Take a fresh look at your lifestyle.

పెట్రో ధరల పెంపుతో.. సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

  • కాంగ్రెస్‌ ‌వినూత్న నిరసన..గుర్రపు బగ్గీపై అసెంబ్లీకి ఎమ్మెల్యేలు
  • అడ్డుకుని అరెస్ట్ ‌చేసిన పోలీసులు
  • వ్యవసాయ రంగాన్ని ప్రైవేట్‌ ‌వ్యక్తుల చేతిలో పెట్టే కుట్ర
  • నూతన సాగు చట్టాలపై కెసిఆర్‌ ‌వైఖరి స్పష్టం చేయాలి
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై మండిపాటు

పెరిగిన పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలతో పాటు నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్‌ ‌నేతలు గుర్రపు బండి మిద అసెంబ్లీకి ర్యాలీగా రావడానికి ప్రయత్నించారు. దీంతో వారిని గుర్రపు బండిపై అసెంబ్లీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ ‌నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇలాగే ఆసెంబ్లీకి వెళ్తామని పట్టుబట్టిన కాంగ్రెస్‌ ‌నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్‌ ‌బాబు, సీతక్క, జీవన్‌ ‌రెడ్డిలను అసెంబ్లీ ముందు పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని ఈ సందర్భంగా సీఎల్సీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు సామాన్య ప్రజలకు భారంగా మారాయన్నారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆం‌దోళనకు పిలుపునిచ్చిందన్నారు. దానికి నిరసనగా గాంధీ భవన్‌ ‌నుండి గుర్రపు బండి మిద అసెంబ్లీకి వెళ్తున్నామన్నారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ కేంద్ర విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు.

కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రైవేట్‌ ‌వ్యక్తుల చేతిలో పెట్టే కుట్ర కేంద్రం చేస్తుంటే.. దాన్ని సీఎం కేసీఆర్‌ ‌సమర్థిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిర్ణయం చెప్పాలని సీతక్క డిమాండ్‌ ‌చేశారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే..టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ప్రధాని మోదీతో లోపాయకారి ఒప్పందాలు చేసుకుందని ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ఆమె మిడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీలో కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్‌ ‌చేశారు. రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు బాధపడితే ప్రభుత్వం బాగుపడదని.. సీఎం కేసీఆర్‌ అనేక మాయ మాటలు చెప్పారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నాయని సీతక్క మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు బంద్‌లో పాల్గొంటే.. సీఎం కేసీఆర్‌ ‌ఢిల్లీకి పోయి మంతనాలు చేస్తున్నారని, దీన్ని రైతులు అర్థం చేసుకోవాలన్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించి..జరుగుతున్న బంద్‌కు మద్దతు ఇవ్వాలని, అలాగే నల్లచట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీతక్క డిమాండ్‌ ‌చేశారు.

కేంద్రాన్ని నిలదీసే దమ్ము కెసిఆర్‌కు లేదు: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి
ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌బీజేపీ, కేసీఆర్‌ ఇద్దరు ఒక్కటేనని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించాలంటే సీఎం కేసీఆర్‌ ‌భయపడుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి విమర్శించారు. కేవలం తన పదవి కాపాడుకునే ప్రయత్నాల్లో కెసిఆర్‌ ఉన్నారని అన్నారు. కేంద్రంతో చర్చల్లో ఏం జరుగుతుందో చెప్పాలన్నారు. దొడ్డు వడ్లను కొనుగోలు చేయమన్న కేంద్రం నిర్ణయంపై నిలదీయాలన్నారు. సోమవారం ఆయన మిడియాతో మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టం మిద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్‌ ‌చేశారు. రేవంత్‌ ‌రెడ్డి జుట్టు రాహుల్‌ ‌గాంధీ చేతిలో… కేసీఆర్‌ ‌చేతిలో రేవంత్‌ ‌పిలక ఉంటుందని షర్మిల చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. నిన్న మొన్న పార్టీ పెట్టిన వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడల్సిన అవసరం లేదన్నారు. ఆమె ఎం మాట్లాడుతున్నారో ఆమెకే అర్థం కావడం లేదన్నారు. షర్మిల మాటలను తాము పెద్దగా పరిగణనలోకి తీసుకొమన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ మిద ఆమె ఆరోపణలను చూశాక స్పందిస్తానన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ ‌పార్టీ మాత్రమేనని జీవన్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply