Take a fresh look at your lifestyle.

జగన్‌-‌జుడిషియరి యుద్ధం మోదీకి లాభమా?

“అం‌తర్గత విచారణలు లేకుండా న్యాయమూర్తులపై బహిరంగంగా వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని ఆరోపణలు చేసినందున విడివిడిగా సమాంతర కోర్టు ధిక్కార విచారణలు చేపట్టాలి. న్యాయ, చట్ట, కార్య నిర్వాహక వ్యవస్థల్లో ఒకదానిపై మరొక వ్యవస్థ ఆధిపత్యం లేదని, మూడు వ్యవస్థలూ రాజ్యాంగానికి లోబడి పనిచేయవలసి ఉంటుందని గుర్తెరగాలి. అందుకే కొన్ని సునిశిత విషయాలలో సమతుల్యత పాటిస్తూ పరస్పరం గౌరవించుకోవాలి. అందుకే ప్రాథ•మికంగా ప్రతి వ్యవస్థకు అధికారాల పంపిణీ జరిపారు.”

పిల్లి పోరూ పిల్లి పోరూ పిట్ట తీరుస్తుందా ?

ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్మోహన్‌ ‌రెడ్డి ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ ‌బోబ్డేకి రాసిన లేఖ బహిరంగమై సంచలనం సృష్టించింది. పర్య వసానం ఎలా ఉన్నా న్యాయ, చట్ట వ్యవస్థల్లో అలలు రేపుతున్నది. అందునా జగన్మోహన్‌ ‌రెడ్డి దిల్లీ పర్యటనలో ప్రధాని మోదీని కలసిన తరు ణంలో ఆ లేఖ అక్కడ ఇవ్వడం న్యాయవ్యవస్థలో అనేక అనుమానాలకు, చర్చలకు, ఆగ్రహాలకు తావిచ్చినట్లయింది. న్యాయమూర్తులపై చేసిన ఆరోపణలు వారి భవిష్యత్‌ ‌పదవులపైనే కాకుండా సుప్రీమ్‌ ‌కోర్టు ప్రతిష్ట•కే ప్రశ్నార్థకంలా తయారయింది. కొన్ని మాధ్యమాలు ఆ వార్తను పెద్ద యుద్ధంగా వర్ణించగా..తదననతరం పరిస్థితులు బేరీజు వేసుకుని, మామూలు యుద్ధం కాదు గ్యాంగ్‌ ‌వార్‌ అనడం సబబు అనే నిర్ధారణకు వచ్చాయి. సుప్రీమ్‌ ‌కోర్టు న్యాయమూర్తి ఎన్‌వి రమణ, మరి కొందరు ఆంధ్రప్రదేశ్‌ ‌హైకోర్టు న్యాయమూర్తులపై జగన్మోహన్‌ ‌రెడ్డి ఆ లేఖలో లేవనెత్తిన ఆరోపణలను చర్చించడం కంటే భవిష్యత్‌ ఎలా ఉంటుందన్నదే ఆసక్తికరంగా తయారైంది.

న్యాయ మూర్తులపై తాను చేసిన ఆరోపణల నేపథ్యంలో తగిన చర్యలు తీసుకుని రాష్ట్ర న్యాయ వ్యవస్థ నిష్పాక్షికంగా వ్యవహరించేలా ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తారని భావిస్తున్నట్లు జగన్మోహన్‌ ‌రెడ్డి ఆ లేఖలో భావించడం ఇక్కడ ప్రధానాంశం. తాను ప్రస్తావించిన ఆరోపణలకు ఆధారాలు కూడా సమర్పించేందుకు సిద్ధమని పేర్కొన్న విషయానికొస్తే, తాను చేసిన ఆరోపణలు బలమైనవని భావిస్తే సంబంధిత న్యాయ మూర్తులపై ప్రధాన న్యాయమూర్తి నేరుగా అంతర్గత విచారణ జరపాలని ఎందుకు లేఖలో కోరలేదన్నది చర్చనీయాంశం. మరి ప్రధాన న్యాయమూర్తి ఏమి చెయ్యాలని ముఖ్యమంత్రి కోరుతున్నారో అర్థంకాని విషయం.

ఒక వేళ అంతర్గత విచారణలో న్యామూర్తులపై ఆరోపణలు వాస్తవమని ప్రాథమికంగా తేలితే తదుపరి పరిణామం.. తనకున్న పాలనాధికారాలు ఉపయోగించి న్యాయమూర్తుల విధులనుంచీ వారిని తప్పిం చడం, తదనంతరం న్యాయమూర్తుల విచారణ చట్టం మేరకు వారిని పదవుల నుంచీ తప్పించాలని ప్రభుత్వానికి సిఫారసు చేయడం. ఒకవేళ అంతర్గత విచారణలో న్యాయమూర్తులపై ఆరోపణలు రుజువుకాకపోతే వారు నిర్దోషులని ప్రకటిస్తే జగన్మోహన్‌ ‌రెడ్డి ఏమిచేస్తారు? న్యాయమూర్తి తొలగింపు కోరుతూ వందమంది లోక్‌ ‌సభ సభ్యులు, 50 మంది రాజ్యసభ సభ్యులు స్పీకర్‌, ‌చైర్మన్‌కు నోటీసులిస్తే వారు అనుమతిస్తేనే న్యాయమూర్తిని తీర్మానం ద్వారా తొలగించే అధికారం సభలకుంటుంది. కొద్ది సంవత్సరాలకిందట భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ ‌మిశ్రాపై తీర్మానానికి కపిల్‌ ‌సిబాల్‌ ‌తీర్మానం ప్రతిపాదిస్తే చైర్మన్‌ ‌వెంకయ్య నాయుడు తిరస్కరించిన విషయం మనం గుర్తుకు తెచ్చుకోవాలి. సభ్యులు నోటీసిచ్చినా స్పీకర్‌, ‌చైర్మన్‌ ‌తిరస్కరిస్తే..జరిగేది శూన్యం. తీర్మానం ప్రతిపాదనకు అనుమతి లభించిన తరువాత సుప్రీమ్‌ ‌కోర్టు న్యాయమూర్తి, ఒక హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి, మరొక న్యాయ నిపుణులతో కూడిన త్రిసభ్య సంఘం ఏర్పాటు చేసి ఆరోపణలపై విచారణ జరపాలి. విచారణలో న్యాయ మూర్తిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే పార్లమెంటు సదరు న్యాయమూర్తిని తొలగిస్తూ తీర్మానం ఆమోదించాలి. విచారణలో ఆరోపణలు అవాస్తవని తేలితే, పార్లమెంటు కూడా ఏ చర్యా తీసుకోలేదు…అనే విషయం తెలుసుకోవాలి.

తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
తన పట్ల వ్యతిరేకంగా ఉన్న న్యాయమూర్తులను పదవీ భ్రష్ఠులను చేయడమే జగన్మోహన్‌ ‌రెడ్డి లక్ష్యం. అలా జరగాలంటే పార్లమెంటులో సత్తా ప్రదర్శించి జడ్జీల తొలగింపు తీర్మానం ప్రవేశ పెట్టుకోవాలి. తతంగమంతా 2021 ఏప్రిల్‌ 23 ‌లోగా, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ ‌బోబ్డె పదవీ విరమణలోగా పూర్తికావాలి. అప్పుడుకానీ ఆయన ఆశిస్తున్నట్లు తదుపరి సీనియర్‌ ‌సుప్రీమ్‌ ‌న్యాయమూర్తి ఎన్‌వి రమణ భారత ప్రధాన న్యాయమూర్తి పదవికి అనర్హులుకారు. ఆ పరిస్థితుల్లో సీనియారిటీలో మూడవ స్థానంలో ఉన్న న్యాయ మూర్తి ఆర్‌ఎఫ్‌ ‌నారిమన్‌ ‌ప్రధాన న్యాయమూర్తి స్థానం అలంకరిస్తారు. ఆయనకూడా ఆగస్ట్ 12 ‌వతేదీతో పదవీ విరమణ చేస్తారు. అప్పుడు సీనియారిటీ ప్రకారం న్యాయమూర్తి ఉదయ్‌ ఉమేష్‌ ‌లలిత్‌ ‌ప్రధాన న్యామూర్తి పదవి చేపట్టి 2022 నవంబర్‌ 8 ‌వరకు కొనసాగుతారు. సాధారణ పరిస్థితుల్లో 2021 ఏప్రిల్‌ 24 ‌సుప్రీమ్‌ ‌ప్రధాన న్యామూర్తిగా ఎన్‌వి రమణ పదవి చేపట్టి 2022 ఆగస్ట్ 26‌న పదవీ విరమణ చేయాల్సి ఉంది. సుప్రీమ్‌ ‌న్యాయ స్థానంలో ఇంత తతంగం ఉంటే, ఆ విధానాలు అనుసరించకుండా న్యాయమూర్తిపై తాను చేసిన ఆరోపణల లేఖ ఆధారంగా హైకోర్టు, సుప్రీమ్‌ ‌కోర్టు న్యాయమూర్తులపై విచారణపర్వం జరగకుండా ప్రధాన న్యాయమూర్తి నేరుగా చర్య తీసుకుంటారని జగన్మోహన్‌ ‌రెడ్డి భావిస్తున్నట్లు కనిపిస్తున్నది.

రాజ్యాంగం ఏమి చెబుతున్నది ?
న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తితో సమర్థతతో వ్యవహరించాలని ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొన్న ముఖ్యమంత్రికి తదుపరి పరిణామాల గురించి స్పష్టంగా తెలిసే రాజీపడని న్యాయ మూర్తిని పదవి నుంచి తప్పించాలన్న ప్రయ త్నమని సర్వత్రా భావిస్తున్నారు. స్వతం త్రంగా వ్యవహరించే న్యాయమూర్తులనేక మందిని కించపరచిన పరిణామం ఫలితాలెలా ఉంటాయో తెలిసే ఆయన ఈ మార్గం ఎంచుకున్నారన్న అబి •ప్రాయాలున్నాయి. న్యాయమూర్తుల స్వేచ్ఛ, స్వయంప్రతిపత్తుల పరిరక్షణ రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. హైకోర్ట్ ‌లేదా సుప్రీమ్‌ ‌కోర్టు న్యాయమూర్తిని పదవినుంచీ తప్పించాలని రాష్ట్రపతిని అభ్యర్థిస్తూ పార్లమెంటులో తీర్మానం చేస్తే మినహా పార్లమెంటులో సైతం న్యాయమూర్తి వ్యవహారం తీరుపై చర్చించేందు రాజ్యాంగం కూడా వీలుకల్పించలేదు. రాజ్యాంగంలోని 121 అధికరణం కోర్టులకు పార్లమెంటు నుంచీ ఆ రక్షణ కల్పిస్తున్నది. అధికరణం 122 పార్లమెంటు వ్యవహారాలలో కోర్టుల జోక్యం, వ్యాఖ్యలనుంచీ రక్షణ కల్పిస్తుండగా, హైకోర్టులకు రాష్ట్ర చట్టసభలనుంచి అధికరణం 211 రక్షణ కల్పిస్తున్నది. అదేమాదిరి కోర్టులకు అసెంబ్లీ వ్యవహారాలలో జోక్యాన్ని నివారిస్తూ అధికరణం 212 రక్షణ కల్పిస్తున్నది.

సుప్రీమ్‌, ‌హైకోర్టు న్యాయమూర్తులపై జగన్మోహన్‌ ‌రెడ్డి అసెంబ్లీలో ఎటువంటి ఆరోపణలు చేయనందున 211 అధికరణ వర్తించదు. అయితే ఒక ముఖ్య మంత్రి పరోక్షంగా(లేఖ ద్వారా) ప్రస్తావించ వచ్చునా అనే విషయం చర్చకు అతీతం కాదు. ఎందుకంటే ఆయన శాసన సభలో ప్రస్తావించలేదు కనుక. న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులపై ప్రజలలో చర్చకు లేవనెత్తకూదదని ఎక్కడా ఆంక్షలు లేవు కానీ, కోర్టు ధిక్కారం కింద చర్యకు ఆస్కారం కల్పిస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డి హైకోర్టు, సుప్రీమ్‌ ‌కోర్టు న్యాయమూర్తుల లక్ష్యంగా ఆరోపణలు చేసినందున ఉభయకోర్టుల ధిక్కారం పరిగణనలో వస్తుందని న్యాయ నిపుణుల అభిప్రాయం. అయితే ఎక్కడికక్కడ కోర్టు ధిక్కార నేరంగా చూడవలసి ఉంటుంది. అంతర్గత విచారణలు లేకుండా న్యాయమూర్తులపై బహిరంగంగా వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని ఆరోపణలు చేసినందున విడివిడిగా సమాంతర కోర్టు ధిక్కార విచారణలు చేపట్టాలి. న్యాయ, చట్ట, కార్య నిర్వాహక వ్యవస్థల్లో ఒకదానిపై మరొక వ్యవస్థ ఆధిపత్యం లేదని, మూడు వ్యవస్థలూ రాజ్యా ంగానికి లోబడి పనిచేయవలసి ఉంటుందని గుర్తెరగాలి. అందుకే కొన్ని సునిశిత విషయాలలో సమతుల్యత పాటిస్తూ పరస్పరం గౌరవిం చుకోవాలి. అందుకే ప్రాథ•మికంగా ప్రతి వ్యవస్థకు అధికారాల పంపిణీ జరిపారు.

ఆంధ్రప్రదేశ్‌ – ‌సుప్రీమ్‌ ‌కోర్టు మధ్య నడుస్తున్న గ్యాంగ్‌ ‌వార్‌లో కేంద్రం పాత్ర అంటూ లేకున్నా, కొన్నేళ్ళుగా సాగుతున్న వ్యవహారాన్ని తనకు అనువుగా మలుచుకునే అవకాశం కేంద్రం ఉపయోగించుకుంటుంది. అమరావతిలో భూ కుంభకోణాలపై సిబిఐ విచారణ జరపాలన్న జగన్మోహన్‌ ‌రెడ్డి అభ్యర్థనకు ఔననికాని, కాదనికాని చెప్పకుండా తాత్సారం చేయడమే అందుకు నిదర్శనం. ప్రస్తుత పరిస్థితుల్లో కార్యనిర్వాక వర్గానికి అనువుగా స్నేహపూర్వక న్యాయ వ్యవస్థ(ఫ్రెండ్లీ జుడిషియరి) వైపు మొగ్గుచూపితే ప్రజలలో విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే నిరాధార ఆరోపణలు ఎదుర్కొం టున్న న్యాయమూర్తులు కార్య నిర్వాహకవర్గ అనుకూల తీర్పులిచ్చే అవకాశం ఉంది. అందుచేత న్యాయమూర్తులు ఎదు ర్కొంటున్న ఆరోపణలు వారి పదవీవిరమణ వరకూ తేలకుంటే తలమీద కత్తులు వేలా డుతున్నాయన్న భయంతోనైనా అణకువగా ఉంటారని కేంద్రం అలోచన కావచ్చు. ఏది ఏమైనా న్యాయమూర్తులపై జగన్మోహన్‌ ‌రెడ్డి ఆరోపణలు కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి అందివచ్చిన అవకాశమే!.

– ‘ది వైర్‌’ ‌సౌజన్యంతో..

Leave a Reply