Take a fresh look at your lifestyle.

2021 చివరి నాటికి పెద్దలందరికీ పూర్తి టీకాలు వేసేస్తారా: రాహుల్ గాంధీ

ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమన్న కేంద్రం
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ, జూలై 23: 2021 చివరి నాటికి భారత్ లో పెద్దలందరికీ కోవిడ్ -19 టీకాలు వేయాలని ప్రభుత్వం ప్రణాళిక వేస్తున్నదా..? 2021 ఆగస్టు నుండి డిసెంబర్ వరకు కోవిడ్ -19 వ్యాక్సిన్ లభ్యత కొరకు ప్రభుత్వం వేసిన అంచనా ఆ వివరాలు తెలపండి..టీకా కార్యక్రమానికి ఇప్పటివరకు ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులు పరిమాణం ఎంత? అని రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నిచారు… కోవిడ్ -19 టీకాలు ప్రజలకు అందించడం కొనసాగుతున్న….డైనమిక్ ప్రక్రియ. దీన్ని నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ కాంకర్రెంట్ శాస్త్రీయ ఆధారాల మేరకు దిశా నిర్దేశం చేస్తున్నది.

కోవిడ్ -19 మహమ్మారి డైనమిక్ మరియు అభివృద్ధి చెందుతున్న స్వభావం దృష్ట్యా, టీకా డ్రైవ్ పూర్తి చేయడానికి ప్రస్తుతం ఎంత కాలం పడుతుంది అనేది చెప్పలేం… అయితే 18 నుంచి పై వయస్సు గల లబ్ధిదారులకు డిసెంబర్ 2021 నాటికి టీకాలు వేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఆగస్టు 2021 నుండి డిసెంబర్ 2021 మధ్య మొత్తం 135 కోట్ల మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్ ప్రజలకు అందించేలాగా ప్రభుత్వం ప్రణాళిక వేస్తున్నది. దేశీయ వ్యాక్సిన్ తయారీ దారులతో కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడంలో ప్రభుత్వం ఆలస్యం చేయలేదు. తయారీదారుల వద్ద ఉంచిన సరఫరా ఆర్డర్ల కోసం అడ్వాన్స్ చెల్లింపులు కూడా ప్రభుత్వం చేసింది. కోవిడ్ -19 టీకా కార్యక్రమానికి ఇప్పటివరకు మొత్తం 9725.15 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది..అని కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది.

తెలంగాణకు 1400 ల వెంటిలేటర్స్ ఇచ్చాం: కేంద్రం
కోవిడ్‌–19 సమయంలో తెలంగాణ లో వైద్యవ్యవస్థను బలోపేతం చేసేందుకు తెలంగాణ రాష్ట్రానికి 1400 వెంటిలేటర్లు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహాయమంత్రి డాక్టర్‌ భారతి ప్రవీణ్‌ పవార్‌ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు, యూటీలు, జాతీయ స్థాయి సంస్థలకు కలిపి మొత్తం 48,446 వెంటిలేటర్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. శుక్రవారం లోక్ సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు మంత్రి ఇలా సమాధానం ఇచ్చారు. అలాగే ఏపికి 5,258 వెంటిలేటర్లు అందించినట్లు మంత్రి వెల్లడించారు.

కొరోనా వలన అంగన్ వాడీలు మూసేసాం
దేశంలో కొరోనా సెకండ్ వేవ్ కారణంగా అంగన్‌వాడీ కేంద్రాలు ఇప్పటికీ మూసివేసి ఉన్నాయని కేంద్రం తెలిపింది. వైరస్‌ కంట్రోల్ చేసే అందుకు ఈ చర్య తీసుకున్నట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. ఎంపిలు కోమటి రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మన్నె శ్రీనివాస్ రెడ్డి, వంగ గీతలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబు ఇచ్చారు. ఈ ఏడాది మార్చ్‌ 31నాటికి అంగన్వాడీ సేవలు అందుకుంటున్న 8,31,80,208 మంది లబ్ధిదారులకు అనుబంధ పోషకాహారం అందించినట్లు వెల్లడించారు. అందులో 6,75,06,918 మంది 6 నెలల నుంచి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఉన్నట్లు పేర్కొన్నారు. మిగిలిన 1,56,73,290 మంది గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు ఉన్నారని సమాధానం ఇచ్చారు.

Leave a Reply