Take a fresh look at your lifestyle.

వినాయక చవితి శుభాకాంక్షలతో…. ఆరోగ్య గణపతి..!!

విఘ్నాలను హరించమని
వేడుకుంటారు వినాయకుని..
యేటా జరిపే గణపతి ఉత్సవాలు
మత సామరస్యానికి ప్రతీకలని..
వినాశనాన్ని కొనితెచ్చుకుంటారు
ప్రకృతిని హరించే చేష్టలతోని..
ఆలోచనలకు అందని ఆర్భాటాలతో
పర్యావరణం కలుషితమైతున్నా
ప్రకృతిచ్చిన సంపద రూపం మారి
సహ జీవరాశులు నాశనమైతుంటే
ప్రకృతి వికృతంగా మారి..
ఊహలకందని మృత్యువుగా
కొరోనా కరవాలంను మనపై
మనమే సంధించుకున్నాము..
ఇకనైనా ప్రకృతి నాశనం వైపు వెళ్ళక
ప్రకృతి ఆరాధనాసహితంగా యోచించి
మానవాళి జీవన పరిమళాన్ని
పునరుత్తేజం చేసే మట్టిని గణపతిని
ఆరోగ్య గణపతిగా పూజిద్దాం..!
‘‘మొక్క’’వోని దీక్షగా ప్రకృతిని ప్రేమించి
కొరోనాసుర మహమ్మారుల తరిమి
అవిఘ్నమస్తుగా జీవిద్దాం..!!

-పాల్వంచ హరికిషన్‌, ‌రామన్నపేట
9502451780

Leave a Reply