వడదెబ్బతో యువతి మృతిచెందిన సంఘటన మండలపరిధిలో వడ్డుగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. వడ్డుగూడెం గ్రామానికి చెందిన మడకం రాములు, కూమారి దంపతుల కుమార్తె, నవ్య (17) వడదెబ్బతో మంగళవారం విరోచానాలు వాంతులతో అస్వస్థతకు గురైయింది. కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పడికే పరిస్థితి విషమించడంతో అదేరోజు రాత్రి మృతిచెందింది.