Take a fresh look at your lifestyle.

స్వామీజీలతో ప్రభుత్వాలు కూలుతాయా..?

అంత బలహీనంగా కెసిఆర్‌ ‌ప్రభుత్వం ఉందా
కెసిఆర్‌ ‌నడిపిన డ్రామాలో ఉన్నదెవరో తేల్చాలి
వారితో బిజెపికి ఎలాంటి సంబంధం లేదు
అలాంటి వారితో వ్యవహారాలు నడపాల్సిన ఖర్మలేదు
నలుగురు ఎమ్మెల్యేల కోసం వెంపర్లాడాల్సిన పనిలేదు
ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను చేర్చుకున్నదే కెసిఆర్‌
అన్ని పార్టీల వారిని చేర్చుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు
కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, రాష్ట్ర ఇంచార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌
‌జబర్దస్త్ ‌కామెడీ షోలా ఉంది : కెసిఆర్‌ ‌మీడియా మీట్‌పై బండి ట్వీట్‌
ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై సిఎం కెసిఆర్‌ ‌వ్యాఖ్యలను, ఆరోపణలను బిజెపి తిప్పికొట్టింది. మరోవైపు దీనిపై బిజెపి హైకోర్టులో వేసిన కేసు సోమవారానికి వాయిదా పడింది. దేశంలో ప్రజాస్వామ్య హత్య జరుగుతుందని సిఎం కెసిఆర్‌ ‌చేసిన ఆరోపణలపై బిజెపి మండిపడ్డది. స్వామీజీలను పెట్టి కూల్చాల్సిన అసవరం బిజెపికి లేదని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి, పార్టీ ఇన్‌ఛార్జ్ ‌తరుణ్‌చుగ్‌లు వేర్వేరుగా అన్నారు. బిజెపి ప్రభుత్వాలను పడగొట్టేందుకు కుట్రలు చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామాన్యి హత్య చేస్తుందన్నారు. స్వామిజీల ముసుగులో ముఠాలను ఏర్పాటు చేసి తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి..ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దేశంలో ఇప్పటికే 8 రాష్ట్రాల్లో అక్కడి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిందని.. అలాగే మరో 4 రాష్ట్రాల్లోనూ అలాంటి ఆపరేషన్‌ ‌చేసిందని సీఎం కేసీఆర్‌ ‌సంచలన ఆరోపణలు చేశారు. సిఎం కేసీఆర్‌ ఆరోపణలపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ఘాటుగా స్పందించారు. స్వామిజీలతో ఎక్కడైనా ప్రభుత్వం కూలిపోతుందా ? అని ప్రశ్నించారు. అంత బలహీనంగా కెసిఆర్‌ ‌పరభుత్వం ఉందా అని అన్నారు. నిన్నటి కేసీఆర్‌ ‌సినిమాను చూస్తే కొండను తవ్వి తొండను పట్టినట్లు ఉందని అన్నారు. ప్రభుత్వాన్ని కూలగొట్టేవిధంగా వీడియోలో ఎక్కడా లేదని చెప్పారు. కేసీఆర్‌ ఊహాజనితమే ఈ వీడియో అని అన్నారు. సీఎం కేసీఆర్‌ ‌ప్రెస్‌ మీట్‌లో చెప్పినవన్నీ అబద్ధాలేనని వెల్లడించారు. కేసీఆర్‌ ‌చూపించిన వీడియోల్లో ఏముందో తమకైతే అర్థం కాలేదన్నారు. తెలంగాణకు సంబంధించి ఏ వ్యవహారమైనా బీజేపీ హైకమాండ్‌ ‌నాతో మాట్లాడుతుంది.

ఎవరా స్వామిజీ ?. అందులో ఎవరైనా ముఖ్యమైన వ్యక్తులున్నారా ? మాకు టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పడిపోవాలని లేదు. మా కోరికల్లా షెడ్యూల్‌ ‌ప్రకారం ఎన్నిక జరగాలి. అందులో మా పార్టీ విజయం సాధించాలన్నదే అని కిషన్‌ ‌రెడ్డి అన్నారు. బ్రోకర్లను మధ్యలో పెట్టాల్సిన ఖర్మ మాకు పట్టలేదు. బయటి వ్యక్తులతో బేరసారాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. మేము ఏదైనా బాజాప్తా చేస్తామని అన్నారు. ఎమమెల్యలు బిజెపిలో చేరితే రాజీనామా చేసి చేరుతారని అన్నారు. ఆ వీడియోల్లో ఉన్నది డ్రామా ఆర్టిస్టులు. మేం ఏ తప్పూ చేయలేదు. అలాంటి చిల్లర పనులు ఏనాడు చేయబోం. కేసీఆర్‌ ‌బాధ ఎంటో మాకు అర్థమైంది. తన తర్వాత కేటీఆర్‌ ‌ముఖ్యమంత్రి కాడేమోనని జిమ్మిక్కులు చేస్తున్నారు. మీ ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం మాకు లేదు అని కిషన్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. అందమైన అబద్దాలను వీడియోలో పెడితే ప్రజలు నమ్మరు. నలుగురు ఆర్టిస్టులను పెట్టి అబద్ధాలు ఆడించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది మీరే. మీరు చెబుతున్న నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాంగ్రెస్‌ ‌గుర్తుపైనే గెలిచారు. రోహిత్‌ ‌రెడ్డి పెద్ద నీతిమంతుడా ? ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రలోభపెట్టి మీ పార్టీలో చేర్చుకోలేదా ? మీరా ప్రజాస్వామ్యం గురించి వల్లవేసేదని అంటే మండిపడ్డారు. కేసీఆర్‌ ‌నిన్న చూపించింది విఠలాచార్య సినిమా. తెలంగాణలో ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌జరుగుతుంది. దీనిపై విచారణకు సిద్ధమా ? కేసీఆర్‌ ‌చేసిన ఆరోపణలపై మేం ఎప్పుడో న్యాయ విచారణ కోరామని కిషన్‌ ‌రెడ్డి మండిపడ్డారు. మొయినాబాద్‌ ‌ఫామ్‌ ‌హౌస్‌ ‌ఘటనలో కేసీఆర్‌ ‌చూపించిన వీడియోలో ఏమిలేదని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. బయటివాళ్లతో బేరసారాలు చేసే ఖర్మ తమకు లేదన్నారు. కేసీఆర్‌ ‌చెప్పేవన్నీ అబద్ధాలని.. బ్రోకర్ల ద్వారా పార్టీలో ఎవరిని చేర్చుకోమని చెప్పారు. 100 కోట్లు కాదు 100 పైసలకు కూడా ఆ ఎమ్మెల్యేలను ఎవరు కొనరని ఎద్దేవా చేశారు. ఫామ్‌ ‌హౌజ్‌ ‌ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు.

ఫామ్‌ ‌హౌస్‌ ‌ఘటనలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచి వొచ్చారని కిషన్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్‌ ‌కాదా అని అడిగారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని విమర్శించారు. స్వామిజీలతో ప్రభుత్వం కూలిపోతుందా అని ప్రశ్నించారు. ఎన్నో పార్టీల గొంతు నొక్కి.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన కేసీఆర్‌.. ‌ప్రజాస్వామ్యాన్ని బతికించండి అనడం సిగ్గుచేటన్నారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్‌లో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలా చేరారో వెల్లడించారు. తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కిషన్‌ ‌రెడ్డి విమర్శించారు. మునుగోడు బైపోల్‌ ‌తర్వాత కేసీఆర్‌లో ఆందోళన పెరిగిందన్నారు. ఎన్టీఆర్‌పై చెప్పులు వేసిన ఘటనలో కేసీఆర్‌ ‌లేడా అని ప్రశ్నించారు. ఇదిలా వుంటే ఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీకి సంబంధం లేదని రాష్ట్ర బిజెపి వ్యవహారా ఇన్‌ఛార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ ‌ఢిల్లీలో తెలిపారు. పట్టుబడ్డ ముగ్గురు నిందితులకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయన్నది అబద్ధమన్నారు. సొంత ఎమ్మెల్యేలపై కేసీఆర్‌కు విశ్వాసం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని విమర్శించారు. కేసీఆర్‌ అహంకారం మునుగోడు ఫలితంతో తగ్గుతుందన్నారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేశారన్న చుగ్‌.. ‌మునుగోడు ప్రజలకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోడీపై కేసీఆర్‌ ‌తప్పుడు ప్రచారం చేస్తున్నారని తరుణ్‌ ‌చుగ్‌ ‌మండిపడ్డారు. ప్రధాని కావాలని కేసీఆర్‌ ‌కలలుకంటున్నాడని.. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా ప్రధానమంత్రి కావొచ్చన్నారు. ప్రధాని మోడీ దేశాభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారని.. దేశ ప్రజల కోసం ఘర్‌ ‌ఘర్‌ ‌పానీ, ఉచిత విద్య, రైతులకు రైతుబీమాతో పాటు నగదు బదిలీ వంటి పథకాలను అమలుచేస్తున్నారని చెప్పారు.

జబర్దస్త్ ‌కామెడీ షోలా ఉంది : కెసిఆర్‌ ‌మీడియా మీట్‌పై బండి ట్వీట్‌
‌కేసీఆర్‌ ‌ప్రెస్‌ ‌మీట్‌ ‌జబర్థస్త్ ‌కామెడీ షో అంటూ బీజేపీ స్టేట్‌ ‌చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. దీని నిర్మాత, డైరెక్టర్‌, ‌రైటర్‌ ‌కేసీఆరేనని సెటైర్లు వేశారు. ఫాంహౌజ్‌ ‌డ్రామాలో నటించింది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలని ట్వీట్‌ ‌చేశారు. మీడియా పార్ట్ ‌నర్‌ ‌పింక్‌ ‌మీడియా అంటూ బండి సంజయ్‌ ‌పోస్ట్ ‌పెట్టారు. మరోవైపు మొయినాబాద్‌ ‌ఫాంహౌస్‌ ‌ఘటనలో కేసీఆర్‌ ‌చూపించిన వీడియోలో ఏమిలేదని అన్నారు. బయటివాళ్లతో బేరసారాలు చేసే ఖర్మ తమకు లేదన్నారు. కేసీఆర్‌ ‌చెప్పేవన్నీ అబద్దాలని.. బ్రోకర్ల ద్వారా పార్టీలో ఎవరిని చేర్చుకోమని చెప్పారు. ఇదిలావుంటే ఫాంహౌజ్‌ ‌ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్‌ ‌కాదా అని అడిగారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని విమర్శించారు. స్వామిజీలతో ప్రభుత్వం కూలిపోతుందా అని ప్రశ్నించారు. ఎన్నో పార్టీల గొంతు నొక్కి.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన కేసీఆర్‌.. ‌ప్రజాస్వామ్యాన్ని బతికించండి అనడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేసిన ఘనత కేసీఆర్‌ ‌కే దక్కుతుందనివిమర్శించారు.

Leave a Reply