Take a fresh look at your lifestyle.

లాక్‌డౌన్‌ ‌పొడింపుతో… ముంబైలో వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన వలస కూలీలు

  • లాఠీచార్జితో చెదరగొట్టిన పోలీసులు, ఘటనపై అమిత్‌ ‌షా ఆరా

మహారాష్ట్రలో కొరోనో వైరస్‌ అం‌తకంతకూ విజృంభిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పాజిటివ్‌ ‌కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో పాటు దేశంలో కొరోనా కట్టడికి ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్‌ను మే 3 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడం ముంబై నగరంలో నివసిస్తున్న వలస కూలీలను ఆందోళనకు గురి చేసింది. దీంతో వారంతా ఒక్కసారిగా భారీ సంఖ్యలో నగర రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలిపారు. బాంధ్రా రైల్వే స్టేషన్‌, ‌పశ్చిమ బస్టాండ్‌ ‌ప్రాంతాలకు వేల సంఖ్యలో తరలివచ్చిన యూపీ, బెంగాల్‌, ‌బీహార్‌ ‌రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు తమ స్వస్థలాలకు తిప్పి పంపించాలని డిమాండ్‌ ‌చేశారు. లాక్‌డౌన్‌ ‌కారణంగా తమ సొంత రాష్ట్రాలకు వెళ్లలేక, ఇక్కడ ఉండలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.

దీంతో పోలీసుల లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. వలస కూలీలు వెళ్లిన తరువాత స్థానిక అధికారులు ఆ ప్రాంతంలో శానిటైజేషన్‌ ‌చేయించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్లు చేయించాలని నిర్ణయించారు. మరోవైపు, బాంధ్రా ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ ‌షా ఆరా తీశారు. ఈమేరకు ఆయన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ‌ఠాక్రేతో ఫోన్‌లో మాట్లాడారు. భాంద్రా పశ్చిమ బస్టాండ్‌ ‌వద్దకు వలస కార్మికులు చేరుకున్న నేపథ్యంలో వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలతో వైరస్‌ ‌మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందనీ, ఈ తరహా ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని సూచించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!