Take a fresh look at your lifestyle.

అమరవీరుల సాక్షిగా…రాజీలేని పోరాటం..!

*-ఐజేయూ, టీయూడబ్ల్యుజె*
అమర వీరుల త్యాగాల సాక్షిగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యుజె) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ ప్రతిజ్ఞ చేశారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నాడు ఐజేయూ, టీయూడబ్ల్యుజె సంఘాల ఆధ్వర్యంలో
గన్ పార్క్ లోని అమర వీరుల స్థూపం వద్ద అమరులకు, కరోనా మృతులకు జర్నలిస్టులు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణతో తమ దీర్ఘకాలిక సమస్యలకు మోక్షం లభిస్తుందని అన్ని వర్గాలు ఆశించినట్లే జర్నలిస్టులు ఆశించారని వారు అన్నారు. ఆరేళ్ళు గడుస్తున్నా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో జర్నలిస్టులకు నిరుత్సాహం తప్పలేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల నిరసన తెలుపుతున్నట్లు వారు తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించాలని శ్రీనివాస్ రెడ్డి, విరాహత్ అలీ కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, పిసిఐ మాజీ సభ్యులు కె.అమర్ నాథ్, టీయూడబ్ల్యుజె ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, టీయూడబ్ల్యుజె రాష్ట్ర నాయకులు ఈశ్వర్ రెడ్డి, కిరణ్, ఏ.రాజేష్, వి.యాదగిరి, జిలానీ, స్వామి, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం నాయకులు రాములు, ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హరి, హెచ్.యూ.జె అధ్యక్ష, కార్యదర్శులు రియాజ్ అహ్మద్, శిగ శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply