Take a fresh look at your lifestyle.

మంత్రి హరీష్‌రావు కృషితో… ఆక్సిజన్‌ ‌ప్లాంట్స్

  • అనువైన స్థలాన్ని ఎంపిక చేసిన ప్రత్యేక బృందం
  • త్వరలోనే పనులు ప్రారంభం
  • కొరోనా తీవ్రతరం దృష్ట్యా ప్రజలకు శుభవార్త అందించిన మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, మే 6 (ప్రజాతంత్ర బ్యూరో): కొరోనా తీవ్రతరం దృష్ట్యా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట జిల్లా ప్రజలకు శుభవార్త అందించారు. కొరోనా నివారణకు భరోసా…బాధ్యతగా ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోని సంగారెడ్డి, సిద్ధిపేట,  మెదక్‌, ‌జోగిపేట, గజ్వేల్‌లలో ఆక్సిజన్‌ ‌ప్లాంట్స్ ‌నిర్మాణం చేపట్టనున్నారు. ప్లాంట్స్ ‌నిర్మాణానికి నియమించిన ప్రత్యేక బృందం అనువైన స్థలాన్ని ఎంపిక చేయగా…పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. వివరాల్లోకి వెళ్లితే… కొరోనా  మహమ్మారితో  ప్రపంచమంతా అతలాకుతలం అవుతున్న సందర్భంగా.. కొరోనా దృష్ట్యా సిద్ధిపేట జిల్లా  ప్రజానికానికి మంత్రి హరీష్‌ ‌రావు చేస్తున్న పని మంచి శుభవార్తగానే చెప్పాలి.

కొరోనా తీవ్రంగా ఉన్న సందర్భంగా జిల్లాలో ఇప్పటికే సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి, ఆర్వీఎం ప్రయివేటే(వంటిమామిడి), సురభి మెడికల్‌ ‌కళాశాల(మిట్టపల్లి)లో కొరోనా భారినపడిన వారికి మెరుగైన వైద్యం అందించడంతో  పాటు మౌళిక వసతులు, కొరోనా నివారణ చర్యలు నిత్యం స్వయంగా మంత్రి హరీష్‌ ‌రావు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. అంతేకాకుండ,  భవిష్యత్‌ ‌దృష్ట్యా ఆక్సిజన్‌ ‌నిత్యం అందుబాటులో ఉండే విధంగా ఆక్సిజన్‌ ‌ప్లాంట్లు( ఆక్సిజన్‌ ‌తయారీ కేంద్రాలు)ఏర్పాటు చేయనున్నారు.  సిద్దిపేట జిల్లాలో గజ్వేల్‌, ‌సిద్దిపేట జిల్లా కేంద్రంతో పాటు ఉమ్మడి జిల్లాలోని  సంగారెడ్డి , మెదక్‌, ‌జోగిపేటలలో ఈ ప్లాంట్స్ ఏర్పాటుకు గురువారం స్థల సేకరణకు జాతీయ రహదారుల శాఖ నుండి  ప్రత్యేక బృందం సిద్దిపేటకు వచ్చింది.

వారం రోజుల్లో పనులు ప్రారంభించాలని మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశించారు.. సిద్దిపేట, మెదక్‌ , ‌సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో  నిమిషానికి 1000 లీటర్లు తయారయ్యే ప్లాంట్స్, ‌గజ్వేల్‌,  ‌జోగిపేటలో నిమిషానికి 500 లీటర్ల ఆక్సిజన్‌ ‌తయారయ్యే విధంగా ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. 1000 లీటర్ల ఉత్పత్తికి రోజుకు సుమారు 200సిలండర్లు, 500లీటర్ల ఉత్పత్తికి సుమారు  100సిలండర్లు నింపేవిదంగా ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. వీటి ఏర్పాటు జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో చేస్తారు. డిఆర్‌డివో ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతుంది.

Leave a Reply