Take a fresh look at your lifestyle.

దేశంలో ఐటీఐల బలోపేతం..మోడల్‌ ఐటిఐలకు 300కోట్లు

మల్లేపల్లి మోడల్‌ ఐటిఐని ప్రారంభించిన కిషన్‌ ‌రెడ్డి
దేశంలో ఐటీఐలను బలోపేతం చేసే లక్ష్యంతో పని చేస్తున్నట్లు కేంద్రం మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులతో దేశవ్యాప్తంగా మోడల్‌ ఐఐటీలను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వివరించారు. హైదరాబాద్‌ ‌మల్లేపల్లిలో రాష్ట్ర మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌మహమూద్‌ అలీతో కలిసి కిషన్‌రెడ్డి మోడల్‌ ఐటీఐ భవనాన్ని ప్రారంభించారు. మోడల్‌ ఐటీఐల కోసం కేంద్రం రూ.300కోట్లు కేటాయించిందని కిషన్‌ ‌రెడ్డి తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఐటీఐలను గుర్తించి మోడల్‌ ఐటీఐలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు కిషన్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.  దేశంలో ఐటిఐలు గొప్ప అభ్యాస కేంద్రాలుగా ఉపాధి అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తున్నాయని ఆయన తెలిపారు.

మల్లేపల్లి ఐటిఐని మోడల్‌ ఐటిఐగా రూ.10 కోట్ల నిధులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అభివృద్ధి చేసినట్లు కిషన్‌ ‌రెడ్డి తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఐటీఐలను గుర్తించి మోడల్‌ ఐటీఐలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు కిషన్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులతో దేశవ్యాప్తంగా 29 రాష్టాల్రలో మోడల్‌ ఐఐటీలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్రం మంత్రి వివరించారు. నూతన జాతీయ విద్యా విధానం ద్వారా, రానున్న రోజుల్లో విధ్యార్థులకు, యువతకు వొకేషనల్‌ ‌కోర్సులలో శిక్షణ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని కిషన్‌ ‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌ ‌మెరాజ్‌హుస్సేన్‌, ‌కార్మిక ఉపాధి కల్పనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిని, కేంద్ర మంత్రి అదనపు కార్యదర్శి శశికిరణాచారీ, ఉపాధి శిక్షణ శాఖ సంచాలకులు కె.వై.నాయక్‌, ‌జాయింట్‌ ‌డైరెక్టర్‌ ఎస్‌వీకే నగేశ్‌, ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply