Take a fresh look at your lifestyle.

మంత్రి అజయ్‌తో ‘ఆ మాజీలు’ కలిసేనా?

Will the former ministers support To Minister Ajay
సమీపిస్తున్న ఎన్నికల గడువు – ప్రచారంలో పాల్గొనని తుమ్మల, పొంగులేటి ఉమ్మడి జిల్లాలో ఇద్దరిపైనే చర్చ

ఖమ్మం, జనవరి 17 (ప్రజాతంత్ర విలేకరి): పుర పోరులో మంత్రి అజ య్‌కుమార్‌తో ఆ ఇద్దరు మాజీలు కలిసి పని చేస్తారా లేదా అనే అంశం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతుంది. మున్సిపల్‌ ఎన్నికల గడువు సమీపిస్తుడడంతో ఆ ఇద్దరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో అంతర్గంతగా గుబులు మైదలైంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు మంత్రి అజయ్‌కుమార్‌తో కలసి పనిచేస్తారా… లేదా.. ఎన్నికల ప్రచారంలో దూరంగా ఉంటారా అనే చర్చ రాజకియ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదు మున్సిపాలిటిలలో పోరు జరుగుతుంది. ఇప్పటి వరకు నామినేషన్ల పర్వం ఉపసంహరణలతో ముగిసింది. చివరిగా ప్రచారం, ఓటరును పోలింగ్‌ ‌కేంద్రం వైపు నడిపించి ఆ ఓటును తమకు అనుకూలంగా మలుచుకోవడం మాత్రమే మిగిలింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా ఫలితాలు మాత్రం విభిన్నంగా ఉంటాయి. అయితే గత క్యాబినెట్‌లో ముఖ్యమంత్రి కేసిఆర్‌కు సన్నిహితుడిగా సీఎం తరువాత రెండో స్ధానంలో పాలనలో కీలకంగా వ్యవహరించారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అయితే తరువాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ బరిలో ఓటమి చెందారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన తుమ్మల నాగేశ్వరరావు ఓటమి అనంతరంకొద్ది రోజుల పాటు రాజకియాలకు దూరంగా ఉన్నారు. ఇటివల కాలంలో పలు కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. అలాగే మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా రాజకియాల్లో అతికొద్ది కాలంలో కీలక నేతగా ఎదిగారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ ‌సీపీ నుంచి ఖమ్మం పార్లమెంట్‌ ‌సభ్యుడిగా గెలుపొందిన ఆయన ప్రజలలో నిత్యం తిరుగుతూ మంచి నాయకుడిగా గుర్తింపు పొందారు. తరువాత పరిణామాల మధ్య తెరాసలో కొనసాగుతూ వచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఒకే ఒక్క స్ధానంలో విజయం సాధించి మిగతా అన్ని చోట్ల పరాజయం పాలైంది. దీంతో పొంగులేటి వ్యతిరేకవర్గం అన్ని చోట్ల ఓటమికి పొంగులేటే కారణమంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో పాటు మారిన రాజకియ పరిణామాలతో ఆయనకు టిక్కెటు లభించలేదు. తరువాత ఏదో ఒక పదవి వస్తుందని ఎదురుచూస్తున్నారు. దీంతో ఆయన పూర్తి స్ధాయిలో రాజకియాల్లో పాల్గొనడంలేదు. అయితే ఎన్నికల అనంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అధికార పార్టీ తరుపున విజయం సాధించిన పువ్వాడ అజయ్‌కుమార్‌ ‌కేసిఆర్‌ ‌క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న అజయ్‌కుమార్‌ ఆ ఇద్దరు నేతలను సమన్వయం చేసుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా.. లేక అన్ని తానై నడిపిస్తారా వేచి చూడాలి.

కలిసి పని చేస్తేనే విజయం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ విజయం సాధించాలంటే అజయ్‌ ‌కుమార్‌తో పాటు మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి, ఎంపీ నామ కలిసి ప్రచారంలో పాల్గొంటే విజయం సునాయాసం అవుతుం దని రాజకియ విశ్లేషకుల అభిప్రాయం. గతంలో మాదిరిగా ఎవరికి వారు..విడివిడిగా ప్రచారంలో పాల్గోని వెళ్తే ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే మంత్రి అజయ్‌కుమార్‌, ఎం‌పీ నామ నాగేశ్వరరావులు మున్సిపాలిటిలలో ప్రచారం చేస్తున్నారు. అయితే గతంలో తిరుగులేని రాజకీయ నేతలుగా ఉన్న ఆ ఇద్దరికి అన్ని మున్సిపాలిటిలలో అనుచర గణం పెద్ద ఎత్తున ఉంది. అయితే తమ నేతలు ప్రచారంలో పాల్గొనకపోవడంతో క్యాడర్‌ అమోమయంగా ఉంది. పురపోరు ప్రచారం లో మంత్రి ఆ ఇద్దరు నేతలను కలుపుకుని పోతే పురుపాలకాలపై గులాభీ జెండా ఎగురవేసే అవకాశాలు మొండుగా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. అజయ్‌కుమార్‌తో ఆఇద్దరు కలిసి నడుస్తారా… లేదా అనే అంశం త్వరలో తెలనుంది.

Tags: khammam, municipal elections, miniter ajay, thummala nageswar rao

Leave a Reply