Take a fresh look at your lifestyle.

మందుబాబుల బలహీనతతో కోట్లు దోచేశారు ఇంటి దొంగలే ప్రధాన సూత్రదారులు

లాక్‌డౌన్‌ ‌నేపధ్యంలో మద్యంషాపులను గత నెల 22న మూసివేయటంతో మద్యం ప్రియులకు మద్యం దొరకక అల్లాడిపోయారు. దీనిని అదునుగా భావించి మండల కేంద్రంలో ఉన్న ఓ మద్యం షాపుకు వెనక నుండి రంధ్రం చేసి మద్యాన్ని బయటకు తరలించి దుకాణ యజమానులు , స్థానిక ప్రజాప్రతినిధుల అండదం డలతో ఇష్టారాజ్యంగా మద్యాన్ని అమ్మి సుమారు కోటి రూపాయలు దోచేసినట్లు తెలుస్తుంది. కరోనా వైరస్‌ ‌ప్రభావంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా లాక్‌డౌన్‌ ‌ప్రకటించడంతో అన్నీ వ్యాపారాలతో పాటు మద్యాన్ని కూడ నిషేధించారు. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పత్రికా విలేకరుల సమావేశంలో ఓ పత్రిక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ నర్మగర్భంగా షాపులు తీయమని ఆదాయం కోల్పోయిన పర్లేదు కానీ ప్రజా ఆరోగ్యం ముఖ్యమని తెలిపారు. దానికి అనుగుణంగా రాష్ట్రంలోనే అన్నీ మద్యం షాపులను మూసివేసారు. గతంలో ఏదైనా సందర్బంలో మాత్రమే మద్యం షాపులను స్థానిక అధికారులు, దుకాణ యజమాని సమక్షంలో సీల్‌ ‌వేయటం జరుగుతుంది. కాని ఈ సారి కరోనా వైరస్‌ ‌వ్యాప్తి పెరగటంతో ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ‌ప్రకటించటంతో స్థానిక ఎక్సైజ్‌ అధికారులు సీల్‌ల జోలికి వెళ్ళలేదని తెలుస్తుంది.

- Advertisement -

ప్రతీ నిత్యం మద్యం తాగే అలవాటు ఉన్నటువంటి సామాన్యులు కాయ కష్టం చేసుకునేవారు ఒక్కసారిగా మందు దొరకక పోవడంతో మానసికంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తడంతో మందు కోసం ఎంతైన వెచ్చించడానికి సిద్దపడ్డారు. ఇదే అదునుగా భావించిన బూర్గంపాడులోని ఒక దుకాణదారులు స్థానిక ప్రజాప్రతినిధుల, కొందరు రాజకీయ నాయకుల అండదండలతో మద్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా దుకాణం నుండి తరలించి కొందరు మద్యవర్తుల ద్వారా వెయ్యి రూపాయలు అమ్మవలసిన మద్యం సీసాను 5వేలు ఆపై ధరలకు అమ్ముకున్నారు. మద్యం ప్రియులకు మద్యం అవసరమవ్వడంతో ఎంద ధరైన వెనుకాడకుండా కొనుగోలు చేసారు. లాక్‌డౌన్‌ ‌మొదలుకొని ఇప్పటివరకు అక్రమంగా మద్యాన్ని తరలించి కోట్లు దోచుకున్నారు. ఇదంతా స్థానిక ప్రజాప్రతినిధులు కొందరు రాజకీయ నాయకులు కనుసన్నుల్లో జరగటంతో ఎక్సైజ్‌ ‌పోలీస్‌ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించినట్లు సమాచారం. 18వ తారీఖు రాత్రి కొత్త డ్రామాకు తెర లేపారు. దుకాణంలో దొంగలు పడ్డట్లు స్థానిక అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వచ్చి పంచనామా నిర్వహించి , సిసి కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించారు. గత రాత్రి బూర్గంపాడు స్థానిక ప్రజాప్రతినిధికి చెందిన వాహనంలో బూర్గంపాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం సీసాలతో భద్రాచలం బ్రిడ్జి చెక్‌పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక వాహనంలో 9 ఫుల్‌ ‌బాటిల్స్ ‌లభించాయి. దీనితో వ్యవహారం మొత్తం బయటపడింది. మద్యం ప్రియుల బలహీనతను ఆసరాగా చేసుకుని తక్కువ ధర మద్యాన్ని ఎక్కువ ధరలకు అమ్ముకుని కోట్లు దండుకున్నారు.

Leave a Reply