Take a fresh look at your lifestyle.

పోలీసు ఆంక్షల నడుమ వైన్‌ ‌షాపులు అర్థరాత్రి 12, బార్లు, క్లబ్‌లు 1 గంట వరకు

  • న్యూ ఇయర్‌ ‌సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి
  • పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై పోలీసుశాఖ ఆంక్షలు

‌మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ ‌న్యూస్‌ ‌చెప్పింది. న్యూ ఇయర్‌ ‌సందర్భంగా ఫుల్లుగా ఎంజాయ్‌ ‌చేసేందుకు షాపులు, బార్లకు అనుమతులు ఇచ్చింది. నేటి అర్థరాత్రి 12గంటల వరకు మద్యం షాపులు, రాత్రి 1 గంట వరకు బార్లు, క్లబ్‌లు తెరచి ఉంటాయని తెలిపింది. కొరోనా మళ్లీ విజృంభిస్తున్నా ఇలా అనుమతులు ఇవ్వడంతో ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం కన్నా కావాల్సింది ఆదాయం మాత్రమేనని మరోసారి స్పష్టం చేసింది. ఇక రేపు తాగి వాహనాలు నడిపితే మాత్రం తాట తీస్తామని సైబరాబాద్‌ ‌సీపీ సజ్జనార్‌ ‌హెచ్చరించారు. తాగి వాహనాలు నడిపిన వారిని ఉగ్రవాదులతో పోల్చారాయన. తాగి బండి నడిపితే..వారి ఆఫీసులకు సమాచారం చేరవేస్తామని, మొదటిసారి పట్టుబడితే..రూ. 10 వేలు ఫైన్‌, ఆరు నెలల జైలు శిక్ష, మూడు నెలల పాటు లైసెన్స్ ‌రద్దు చేస్తామని పోలీసులు ప్రకటించారు. ఇక రెండోసారి పట్టుబడితే..రూ. 15 వేలు జరిమాన, రెండేళ్ల జైలు శిక్ష, శాశ్వతంగా డ్రైవింగ్‌ ‌లైసెన్స్ ‌రద్దు చేస్తామన్నారు. మరోవైపు..హైదరాబాద్‌ ‌సిటీలో పోలీసు హై కమాండ్‌ ఆర్డర్‌ ‌ప్రకారం.. పలు ప్రాంతాల్లో డ్రంక్‌ అం‌డ్‌ ‌డ్రైవ్‌ ‌నిర్వహిస్తున్నారు.

పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై పోలీసుశాఖ ఆంక్షలు
నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా సైబరాబాద్‌, ‌హైదరాబాద్‌ ‌పరిధిలోని పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై పోలీసుశాఖ ఆంక్షలు విధించింది. నేటి రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం ఉదయం 5 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని సైబరాబాద్‌, ‌హైదరాబాద్‌ ‌డీసీపీలు తెలిపారు. సైబర్‌ ‌టవర్స్, ‌గచ్చిబౌలి, బయోడైవరిర్సటీ ఫ్లేఓవర్లు, జేఎన్‌టీయూ, మైండ్‌స్పేస్‌, ‌దుర్గం చెరువు తీగల వంతెనలను మూసివేయనున్నట్లు పేరొన్నారు. బేగంపేట ఫ్లైఓవర్‌ ‌మినహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నట్లు వెల్లడించారు. ఓఆర్‌ఆర్‌, ‌పీవీ ఎక్స్‌ప్రెస్‌ ‌హైవేపై కార్లు, జీపులను అనుమతించబోమని చెప్పారు. నెక్లెస్‌ ‌రోడ్డు, ఎన్టీఆర్‌ ‌మార్గ్, ‌బీఆర్‌కే భవన్‌, ‌తెలుగు తల్లి కూడలి, లిబర్టీ జంక్షన్‌, ‌నల్లగుట్ట రైల్వే వంతెన వద్ద వాహనాలను దారి మళ్లించనున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. యువత ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని సూచించారు.

Leave a Reply