Take a fresh look at your lifestyle.

జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించండి

  • విశాఖలో ఉత్తమ నగరపాలన అందిస్తాం
  • ప్రచారంలో పాల్గొన్న విజయసాయి, అవంతి శ్రీనివాస్‌

‌జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులని గెలిపిస్తే మంచి నగర పాలన అందిస్తామని హామి ఇస్తున్నామని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. శనివారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి, కే కే రాజు, వైసీపీ నేతలు భారీగా పాల్గొన్నారు. ఈసందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. జీవీఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి అయిందని తెలిపారు. ఈ రోజు దక్షిణ నియోజకవర్గ కార్పొరేటర్లు జాబితా ప్రకటిస్తామన్నారు. గ్రేటర్‌ ‌విశాఖ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని, పరిష్కరిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.వైసీపీ అభ్యర్థులని గెలిపించాలని కార్యకర్తలకు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.

పంచాయితీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ ఎన్నికల్లో వస్తాయిని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మంత్రి అవంతి, ఎంపీ విజయసాయిరెడ్డి, కే కే రాజు, వైసీపీ నేతలు భారీగా పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ.. విశాఖ నగరం అభివృద్ధికి సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు.

విశాఖ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కరోనా సమయంలో ఇళ్లలో ఉన్న టీడీపీ నేతలు ఈరోజు ఓట్ల కోసం వస్తున్నారని ఎద్దేవా చేశారు. జీవీఎంసీలో వైసీపీని గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కుప్పంలో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట్లాడిన బాష తీరు సరిగా లేదని మార్చుకోవాలని ముత్తంశెట్టి శ్రీనివాసరావు హితువు పలికారు.

Leave a Reply