Take a fresh look at your lifestyle.

జర్నలిస్టులపై కేసులు ఎత్తేయాలి డిజిపికి జర్నలిస్ట్ ‌నేతల వినతి

లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో జర్నిలిస్టులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని రాష్ట్ర డీజీపీ మహేందర్‌ ‌రెడ్డికి టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. దీనికి డీజీపీ సానుకూలంగా స్పందించారు. వివరాల్లోకెళితే.. కరోనా వార్తలను ప్రసారం చేసిన రెండు న్యూస్‌ ‌ఛానెళ్ల ప్రతినిధులపై నేరేడ్‌మెట్‌ ‌పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ‌జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) ప్రతినిధులు సోమవారం డీజీపీని కలిశారు. జర్నలిస్టులపై కేసులు ఎత్తివేయాల్సిందిగా వినతిపత్రం అందజేశారు. దీనికి డీజీపీ సానుకూలంగా స్పందించినట్లు టీడీయూడబ్ల్యూజే బృందం సభ్యులు తెలిపారు.

దీనిపై విచారణ జరిపి న్యాయం చేస్తామని హా ఇచ్చినట్లు చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో జర్నలిస్టులకు విధి నిర్వహణలో పోలీసుల నుంచి ఎదురవుతున్న ఆటంకాల గురించి డీజీపీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. డీపీజీని కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్‌ శ్రీ‌కాంత్‌, ‌హెచ్‌.‌యూ.జె కార్యదర్శి శిగ శంకర్‌ ‌గౌడ్‌, ఉపాధ్యక్షులు ఆకుల శ్యామ్‌, ‌హెచ్‌.‌యూ.జే ఎలక్టాన్రిక్‌ ‌డియా విభాగం అధ్యక్షుడు బాలు ఉన్నారు.

Leave a Reply