Take a fresh look at your lifestyle.

తొలకరి జల్లు

తొలకరి జల్లుతో
నేలంతా మట్టి వాసనతో
పులకరించిన పుడమి తల్లి
చిరు జల్లులకి
చిందు చిందుమంటు
లేగదూడలు కేరింతలతో
గెంతులేస్తున్నాయి

కురివిప్పి నాట్యమాడుతున్న
మయూరి
ప్రకృతిలో జీవరాశాంత
బయటకొచ్చి స్వాగతం
పలుకుతున్నాయి

చినుకు చినుకు కలిసి
వరద ప్రవహంతో
చెరువు, కుంటలు నిండి
అలలా తొలకిల్లతో
వినసొంపైన సంగీత శబ్దంతో
పరుగెడుతున్న అలుగులో
ఎదురెక్కుతు నక్షత్రాల
మిల మిల ఎగిరెగిరి
పడుతున్న చేపలు
వేటకై జన సంద్రం

ఏరువాక సాగు మొదలై
నాగలి, గొర్రు ముందుకు
సాగాయి
రైతు ముఖంలో చిరునవ్వు
భూ తల్లి మళ్ళీ
పురుడు పోసుకున్నది తొలకరి జల్లుతో

-మిద్దె సురేష్‌, ‌కాకతీయ యూనివర్సిటీ,                      9701209355

Leave a Reply