Take a fresh look at your lifestyle.

రామరాజ్యం లేకుండా రామమందిరం?

అరణ్య కాండ ప్రారంభంలో  రాజ ధర్మాన్ని గురించి వివరిస్తూ రాజు రుజువర్తనలకు సంరక్షకులుగా, ఆపన్నులను ఆదుకునే వాడుగా ఉండాలి.  ఆపన్నులను ఆదుకోవడం రాజధర్మాల్లో ప్రధానమైనది.  తాము ఆపన్నులను ఆదుకుంటున్నామని బీజేపీ ప్రభుత్వం చెప్పుకోగలదా?  ‘‘దేశ్‌ ‌కే గద్ద్దారోంకో గోలీమారో సాలోన్‌ ‌కో’’ అనే నినాదాలు చేస్తున్నారు.  రామకథను బట్టి చూస్తే వీరంతా ఎలాంటి మనుషులు  ఎటువంటి రామరాజ్యాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. 

నిషితా గౌతమ్‌, ‘‌ది క్వింట్‌’
‌ప్రధానమంత్రి రామమందిరం నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేయడం వల్ల రామమందిరం కల సాకారానికి అడుగు ముందుకు పడింది. మోడీ పార్లమెంటులో ఈ ప్రకటన చేయగానే అధికార పార్టీ ఎంపీలంతా జై శ్రీరామ్‌ అం‌టూ నినాదాలు చేశారు. మన రాముడంటే.. మన దేశంలో కోట్లాది మంది ఊహల్లో ఆలోచనల్లో మెదిలే ఒక విగ్రహం. ఆయనను ఒక నినాదం స్థాయికి తగ్గించారు. జై శ్రీరామ్‌ ‌నినాదం విజయానికి సోపానం. అలా నినదించే వారి విజయానికి నిర్ణయాత్మకం. ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక సంఘటనల తర్వాత రాముడి పేరు అప్రతిష్ట పాలైంది. ఎందుకంటే విధ్వంసకారులు ధ్వంసం చేసిన మసీదుపై జై శ్రీరామ్‌ ‌పతాకం ఉంది. అంతేకాక, హిందూ ఆందోళకారుల మూకలు జైశ్రీరామ్‌ అని నినదిస్తూ హింసకు పాల్పడుతున్న వీడియో దృశ్యాలు కళ్ళ ముందు మెదులుతున్నాయి. బాహ్యమైన దాడులకన్నా ఈ నినాదాలు రాముని దివ్యత్వానికి హాని చేస్తున్నాయి. పోలికలు తెచ్చే చర్యల గురించి నినాదాల గురించి చెప్పాల్సిందేమీ లేదు. ముస్లిం కుటుంబాలో్ల పుట్టినవారు దానిని గురించి చెబుతారు. నేను ఏ మతంలో అయితే పుట్టానో దానికి కట్టుబడి ఉంటాను.

రామకథ… రామరాజ్యం…
హిందూ రాజకీయ ఊహలలో రామరాజ్యం గురించి తరచూ ప్రస్తావన వస్తుంది. రామరాజ్యం అనేది ఊహా చిత్రం. ఈ దేశంలో ప్రజల మధ్య సామాజిక, సాంస్కృతిక సంబంధాలకు అది ఒక వారధి. దేశంలో ప్రస్తుతం విభజన ధోరణులు వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో రామకథ గురించి తెలుసుకుందాం. రామాయణంలో అయోధ్యకాండ తొలికాండ. అందులోనూ, అరణ్యకాండలోనూ రాజు ధర్మాల గురించి నిర్ధారించడం జరిగింది. రాజధర్మాన్ని గురించి లేదా క్షాత్ర ధర్మాన్ని గురించి స్పష్టం చేయడం జరిగింది. ( అప్పట్లో క్షత్రియులే పాలకులు) అయోధ్య కాండలో క్షత్రియుల ధర్మాన్ని నిర్వచించడం జరిగింది. హింసను అరికట్టడం వారి మొదటి ధర్మం. హింసను పూర్తిగా అరికట్టడం అత్యవసరం. అయోధ్య కాండలో హింస ఎక్కడా లేదు. క్షత్రియ ధర్మం బ్రాహ్మణీక వ్యవస్థను కాపాడాలని ఉంది. బ్రాహ్మణుడంటే పుట్టుక కాదు. విద్య, విజ్ఞానం ద్వారా బ్రాహ్మణుడైనవాడు. రుషులు, మునులకు రక్షణ కల్పించడం క్షాత్ర ధర్మం. రాముని జీవితం దాంతోనే ప్రారంభమైంది. విశ్వామిత్రుని యాగాన్ని సంరక్షించాడు.

దేశంలో పండితులు సురక్షితంగా ఉన్నారా
అరణ్య కాండ ప్రారంభంలో రాజ ధర్మాన్ని గురించి వివరిస్తూ రాజు రుజువర్తనలకు సంరక్షకులుగా, ఆపన్నులను ఆదుకునే వాడుగా ఉండాలి. ఆపన్నులను ఆదుకోవడం రాజధర్మాల్లో ప్రధానమైనది.
తాము ఆపన్నులను ఆదుకుంటున్నామని బీజేపీ ప్రభుత్వం చెప్పుకోగలదా? ‘‘దేశ్‌ ‌కే గద్ద్దారోంకో గోలీమారో సాలోన్‌ ‌కో’’ అనే నినాదాలు చేస్తున్నారు. రామకథను బట్టి చూస్తే వీరంతా ఎలాంటి మనుషులు ఎటువంటి రామరాజ్యాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. ఆందోళనకారులు రావణాసురుణ్ణి తలపిస్తున్నారు. రావణాసురుడు తనదైన రీతిలో ఒక పండితుడు. స్వర్ణ నగరం లంకను పాలించాడు. నీతి లేదా నిర్దిష్ట విధానంతో పాలించాడు.  ఆ తర్వాత ప్రస్తుత పరిస్థితులకు సరిపోలిన యుద్ధ కాండ. సుందరకాండలో హనుమంతుడు రావణరాజ్యంలో విధ్వంసాన్ని సృష్టించాడు. రామదూతగా ఆయన లంకలో చెలరేగాడు.

ఈ లోకంలో మూడు రకాల మనుషులు ఉంటారు. ఉత్తములు, మధ్యములు, అధ•ములు. ఇప్పుడు నేను వారిని మంచి, చెడు లోపాలను బట్టి నిర్ధ్దారిస్తున్నాను. అత్యున్నత స్థానంలో ఉన్న మనుషులు తమ వారిని సంరక్షించడం, తమ సంక్షేమాన్ని గురించి ఆలోచించడం చేస్తుంటారు. రెండోవారు రుజువర్తనతో కూడిన చర్యల ద్వారా ఉత్తములవుతారు. మంచి చెడు ఆలోచించకుండా చర్యలకు పాల్పడేవారిది తరువాత స్థానం.

నేటి ప్రభుత్వం ఏం చేస్తోంది.?
రాముడు కూడా నీతిని త్యజించలేదు.. అరణ్య కాండలో రావణుడు సీతను అపహరించడంతో రాముని పాత్ర నాటకీయం అయింది. దుఃఖంతో ఆయన మతి భ్రమించింది. అంతకుముందు రామకథలో రాముని పాత్రను ఎంత జాగ్రత్తగా నిర్వచించారో.. అదంతా తన భార్య అపహరణకు గురైన తర్వాత రామునిలో మాయమైంది. రాజకీయ నీతి నియమాలను తిరస్కరించడమే కాకుండా వాటిని ఆచరించలేదు. లక్ష్మణుడిది ఆకాశంలో క్షిపణుల మాదిరి, ముల్లోకాల్లో ఎక్కడా లేని జీవుల మాదిరి పాత్ర. అన్న మాట జవదాటని వ్యక్తి. రాముడు చేసిందేమిటి తన భార్య కోసం తీవ్రమైన యుద్దాలు చేశాడు. అంతిమంగా ఆమె దక్కగానే అగ్నిప్రవేశం చేయమన్నాడు. చివరగా రాముడు సర్వాంతర్యామి, సర్వజ్ఞ. సర్వవ్యాపకుడని మరువలేం.అయోధ్యలో రామమందిరం త్వరలో వస్తుంది. అయితే అది అజ్ఞాతం నుంచి ఇంకా బయటపడని రాముని కీర్తికి ఏం మేలు చేస్తుంది..? రాముని గుడికోసం దేశం ఎదురుచూస్తున్నదా..? రామరాజ్యం కోసం ఎదురుచూస్తున్నదా..?  కాని బీజేపీ రామరాజ్యం లేకుండా రామమందిరాన్ని కోరుకుంటోందని ఢిల్లీ ఘర్షణలు రుజువు చేస్తున్నాయి.

Leave a Reply