Take a fresh look at your lifestyle.

కరోనాను ఖతం చేద్దాం!

యుద్ధభూమిలో
ఎవరూ ఒంటరి కాదు
ఎదుటివారిలోని బలహీనతల ఆసరాతోనే
శత్రువు ఊహాన్‌ ‌వేదికగా
రణశంఖం పూరించింది
ఎన్ని యుద్ధాలు చూడలేదు
ఎన్ని విపత్తులను ఎదుర్కొన్నాం
కలరా కాల గర్భంలో కలిసింది
గత్తర పత్తా లేకుండా పోయింది
మశూచి మసి బారింది
చరిత్రలో ఎన్నెన్నో
నామరూపాల్లేకుండా పోయాయి
ఇదొక లెక్కా
మాకేం కాదులే అనే నిర్లక్ష్యపు వాదనే
శత్రువు ఒరలోని పాశుపతాస్త్రమైంది
స్వీయ నిర్బంధాన్ని తిరస్కరించి
రోడ్డెక్కిన వారంతా శత్రు పక్షమే
రణ భూమిలో శత్రువుకు
ఇన్ఫార్మర్‌గా మారిన వైరస్‌ అం‌టు
సైనిక బలగాలను రప్పించడం
మన స్వయంకృతాపరాధమే
యుద్ధ క్షేత్రంలో
ప్రాణాలకు తెగించిన వైద్యులు
పరుల ప్రాణమే
తమ ప్రాణంగా పారిశుద్ధ్య కార్మికులు
ఇల్లును మరిచిన పోలీస్‌ ‌పహారా
శత్రువు జాడలో జర్నలిస్టుల కదలికలు
అందరికీ అన్నం పెడుతున్న రైతులు
వీరంతా కరోనా కదన రంగంలో
వీర సైనికులే
మన తక్షణ కర్తవ్యం
శత్రుసంహారమే ఏకైక లక్ష్యం
గడపదాటని స్వీయ నిర్బంధాలు
సర్కార్‌ ‌సహకారంతో
మనందరి పోరాటంలో
కరోనాను ఖతం చేద్దాం!!

  – కెసి నరసయ్య
9951260316

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply