Take a fresh look at your lifestyle.

దక్షిణ తెలంగాణ ను ఎడారిగా మార్చే..!

  • ఆంధ్ర జీవో నెం. 203పై తెలంగాణ సీఎం స్పందించాలి
  • యువతెలంగాణ పార్టీ వర్కిింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమ 

దక్షిణ తెలంగాణ ను ఎడారిగా మార్చే జీవోనెం.203 ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై స్పందించి స్పష్టమైన ప్రకటన చేయాలని యువతెలంగాణ పార్టీ వర్కిింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమ రెడ్డి ఆదివారం డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం నుండి అక్రమంగా 80వేల క్యూసెక్కుల నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా తరలించుకుపోయేందుకు జారీ చేసిన జీవో, చేపట్టనున్న పనుల వల్ల పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 20లక్షల ఎకరాల కృష్ణాబేసిన్ ఆయకట్టు ఎడారిగా మారబోతుందని.. దీనిపై ప్రభుత్వం స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు.

జీవో జారీ చేసి ఐదురోజులవుతున్నా ఇరిగేషన్ శాఖ తనవద్దే పెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బెల్లంకొట్టిన రాయిలా ఎందుకున్నాడని ప్రశ్నించారు. జీవో నెం. 203 ఉపసంహరణకు తక్షణమే అధికారిక ప్రయత్నాలు ప్రారంభించాలని, సీఎం బహిరంగంగా దీనిపై మాట్లాడాలన్నారు. పాలమూరు లోని కల్వకుర్తి, నల్లగొండ ఎస్ఎల్ బిసి, డిండిలు శ్రీశైలం ఖాళీ అయితే ఎడారిగా మారుతాయన్నారు. దక్షిణ తెలంగాణ ఆయకట్టు పరిరక్షణకు ప్రభుత్వం స్పందించాలని రాణిరుద్రమ డిమాండ్ చేశారు.

Leave a Reply