Take a fresh look at your lifestyle.

ప్రైవేట్‌ ‌విశ్వ విద్యాలయాలొద్దూ… ఘనంగా టిపిటిఎఫ్‌ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ ప్రోగ్రెసివ్‌ ‌టీచర్స్ ‌ఫెడరేషన్‌(‌టిపిటిఎఫ్‌)ఆవిర్భావ దినోత్సవంసందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రమైన  సిద్దిపేటలోని ఉపాధ్యాయ  భవన్‌ ‌వద్ద  రాష్ట్ర  ఉపాధ్యక్షుడు  జి.తిరుపతిరెడ్డి టిపిటిఎఫ్‌ ‌జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  తిరుపతిరెడ్డి  మాట్లాడుతూ… కొరోనా మహమ్మారి  వల్ల రాష్ట్ర ప్రభుత్వ  ఉద్యోగ  ఉపాధ్యాయులకు  మార్చి, ఏప్రిల్‌, ‌మే  నెల జీతాలు 50 శాతం  ఇవ్వడాన్ని తీవ్రంగా  నిరసిస్తున్నా మన్నారు. వెంటనే పూర్తి జీతాన్ని  విడుదల  చేయాలని రాష్ట్ర  ప్రభుత్వాన్ని  డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్ర  ప్రభుత్వ వైఖరికి  నిరసనగా  జూన్‌ ఒకటిన  రాష్ట్ర వ్యాప్తంగా  అన్ని జిల్లా కేంద్రాలలో  కలెక్టర్‌ ‌కార్యాలయం  వద్ద నిరసన కార్యక్రమాలుఉద్యోగ, ఉపాధ్యాయ ,పెన్షనర్ల ఐక్యవేదిక  ఆధ్వర్యంలో  చేపడుతున్నామని  తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం  ఉన్నత విద్యను ప్రైవేటీకరణ  చేసి పేదలకు విద్యను దూరంచేస్తోందన్నారు.  తెలంగాణలో ఇటీవల 5 ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఆర్డినెన్స్ ‌ద్వారా  ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే వాటిని రద్దు చేసి విద్య మొత్తం ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర కార్యదర్శి కనకయ్య,  జిల్లా అధ్యక్షుడు పోన్నమల రాములు, ప్రధాన కార్యదర్శి విజయేందర్‌రెడ్డి, ఉపాధ్యాయ దర్శిని సంపాదకుడు మల్లారెడ్డి, జిల్లా నాయకులు సత్యనారాయణ, తిరుపతి, పద్మయ్య, అజీజ్‌, ‌గోపాల్‌ ‌రెడ్డి, శివాజీ, విష్ణు, పద్మా రెడ్డి, అశోక్‌, ‌వెంకట్‌, ‌శ్రీకాంత్‌  ,‌పూర్ణ చందర్‌, ‌నరేష్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!