Take a fresh look at your lifestyle.

‌పట్టణాన్ని పర్యాటక రంగంగా తీర్చిదిద్దుతా: బొల్లం మల్లయ్య యాదవ్‌

‌సూర్యాపేట(కోదాడ), సెప్టెంబర్‌15, ‌ప్రజాతంత్ర ప్రతినిధి): కోదాడ పట్టణాన్ని జిల్లాలోనే నెంబర్‌ ‌వన్‌గా తీర్చిదిద్దుతానని స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని స్థానిక 23, 31వార్డుల్లో, వార్డుకు 10లక్షల నిధుల చొప్పున పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు మున్సిపల్‌ ‌జనరల్‌ ‌ఫండ్‌ ‌నిధులు 20లక్షలతో సిసి రోడ్లు, కల్వర్టు, డ్రైన్లు రెండు వార్డుల్లో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అలాగే పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రజలకు ఎటువంటి ఇబ్బందులకు కల్గకుండా రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులను నిర్మించడం జరుగుతుందని పేర్కొన్నారు. రాబోయే కాలంలో కోదాడ పట్టణాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటుచేయుటకు కృషి చేస్తానని, వర్షాకాలంలో సీజనల్‌ ‌వ్యాధులు ప్రబలకుండా ప్రజలు ఇంటి పరసరాలను పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలని కోరారు. అనంతరం మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్‌ ‌వనపర్తి శీరిష లక్ష్మీనారాయణ మాట్లాడుతు ఎమ్మెల్యే సహకారంతో పట్టణాన్ని మరింత అభివృద్దికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ‌చైర్మన్‌ ‌వెంపటి పద్మ మధుసుదన్‌, ఎం‌పిపి చింతా కవిత రాధారెడ్డి, వార్డు కౌన్సిలర్‌ ‌తిపిరిశెట్టి సుశీలరాజు, కోటేశ్వరరావు, కనవర్లపూడి శ్రీనివాస్‌, ‌కుక్కడప్పు బాబు, ప్రకాష్‌, ‌సుధాకర్‌, ‌నరసింహరావు, సత్యనారాయణ, మధు, రామారావు, ప్రవీణ్‌, ‌పవన్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply