Take a fresh look at your lifestyle.

వోట్ల వేటలో ట్రంప్‌ ‌వ్యూహం ఫలిస్తుందా?

Will Trump plan to vote

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ఈ ‌సంవత్సరం చివరలో అధ్యక్ష పదవికి తిరిగి పోటీ చేయనున్నారు.ప్రవాస భారతీయుల ఓట్లను కొల్లగొట్టడానికే ఆయన భారత పర్యటనను ఎంచుకున్న సంగతి ముందే స్పష్టం అయింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీని అత్యంత ఆత్మీయ, నిజమైన మిత్రునిగా అభివర్ణిస్తూ ఆయన అహ్మదాబాద్‌,‌ఢిల్లీల్లో పర్యటించారు.తాను ప్రసంగించిన ప్రతి చోటా మోడీని ముమ్మారు పొగిడారు, మోడీ వంటి సిసలైన మిత్రుడు ఎక్కడా లేరని అంటూనే, మోడీ మహా గట్టివాడనీ,ఆయనను ఒప్పించడం చాలా కష్టమని ట్రంప్‌ ‌తన మనసులో మాట బయటపెట్టారు. మోడీ గత ఏడాది టెక్సాస్‌ ‌లోని హోస్టన్‌లో జరిపిన హౌడీ మోడీ మాదిరిగానే అహ్మదాబాద్‌ ‌లో నమస్తే ట్రంప్‌ ‌సభను నిర్వహించినట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. దేశ రాజధానిలో ఒక వంక పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్న తరుణంలో మోడీ ట్రంప్‌కు అహ్మదాబాద్‌ ‌లో ఘన స్వాగతం ఏర్పాట్లు చేయడం చెప్పుకోదగిన విషయమే. అమెరికా అధ్యక్షుడు భారత్‌ను పొగుడుతున్న సమయంలోనే ఈ ఘర్షణలు జరగడం గమనార్హం. 2016లో డెమోక్రాటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు ప్రవాస భారతీయుల ఓట్లు 80 శాతం పడ్డాయి. అందువల్ల ఈసారి వారి ఓట్లను దక్కించుకోవడానికి ట్రంప్‌ ‌ప్రయత్నాలు ప్రారంభించారు.

అప్పుడు ప్రవాస భారతీయుల ఓట్లే కీలకంగా నిలిచాయి.ఇప్పుడు కూడా వారి ఓట్లతోనే మళ్ళీ అధికారంలోకి రావాలని ట్రంప్‌ ఆశిస్తున్నారు.అమెరికాలో 1.3 మిలియన్ల మంది ప్రవాసభారతీయులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది విద్యావంతులు, వాణిజ్య వేత్తలు, సంపన్నులు ఉన్నారు.అమెరికాలోని ఎడిసన్‌, ‌న్యూజెర్సీలలో హిందువుల ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ట్రంప్‌ ‌విజయానికి వీరే కీలకపాత్ర వహించారు.ప్రవాస భారతీయుల ఓట్లు అమెరికాలో రాజకీయ నాయకులకు కొండంత అండగా ఉంటాయి. అందుకే, ట్రంప్‌ ‌తన పర్యటన అంతా భారతీయులను పొగుడుతూ గడిపేశారు. మొదటితరం ప్రవాస భారతీయులు అమెరికాలో మాదిరిగానే భారత దేశంలో రాజకీయాలకు ఆర్థికంగా అండగా నిలిచారు. మోడీ సహకారంతో ప్రవాస భారతీయుల ఓట్లపై కన్ను వేసి ట్రంప్‌ ‌భారత పర్యటన జరిపారు. ముఖ్యంగా, హిందూ ఓటర్లు మోడీ ద్వారా సాధించవచ్చనని ఆయన ఒక పథకం ప్రకారమే ఈ ప్రచారం జరిపారు. గతంలో అమెరికన్‌ ‌రాజకీయవేత్తలు ఢిల్లీని మొదట సందర్శించేవారు.వారిలా కాకుండా ట్రంప్‌ అహ్మదాబాద్‌ ‌తో పర్యటన ప్రారంబించారు., అమెరికాలో గుజరాతీల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.

ట్రంప్‌ ‌ఢిల్లీలో పత్రికా గోష్టిలో ఢిల్లీలో అల్లర్ల గురించి ప్రస్తావించినప్పటికీ, పరిస్థితిని అదుపు చేసేందుకు తగిన చర్యలు తీసుకునే శక్తి మోడీకి ఉందని అన్నారు. మోడీని ఆయన పొగిడిన ప్రతిసారి ఆయన ప్రవాస భారతీయులు, ముఖ్యంగా గుజరాతీల ఓట్లను దృష్టిలోనే పెట్టుకున్నారు. వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళకుండా ట్రంప్‌ ‌లౌక్యంగా సమాధానాలు ఇచ్చారు అదే సందర్భంలో పాకిస్తాన్‌ ఉ‌గ్రవాదాన్ని అరికడుతుందని నమ్ముతున్నట్టు భారత గడ్డపై ట్రంప్‌ ‌ప్రకటించడం అందరినీ ఆశ్చర్య పర్చింది. కాశ్మీర్‌లో ఇతరుల జోక్యాన్ని భారత్‌ ‌వ్యతిరేకిస్తున్నప్పటికీ అవసరమైతే కాశ్మీర్‌ ‌పై భారత్‌,‌పాక్‌ ‌ల మద్య మధ్యవర్తిత్వం చేస్తానని అనడం ఆయన గడుసుతనానికి నిదర్శనం.అహ్మదాబాద్‌ ‌హిందూ జాతీయవాదుల ఉద్యమానికి పట్టుగొమ్మ అనే విషయం ట్రంప్‌ ‌కి తెలుసు.అందుకే అహ్మదాబాద్‌ ‌ప్రసంగంలో ఆయన భారతీయుల స్వాతంత్య్ర పోరాట ఘట్టాలను , గుజరాతీల సేవలను గురించి ప్రస్తావించారు. మహాత్మాగాంధీ, సర్దార్‌ ‌పటేల్‌ ‌గుజరాత్‌ ‌వారేనంటూ పొగడటం కూడా ఎత్తుగడలో భాగమే. ట్రంప్‌ ‌భారత్‌ ‌పర్యటన సందర్భంగా హిందువులనూ, గుజరాతీలను పొగిడేందుకు తీసుకున్న శ్రద్ధ ఆయనకు వచ్చే ఎన్నికల్లో ఎంతవరకూ ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ,ఆయనకు ఆ విషయంలో మాత్రం గట్టి నమ్మకమే ఏర్పడినట్టు తెలుస్తోంది. మరోసారి నేనే ఎన్నికవుతానంటూ ధీమాగా ప్రకటించారు. తాను ఎన్నిక కాకపోతే స్టాక్‌ ‌మార్కెట్లు పడిపోతాయంటూ హెచ్చరించే ధోరణిలో మాట్లాడారు.

– అంకితారావు

Leave a Reply