‘‘ఉపాధి ప్రతి సంవత్సరం పెరుగుతూ పోవాలి కానీ అందుకు విరుద్దంగా ప్రతి సంవత్సరం కేటాయింపులలో తగ్గింపు జరుగుతున్నది. పథకాన్ని నీరుకార్చడం, బడ్జెట్ కేటాయింపులలో ఉపాధి హామీ పథకం కేవలం 1.3 శాతం, రాబోయే రోజులల్లో క్రమేణా రద్దు చేయడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంత పేదలకు , అసంఘటిత రంగంలో ఉన్న రైతు కూలీలకు కడుపు నింపేదిగా ఉన్న పథకాన్ని పద్ధతి ప్రకారం దూరం చేసి పేద ప్రజలపై తమ దాష్టికాన్ని చాటుతున్నది. మోడీ ప్రభుత్వంలో ఏ ఒక్క డెవెలప్మెంట్ పారామీటర్ చూసుకున్న విధ్వంసం తప్ప ఏమీ కనిపించదు.’’
డాక్టర్. ముచ్చుకోట సురేష్ బాబు, రాష్ట్ర అధ్యక్షులు, ప్రజాసైన్స్ వేదిక