Take a fresh look at your lifestyle.

అత్యధిక కొరోనా కేసులున్న .. రాష్ట్రాలపై పర్యవేక్షణ

ఉన్నతస్థాయి సక్షలో అధికారులకు ప్రధాని మోదీ ఆదేశం
ధన్వంతరి రథ్‌ ‌ప్రయోగాన్ని పరిశీలించాలని సూచన

ప్రధాని నరేంద్రమోడీ శనివారం దేశంలో కొరోనా పరిస్థితిపై సక్ష నిర్వహి ంచారు. అత్యధిక పాజిటివ్‌ ‌రేటు నమోదవుతున్న రాష్ట్రాలపై జాతీయ స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు మోదీ ఆదేశించారు. అహ్మదాబాద్‌లో విజయవంతమైన ’ధన్వంతరి రథ్‌’ ‌కార్యక్రమాన్ని అంతటా అమలు చేస్తే బాగుంటుందని సూచించారు.  అహ్మదాబాద్‌లో ఇంటి వద్దనే బాధితులను పర్యవేక్షించడం, వైద్యం అందించే ‘ధన్వంతరి రథ్‌’‌ను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ దీన్ని అమలు చేయాలని సూచించారు. కొరోనా వైరస్‌పై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగేలా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. మహమ్మారిని సమర్థంగా కట్టడి చేస్తున్న కేంద్ర, రాష్ట్ర, స్థానిక అధికారులను ప్రశంసించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కరోనా వైరస్‌ ‌మహమ్మారి పరిస్థితిపై మోదీ సక్షించిన ప్రధాని.. రాష్ట్రాల సన్నద్ధతను తెలుసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తిగత పరిశుభ్రత, సాంఘిక ప్రవర్తన బాగుండాలని సూచించారు. కరోనాపై అవగాహనను విస్తృతం చేయాలని ఆదేశించారు. ఎవరికీ వైరస్‌ ‌సంక్రమించకుండా కఠిన చర్యలు కొనసాగించాలని, ఈ విషయంలో నిర్లక్ష్యానికి తావులేదన్నారు.

ఢిల్లీ తరహా అన్ని రాష్ట్రాలు కొరోనాను నియంత్రించాలి
కొరోనా నియంత్రణకు ఢిల్లీ మాదిరిగా అన్ని రాష్ట్రాలు స్పందించి ఆ మేరకు చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో కొరోనా పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చేపట్టిన చర్యలను మోదీ అభినందించారు. కొరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు  ఢిల్లీ మాదిరిగా వ్యవహరించాలని ప్రధాని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా నిర్వహించిన ఈ సక్షా సమావేశంలో కేంద్ర •ంమంత్రి అమిత్‌ ‌షా, కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్‌ ‌హర్ష వర్ధన్‌, ‌నీతి ఆయోగ్‌ ‌సభ్యుడు, క్యాబినెట్‌ ‌కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

error: Content is protected !!