Take a fresh look at your lifestyle.

ఆశల రెక్కలు

ఇంకెంత దూరమని ప్రయాణించాలి
అడుగులన్ని పిడుగులై పడుతున్నాయి.
కన్నిలన్నీ సముద్రపు కెరటాల్లాగా ఎగిసిపడుతున్నాయి.
స్వప్నాలన్నీ కరిగిపోయిన మేఘాల్లా కనుమారుగవుతున్నాయి.
నడుస్తున్న దారంతా… కష్టాల తివాచీ
పరిచినట్లు ముస్తాబవుతుంది.

నాతో నాకే ఒక మహాయుద్దం జరుగుతుంది.
ఆశ నిరాశల మధ్య బతుకుపోరులో.
జ్ఞాపకాలన్ని … కన్నీటిసుడుల్లో
చిక్కుకొని కదలాడుతున్నాయి.
పోగొట్టుకున్న ఆశలన్నీ దారం తెగిన
గాలిపటాలై అంబరాన విహరిస్తున్నాయి.
భానుడికంటే ముందు ఉదయించేది నేనే.
కొత్త రోజోకటి బతుకుదిశను మారుస్తుందన్న ఆశతో.

అలసిపోని కాలమంతా గడియారంతో…
ముడేసుకొని పరుగులు తీస్తుంది.
కాలం ఏనాటికైనా కనికరిస్తుందని… రెక్కలని
ముక్కలు చేసుకొని కాస్తైనా కునికిపాటు లేకుండా
పరుగులు తిస్తున్నాను.
ఏ చాటున దాగిందో ఆ గమ్యం.
ఏ దిక్కున వాలిందో ఆ విజయపు విహంగము.

పరుగుపందెం ఆగకూడదు ఇపుడు.
అందకారాన్ని చీల్చుకుంటూ సాగాలి.
కన్నీటి కాలువల్ని దాటుకుంటూ పోవాలి.
రుధిరాన్ని ఇందనముగా చేసుకొని..
బరిలోనిలిచిన రేసు గుర్రానివై..
ఆశల రెక్కలు తొడుక్కొని పరుగులుతీయాలి.
గెలుపోక అందమైన సీతాకోక చిలుకై
ఎదపై వాలే వరకు.

– అశోక్‌ ‌గోనె, 9441317361.

Leave a Reply