Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు

  • జిల్లాల్లో పొంగిపోర్లుతున్న వాగులు, వంకలు
  • నీట మునిగిన సూర్యాపేట పట్టణం
  • మరో మూడ్రోజులపాటు భారీ వర్షాలు : వాతావరణ శాఖ

రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు, కుంటలు అలుగు దుంకాయి. పంట పొలాలు నీట మునిగాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. పలు చోట్ల రవాణాకు అంతరాయం ఏర్పడింది. జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లాలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి కాటారం మండలంలోని వీరాపూర్‌ ‌శివశంకర్‌ ‌ప్రాజెక్ట్ ‌చెరువుకు గండి పడింది. సుమారు 200 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని అంకంపల్లి వద్ద వర్షాలకు కల్వర్టు కొట్టుకుపోయి తాడ్వాయి కరకగుడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని సూరారం గ్రామంలో భారీ వర్షానికి ఇండ్లలోకి వర్షం నీరు చేరింది. చేకుంకుడు పాములా గ్రామంలో భారీ వర్షానికి కుంట కట్ట తెగి రామన్నపేట, అమ్మనబోలు రహదారి తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా అంతటా భారీ వర్షం కురిసింది.

అచ్చంపేట మండలంలోని లక్ష్మాపూర్‌, ‌చెంచు పలుగు తండ, చౌటపల్లి గ్రామాల సపంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో పిడుగుపాటుకు బర్రె మృతి చెందింది. వరంగల్‌ ‌జిల్లాలో వర్షానికి ధర్మసాగర్‌ ‌మండల కేంద్రంలోని గుంటివాగు వద్ద కల్వర్టు తెగిపోయింది. పంటలు నీట మునిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చండ్రుగొండ మండలం ఎదుల వాగు పొంగి ప్రవహిస్తుండటంతో అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.  గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సూర్యాపేట మున్సిపల్‌ ‌పరిధిలో చెరువులు పొంగిపొర్లుతున్నాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి సూర్యాపేట పట్టణం పూర్తిగా జలమయమైంది. ఆత్మకూర్‌ (ఎస్‌) ‌మండలం నశింపేట వద్ద ప్రవహిస్తోన్న వాగును దాటే క్రమంలో గొర్రెలను తరలించే వాహనం నీటిలో కొట్టుకు పోయింది. వెంటనే గుర్తించిన స్థానికులు వాహనంలోని ముగ్గురిని కాపాడారు. పట్టణ ప్రాంతాలైన శ్రీనివాసకాలనీ, మానస నగర్‌, ఇం‌దిరమ్మ కాలనీ శివారు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. సద్దుల చెరువు, పుల్లారెడ్డి, నల్లచెరువు ఉధృతంగా ప్రవహిస్తున్నఈ నేపథ్యంలో.. విద్యుత్‌ ‌శాఖ మంత్రి జగదీష్‌ ‌రెడ్డి మున్సిపల్‌, ‌రెవెన్యూ అధికారులతో సెల్‌ ‌కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు.

ప్రజలకు ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో టీమ్‌లుగా విడిపోయి ఆర్డీవో రాజేంద్ర కుమార్‌, ‌మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌పెరుమాళ్ళ అన్నపూర్ణ, వైస్‌ ‌చైర్మన్‌ ‌పుట్టాకిశోర్‌, ‌కౌన్సిలర్లు  పట్టణంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పలు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు.

మరో మూడ్రోజులపాటు భారీ వర్షాలు : వాతావరణ శాఖ
రాష్ట్రంలో రాగల మూడు రోజులకు హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం సూచన చేసింది. ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ ‌తీర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, రాగల 3 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత రెండు మూడు రోజుల నుంచి రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్న విషయం విదితమే. చెరువులు, జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి.

Leave a Reply