Take a fresh look at your lifestyle.

వ్యక్తిగత ఆరోగ్య రక్షణ చర్యలతోనే .. కొరోనా నియంత్రణ

ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్య రక్షణ చర్యలను పాటించడం ద్వారానే కొరోనా వైరస్‌ను నియంత్రించవచ్చని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి అన్నారు. కోవిడ్‌ 19 ‌సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోది ముందు జాగ్రత్తగా చేపట్టిన చర్యల కారణంగా ప్రస్తుతం దేశంలో కొరోనా నియంత్రణలోనే ఉందని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో మేకిన్‌ ఇం‌డియా కార్యక్రమంలో భాగంగాఎన్నారై వ్యాపారవేత్త శ్రీనివాస్‌ ‌మానాప్రగడ, హైదరాబాద్‌కు చెందిన  మల్లవరపు ఆరోగ్యరాజు  దేశంలోనే తొలిసారిగా రూపొందించిన కోవిడ్‌ ‌సేప్టీ కీని వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కోవిడ్‌ ‌సేఫ్టీ కీ అందరికీ ఉపయోగపడే విధంగా ఉందనీ, కొరోనా వైరస్‌కు దూరంగా ఉండేందుకు అందరూ ఈ సేఫ్టీ కీని ఉపయోగించాలని సూచించారు.

దేశంలో కోవిడ్‌ ‌వైరస్‌ ‌విస్తరించకుండా నియంత్రించడానికి ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా ఫ్రంట్‌లైన్‌ ‌సిబ్బందికి, హాస్పిటల్స్‌కు పీపీఈ కిట్లు, ముందు జాగ్రత్త వైద్య పరికరాలు, ఇతర సామాగ్రిని అన్ని రాష్ట్రాలకు అందజేశారని తెలిపారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే జనాభాపరంగా భారత్‌ అతి పెద్ద దేశమైనప్పటికీ పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ ‌మానాప్రగడ వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా మాట్లాడుతూ ఈ కోవిడ్‌ ‌సేఫ్టీ కీ ద్వారా లభించే ప్రయోజనాలను వివరించారు. ఈ పరికరాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బ్యాంకులలో ఉపయోగించవచ్చన్నారు. మల్లవరపు ఆరోగ్యరాజు మాట్లాడుతూ కొరోనా వైరస్‌ ‌నుంచి ప్రజలను రక్షించడానికి ఈ కోవిడ్‌ ‌సేఫ్టీ కీ పరికరాన్ని ఉత్పత్తి చేశామన్నారు. కొరోనా వచ్చిన రోగి తాకిన ప్రదేశాలు, ఉపరితలాన్ని ప్రత్యక్షంగా తాకకుండా ఉండేందుకు ఈ కీ ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.

Leave a Reply