Take a fresh look at your lifestyle.

నిరుద్యోగుల గొంతునవుతా ..!

*ఎమ్మెల్సీ  అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ ఎన్నికల కార్యాలయం ప్రారంభం..
*రాజకీయాలకు అతీతంగా బరిలో వుంటున్న..
*పట్టభద్రులు పట్టం కడతారనే బలమైన విశ్వాసం వుంది..
*శాసన మండలి లో నిరుద్యోగుల గొంతునవుతా.
*ఊపిరి వున్నంతవరకు ఈ గొంతు తెలంగాణ సమాజం కోసమే..
త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ  ఎన్నికల  కార్యాచరణ లో  భాగంగా శనివారం  నల్లగొండ జిల్లా కేంద్రంలో నల్లగొండ, ఖమ్మం,వరంగల్ఎ మ్మెల్సీ  అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్  ఎన్నికల  కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రజా కవి, రచయిత  వేణు సంకోజ్  చేతులమీదుగా కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్బంగా డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ నల్లగొండ, ఖమ్మం,వరంగల్ నియోజకవర్గంలో జరగబోయే పట్టభద్రుల ఎన్నికలకు సంబందించి రాజకీయాలకు అతీతంగా  ఉధ్యమకారుడిగా బరిలో నిలబడుతున్నాని.. ఈ ఎన్నికలు పాలకులకు కనువిప్పు కలిగే విధంగా వుండాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేసారు. ఊపిరి వున్నంతవరకు తెలంగాణ సమాజం కోసమే నిలబడతానని అన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి  ఇక్కడ నుంచి పోటిచేసి గెలిచిన తర్వాత ఏనాడు మండలిలో నిరుద్యోగుల ఆకాంక్షల గురించి  ప్రస్తావించలేదన్నారు. ప్రతిదీ రాజకీయం చేసారన్నారు.
తెలంగాణ ఏర్పాటు అనంతరం సకల వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు.. కాబట్టే ఇవ్వాళా తను  ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారన్నారు.. ధోఖాతిన్న తెలంగాణ సదస్సు తరహాలో తెలంగాణాలో నూతన మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాన్న రు.ప్రధానంగా పోటీకి ఉద్దేశం నేను చైత్యనం చేసిన నా ప్రజలకోసం , నిరుద్యోగ సమస్య, విద్యావస్థలో సమస్యలు, ఉపాధి, నిరుద్యోగ కుటుంబాల సమస్యల పై మండలిలో ప్రశ్నించడానికే..అన్నారు. ప్రశ్నించే వాడు లేకపోతే పాలకుడు నియంతలా మారుతాడు..ప్రతిపక్షమైన, అధికార పక్షం అయినా పట్టభద్రుల ఎన్నికల్లో  రాజకీయ పార్టీలు అతిగా బాగస్వామ్యం  కాకపోవటమే మంచిదని విజ్ఞప్తి చేస్తున్నాన్నరు.ఈ రాష్టంలో జరిగిన ప్రతి అన్యాయాన్ని, తప్పును ప్రశ్నించింది, రోడ్లమీద కొట్లాడింది ఏమైనా ఉంది అంటే అది తెలంగాణ ఉధ్యమకారుడు అయిన తాను  మాత్రమేనని..వివరిస్తూ .. ప్రతి ఎన్నికలో ఎం జరుగుతుంది అంటే మేమె ప్రశ్నించే గొంతులం అని ప్రచారం చేసుకొని ఆధిపత్య కులాల వాళ్ళే ముందుకు వస్తున్నారు..ఇది ఎన్నికల వరకే పరిమితము చేస్తున్నారు..అధికార పక్షంలో వాళ్లే, ప్రతిపక్షంలో వాళ్లే..! వేరే వర్గాలను రానియ్యరా. .అని ప్రశ్నించారు.
గత సాదారణ ఎన్నికల్లో కూటమిలో బాగంగా  నకిరేకల్ టికెట్ ఇచ్చి వెనుకకు తీసుకున్న..కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కి  పొత్తు ధర్మంలో మద్దతు తెలిపి ఎమ్మెల్యే గా  గెలిపించినం..తెలంగాణ వాదిగా ఉద్యమ ద్రోహులకు కేసీఆర్  పట్టం కడుతున్నారనే ఉద్దేశంతో బయిటికి వచ్చి పోరాటం చేస్తువస్తున్నాని పేర్కొన్నారు.తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు, నిరుద్యోగులు, మేధావులు,ఉద్యోగులు సకలజనులు అండగా ఉంటారని నమ్మకం ఉంది అన్నారు..కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో  కోట్లు కుమ్మరియ్యకుండా ప్రజాప్రతినిదులు కాలేరు. ఇవ్వాళా కోట్లు కుమ్మరించిన వాళ్ళ పాలనా ఎలా ఉందొ ప్రత్యేక్షంగా మీరే చూస్తున్నారని పట్టభద్రులను ఉద్దేశించి అన్నారు.
పట్టభద్రులు, మేధావులు నిజాయితీగా, పోరాటం చేసే వాడికి పట్టం కడితే భవిషత్ రాజకీయాల్లో పాలకులకు ఒక భయం అనేది ఏర్పడుతుందని అన్నారు.
ఎన్ని కాలేజీలు రీయంబుస్మెంట్ లేక మూతపడాయి, ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి,ఉద్యోగాలు లేక ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు,తెలంగాణ ఏర్పాటు అనంతరం ఇలా జరుగుతుందని ఊహించినమా..! భవిషత్ తరాలకు ప్రభుత్వ విద్య అందని ద్రాక్షగా మిగిలిపోవాల్సిందేనా.! దీని గురించి మాట్లాడేది ఎవరు, కొట్లాడేది ఎవరు చట్టసభల్లో ప్రస్తావన తెచ్చే దమ్ము ఎవరికీ అయినా ఉందా. అనురాగ్, మల్లా రెడ్డి వంటి వాళ్లకు ప్రైవేట్ యూనివర్సిటీల పేరా ప్రభుత్వ యూనివర్సిటీ నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని ప్రశ్నించే వారు ఎవరైనా ఉన్నరా..? నేను అనాడు తెలంగాణ కోసం ఏ విధంగా వీరోచితంగా పోరాడానో అదే విధంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడుతా. నిరుద్యోగుల వాణిని చట్టసభలో వినిపిస్తానన్నారు.
ప్రో. కోదండరాం కి ఎప్పుడో ఐక్య కార్యాచరణ సమయంలోనే విజ్ఞప్తి చేసినం రానున్న గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పోటీలో ఉంటాం అని..కోదండరాం పెట్టి న అభ్యర్థులకు మద్దతుగా స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేసినం. ఇప్పుడు ఎందుకో అయన మనుసు మార్చుకున్నారు అని అన్నారు.
 కూటమిలో  మరియు  అనేకరకాలుగా నష్టపోయిన  తనను ఈ ఎన్నికల్లో  తన అభ్యర్థిత్వాన్ని బలపరచాల్సింది గా  అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్న అన్నారు. .ఈగత  30 ఏండ్లుగా ఎన్ని ఉద్యమాలు చేసానో, ఎన్ని సార్లు జైలుకు వెళ్లానో మీ అందరికి తెల్సు. ఎంత నష్టపోయానో మీ అందరికి తెల్సు. నాకు ప్రజల ఆశీస్సులు వుంటే  ఇంకా మంచి ఆరోగ్యం ఇస్తే మరింత కాలం మీకోసం పనిచేస్తా.. అని డా. చెరుకు సుధాకర్ ఈ సందర్బంగా అన్నారు. మండలిలో ప్రశ్నించే దమ్ము నాకు ఉన్నదని,శాసన మండలి లో నిరుద్యోగుల గొంతునవుతానని వారన్నారు.కవి రచయిత వేణు సంకోజ్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు “నిధులు” మాత్రమే కనబడుతున్నాయని,ప్రజలు గాని ప్రజా ఆకాంక్ష లు గాని కనబడతలేవన్నారు.ఇది సరైన పద్దతి కాదన్నారు. మార్పు రావాలని ఆకాంక్షించారు.

Leave a Reply