Take a fresh look at your lifestyle.

రాజధాని లేకుండా ఇంకెంతకాలం ఉంటారు

అమరావతిపై స్పష్టమైన విధానం అవలంబించాలి
గుంటూరు,జూలై 27: రాష్ట్రానికికి ప్రత్యేక హోదాతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని అమరావతి రైతులు తెలిపారు. జగన్‌ ‌రైతులను కలసి సమస్యలను చర్చించాలన్నారు. అలాగే అమరావతిని రాజధానిగా కొనసాగించి అభివృద్ది చేయాలన్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధి కొనసాగాలని రైతులు చేస్తోన్న ఉద్యమం మంగళవారంతో 588వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి రైతులు, మహిళలు, కూలీలు మాట్లాడుతూ •దా ఊసు ఎత్తకుండా మూడు రాజధానుల పేరుతో పాలకులు పబ్బం గడుపుతున్నారన్నారు. మంత్రులు పొంతన లేకుండా మాట్లాడు తున్నారని అన్నారు. అమరావతి భూముల్లో ఇన్‌సైడర్‌ ‌ట్రేడింగ్‌తో ఇంతకాలం కాలయాపన చేశారని, దానిని కోర్టులు కూడా కొట్టేశాయన్నారు.

కేంద్రం వద్ద మాట్లాడే దమ్ము, ధైర్యం సీఎంకు లేదన్నారు. మూడు రాజధానులతో అభివృద్ధి ఉండదని తెలిసినా సీఎం జగన్‌రెడ్డి ప్రతిపాదన పెట్టారన్నారు. అసలు దేశంలో ఎక్కడా ఇలాంటి ప్రతిపాదన లేదన్నారు. అమరావతి అభివృద్ధిని పక్కన పెట్టడానికి మూడు రాజధానుల ఎత్తుగడ వేశారన్నారు. భూములు ఇచ్చిన రైతులను బాధపెట్టడం కాదు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచన చేయాలని కోరారు. పాలకులు వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మూడు ముక్కల ఆట ఆడుతున్నారన్నారు. రాజధాని గ్రామాల్లో దీపాలు వెలిగించి జై అమరావతి అంటూ నినాదాలు చేసి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటికైనా పాలకులు తమ ఆలోచనా విధానం మానాలన్నారు. రాజధాని లేకుండా ఇప్పటికే ఎపి చాలా నష్టపోయిందన్నారు.

Leave a Reply