Take a fresh look at your lifestyle.

చట్టాల రద్దు ప్రక్రియ ముగిసిన తర్వాతే ఆందోళన విరమిస్తాం

అప్పటి వరకు ఢిల్లీ సరిహద్దులు వొదిలేది లేదు
ఇతర సమస్యలపై పోరాటం కొనసాగుతుంది..త్వరలోనే కార్యాచరణ వెల్లడిస్తాం
రైతు సంఘాలు ప్రకటన
రైతులు సాధించిన గొప్ప విజయం…ఎన్నికల గిమ్మిక్కులా కనిపిస్తున్నది..
ఆందోళన కొనసాగుతుంది : బీకేయూ నేత రాకేష్‌ ‌తికాయిత్‌
అమరులైన 700 మంది రైతుల మరణాలకు బాధ్యత కేంద్రానిదే : రైతు సంఘం నేత విజూ కృష్ణన్‌

image.png
image.png
image.png
మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్లు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినా, రైతులు మాత్రం నిరసన కొనసాగిస్తామంటున్నారు. సింఘు సరిహద్దుల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్న రైతులు తిరిగి ఇళ్లకు వెళ్లాలని ప్రధాని కోరారు. అయితే ఢిల్లీకి సవి•పంలోని సింఘు సరిహద్దులో క్యాంప్‌ ‌చేస్తున్న రైతులు మాత్రం దీనిపై చట్టం చేశాకే తిరిగి ఇళ్లకు వెళతామంటున్నారు. పార్లమెంటులో చట్టాలను రద్దు చేసే పక్రియ ప్రారంభమైన తర్వాత మాత్రమే తాము నిరసన స్థలం నుంచి బయలుదేరుతామని రైతులు ముక్తకంఠంతో చెప్పారు. కేంద్రం గత ఏడాది సెప్టెంబరులో తీసుకువచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ రైతులు ఏడాది కాలంగా ఆందోళనలు చేశారు. దీంతో దిగివచ్చిన కేంద్రం మూడు వివాదాస్పద చట్టాలను ఎట్టకేలకు రద్దు చేయనుంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోడీ ప్రకటించడంపై సంయుక్త కిసాన్‌ ‌మోర్చా (ఎస్‌కెఎం) హర్షం వ్యక్తం చేసింది. పార్లమెంట్‌లో దీనికి సంబంధించి ప్రకటించేంత వరకు ఎదురుచూస్తామని తెలిపింది. ఈ సందర్భంగా ఎస్‌కెఎం ఓ ప్రకటన చేస్తూ..ఈ పోరాటంలో సుమారు 700 మంది రైతులు మరణించారని పేర్కొంది. కేంద్రం మొండి వైఖరి కారణంగా లఖింపూర్‌ ‌ఖేరీ హత్యలతోపాటు ఈ పోరాటంలో అనేక మంది రైతులు అసువులు బాసారని తెలిపింది. ఈ మూడు చట్టాలు రద్దుతోనే ఈ పోరాటం ఆగిపోదని పేర్కొంది. వ్యవసాయానికి సంబంధించిన అన్ని ఉత్పత్తులకు, ప్రతి రైతుకు లాభదాయకమైన ధరలకు చట్టబద్ధమైన హావి•ని కల్పించాలని తెలిపింది. ఈ డిమాండ్‌ ఇం‌కా పెండింగ్‌లో ఉందని గుర్తు చేసింది. విద్యుత్‌ ‌బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేసింది. ప్రస్తుత పరిణామాలను ఎస్‌కెఎం పరిశీలించి..త్వరలో సమావేశం నిర్వహించి..తదుపరి కార్యాచరణను వెల్లడిస్తామని తెలిపింది.
రైతులు సాధించిన గొప్ప విజయం…ఎన్నికల గిమ్మిక్కులా కనిపిస్తున్నది..ఆందోళన కొనసాగుతుంది : బీకేయూ నేత రాకేష్‌ ‌తికాయిత్‌
‌వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన చేయడంపై భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌(‌బీకేయూ) నేత రాకేష్‌ ‌తికాయిత్‌ ‌హర్షం వ్యక్తం చేశారు. ఇది రైతులు సాధించిన గొప్ప విజయమని చెప్పారు. అయితే, ఇప్పుడప్పుడే తాము ఆందోళన విరమించబోమని, పార్లమెంటులో వ్యవసాయ చట్టాలు రద్దయ్యే వరకు తమ ఆందోళన కొనసాగుతుందన్నారు. అదేవిధంగా కనీస మద్దతు ధరకు హావి• ఇస్తూ కేంద్రం చట్టం చేయాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. ఈ విజయం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన 750 మంది రైతులకు, అదేవిధంగా తమతోపాటు ఆందోళనలో పాలుపంచుకున్న గిరిజనులకు, కూలీలకు, మహిళలకు అంకితమని రాకేష్‌ ‌తికాయిత్‌ ‌వ్యాఖ్యానించారు. అయితే, వ్యవసాయ చట్టాలపై కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నికల గిమ్మిక్కులా కనిపిస్తున్నదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ మధ్య దేశంలో మోదీ ప్రభుత్వ గ్రాఫ్‌ ‌పడిపోవడం మొదలైందని, ఇమేజ్‌ ‌దెబ్బతింటున్నదని అన్నారు. కేంద్రం కార్పొరేట్‌ ‌కంపెనీల ఒత్తిళ్లలో.. కేవలం వాళ్లకు మాత్రమే లబ్ది చేకూరేలా పనిచేస్తున్నదని విమర్శించారు.
అమరులైన 700 మంది రైతుల మరణాలకు బాధ్యత కేంద్రానిదే : రైతు సంఘం నేత విజూ కృష్ణన్‌
‌మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై ఎఐకెఎస్‌ ‌జాతీయ సహాయ కార్యదర్శి విజూ కృష్ణన్‌ ‌స్పందించారు. మూడు చట్టాలను రద్దు కోరుతూ జరిగిన ఉద్యమంలో అమరవీరులైన సుమారు ఏడు వందల మంది రైతుల మరణాలకు కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్‌ ‌చేశారు. కనీస మద్దతు ధర చట్టంపై స్పష్టం చేయాలని… దాని గురించి మోడీ మట్లాడలేదని అన్నారు. తమ డిమాండ్లలో ఎంఎస్పి చట్టం, విద్యుత్‌ ‌బిల్లు ఉపసంహరణ, అలాగే రాజధాని పరివాహక ప్రాంతంలో గడ్డి కాల్చిన రైతులపై జరిమానా విధించడాన్ని ఉపసంహరణ చట్టం వెనక్కి తీసుకోవాలని తెలిపారు. కానీ… మోడీ ప్రసంగంలో ఆ డిమాండ్ల గురించి ప్రస్తావన లేదన్నారు. అయితే రైతుల ఐక్య పోరాట ఒత్తిడి మేరకే మూడు రైతు చట్టాలను రద్దు చేస్తామని మోడీ సర్కార్‌ అన్నారని విజూ కృష్ణన్‌ ‌పేర్కొన్నారు

Leave a Reply