాంతి పేరు మీద ఉండగా అట్టి భూమి ఇస్లావత్ కిష్టు పేరు మీద పట్టాఅయ్యింది పాస్బుక్ కూడా రావడంతో ఆమె తాసిల్దార్ కార్యాలయంలో ఎన్నిసార్లు మొరపెట్టు కున్నా ఆమె మాటను పట్టించుకునే నాథుడే లేకపోవడంతో ఆత్మహత్య చేసుకో పోయిందని స్థానికులు తెలిపారు. వీఆర్వోల నిర్లక్ష్యంతో గతంలో కూడా ఇలాంటివి సంఘటనలు జరిగిన ట్లు. భూమి ఒకరిది పట్టా ఇంకొకరి పైన చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని రైతులు తెలిపారు. మహిళా రైతుని ఆమె కుమారుడు బాలుని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ విషయమై తాసిల్దార్ విజయ్ కుమార్ ను చరవాణి లో వివరన అడగా 224 సర్వే నెంబర్లో 15 ఎకరాలు పూర్తిగా ఉందని మల్యాల గ్రామస్తుల భూమి కూడా ఈ సర్వే నెంబర్లో ఉందని ఆయన తెలిపారు. ఎంజాయ్ మెంట్ సర్వే కోసం ఫైల్ తయారు చేశామని సర్వేయర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామన్నారు. మంగళవారమే సర్వేయర్ రావా ల్సి ఉండగా ప్రభుత్వ భూమి సర్వే చేసే పనిలో ఉండి రాలేకపోయాడు అని ఆయన తెలిపారు. రెండు రోజుల్లో సర్వే చేయించి ఆమె పేరు మీద పట్టా చేస్తామని తెలిపారు. ఇట్టి భూమి నా దృ ష్టికి వారం కిందట వచ్చిందని వెంటనే ఎంజా య్మెంట్ సర్వేకు సిఫార్సు చేసినట్లు తెలిపారు.