వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

టీఆర్‌ఎస్‌ ‌బలపర్చిన అభ్యర్థులను గెలిపించండి

February 12, 2020

Win TRS,strengthened candidates,Satishkumar,Vodilla
హుస్నాబాద్‌ ‌శాసన సభ్యులు వొడితల సతీష్‌కుమార్‌

సహకార సంఘాలకు జరుగుతున్న ఎన్నికల్లో టీఆరెస్‌ ‌పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీష్‌ ‌కుమార్‌ ‌పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన చిగురుమామిడి మండల కేంద్రంలో  విలేకరులతో మాట్లాడారు. ఇవి పూర్తిగా రైతులకు సంబంధించిన ఎన్నికలని, రైతులకు న్యాయం చేసింది టీఆరెస్‌ ‌ప్రభుత్వం, సీ ఎం కేసీఆర్‌ ‌మాత్రమే నని అన్నారు. గత ప్రభుత్వాలు రైతాంగం కోసం ఏమీ చేయలేదని ఆయన విమర్శించారు. రైతులకు ఏడాదికి రూ.10 వేల పెట్టుబడి సహాయం ఎకరానికి రైతులకు టీఆరెస్‌ ‌ప్రభుత్వం అందిస్తోందని, విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చేసిందని, మెట్ట ప్రాంత రైతుల కోసం ఉచిత నిరంతర విద్యుత్తు అందిస్తున్నామని, రుణ మాఫీ చేసామని తెలిపారు.

ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు కృషి జరుగుతోందని, మరోసారి తోటపల్లి నుండి చిగురుమామిడి, సైదాపూర్‌ ‌మండలాలకు సాగునీటిని విడుదల చేసామని వెల్లడించారు. సీ ఎం కేసీఆర్‌ ‌రైతు పక్షపాతి అని అన్నారు. కాళేశ్వరం, మిడ్‌ ‌మానేరు ద్వారా సాగునీరు గౌరవెళ్లి ప్రాజెక్టు నింపేందుకు పనులు జరుగుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వాలు ఏవీ గౌరవెళ్లి ప్రాజెక్టును, మిడ్‌ ‌మానేరును పట్టించుకోలేదని అన్నారు. హుస్నాబాద్‌ ఎల్లమ్మ చెరువులోకి గౌరవెల్లి ద్వారా నింపే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించామని తెలిపారు. హుస్నాబాద్‌ ‌నియోజకవర్గ రైతాంగానికి మేలు చేసే ఇన్నో కార్యక్రమాలు టీఆరెస్‌ ‌ప్రభుత్వం చేస్తోందని, రైతులకు మద్దతు ధర చెల్లించేందుకు చాలా గ్రామాల్లో ఐ కే పీ ద్వారా, సొసైటీల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని అన్నారు. రైతులు సహకార ఎన్నికల్లో టీఆరెస్‌ ‌బలపర్చిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. సొసైటీలను బలోపేతం చేసి రైతాంగానికి అన్ని విధాలుగా ఉపయోగపడేలా టీఆరెస్‌ ‌ప్రభుత్వం తీర్చి దిద్దుతుందని అన్నారు. టీఆరెస్‌ ‌బలపర్చిన అభ్యర్థుల విజయం కోసం పార్టీ శ్రేణులు సమన్వయం తో పని చేయాలని ఆయన కోరారు.

Tags: Win TRS,strengthened candidates,Satishkumar,Vodilla