Take a fresh look at your lifestyle.

మరిన్ని సంస్కరణలతో మరింత ముందుకు

ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌ ‌ప్రమాణాల పెంపు
అధికారులతో మంత్రి కెటిఆర్‌ ‌సమీక్ష

ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌ ‌ప్రమాణాలను పెంచేందుకు నూతన సంస్కరణలు తీసుకురావాలని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌ను మరింతగా పెంచుతామని స్పష్టం చేశారు. నూతన సంస్కరణలతో రాష్ట్ర ప్రయోజనాలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. రాష్ట్రంలో ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌ ‌ప్రమాణాల పెంపుపై ఐటీ, మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌ ‌సంబంధిత అధికారులతో సక్షా సమావేశం నిర్వహించారు. ఈ సక్షా సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌, ‌పలు శాఖల అధిపతులు హాజరయ్యారు. పౌరులకు అన్ని సేవలు ఒకే చోట అందించేందుకు సిటీజన్‌ ‌సర్వీస్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌పోర్టల్‌కు కేటీఆర్‌ ‌ప్రతిపాదన చేశారు. శాఖల పరంగా చేపట్టే సంస్కరణలతో ఆయా శాఖల పనితీరులో సానుకూల మార్పులు చేయాలన్నారు. టీఎస్‌ ‌బీపాస్‌ అనేది చరిత్రాత్మక చట్టమని పేర్కొన్నారు. చట్టం అమలులో వివిధ శాఖల సహకారం, సమన్వయం అవసరమన్నారు. టీఎస్‌ ‌బీపాస్‌ అనుమతులకు సంబంధించి అవసరం ఉన్న ప్రతి శాఖ నుంచి ఒక్కొక్క నోడల్‌ అధికారిని ప్రత్యేకంగా నియమించాలని ఆదేశించారు. త్వరలోనే ఈ చట్టాన్ని అమలు చేసేందుకు కార్యాచరణ ప్రకటిస్తామని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌కు మరిన్ని సంస్కరణలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ ‌ప్రకటించారు. ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌ ‌ప్రమాణాల పెంపుపై కేటీఆర్‌ ‌సక్ష నిర్వహించారు. ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌సంస్కరణలతో రాష్ట్ర పౌరులకు సైతం అనేక ప్రయోజనాలుంటాయని తెలిపారు. సంస్కరణలతో ఆయా శాఖల పనితీరులో సానుకూల మార్పులు తెస్తామని మంత్రి పేర్కొన్నారు. పౌరులకి అన్ని సేవలను ఒకేచోట అందించేందుకు..ప్రత్యేకంగా సిటిజన్‌ ‌సర్వీసెస్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌పోర్టల్‌కు ప్రతిపాదనలు చేస్తామని చెప్పారు. టీఎస్‌ ‌బీపాస్‌ అమలుపైనా సమావేశంలో చర్చించామని, చట్టాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు శాఖల మధ్య సమన్వయం అవసరమని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. నూతన సంస్కరణలతో అనేక ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. పౌరులకు అన్ని సేవలు ఒకే చోట అందించేందుకు సిటీజన్‌ ‌సర్వీస్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌పోర్టల్‌కు మంత్రి ప్రతిపాదన చేశారు. శాఖల పరంగా చేసే సంస్కరణతో ఆయా శాఖల పనితీరులో మరిన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Leave a Reply