Take a fresh look at your lifestyle.

కరోనా వ్యాక్సినేషన్‌పై విస్తృత ప్రచారం

సర్పంచ్‌లు, వార్డుసభ్యులకు అవగాహన
కొవిడ్‌ ‌వ్యాక్సిన్‌ను ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని జిల్లాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. గ్రామస్థాయిలో సర్పంచ్‌ ‌నుంచి ఈ ప్రచార కార్యక్రమం సాగుతోంది.  సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, వలంటీర్లకు అవగాహన సదస్సులతో చైతన్యం కలిగిస్తున్నారు. వీరంతా గ్రామాలకు వెళ్లి ప్రజలను కలవాలని కోరుతున్నారు. కొవిడ్‌ ‌వ్యాక్సినే షన్‌ ‌విధానంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. పవర్‌పా యింట్‌ ‌ప్రజెంటేషన్‌ ‌ద్వారా వ్యాక్సినేషన్‌ ‌పక్రియపై సభ్యులకు అవగాహన కల్పించారు.  కొవిడ్‌ను అరికట్టేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యాధికారులు సూచించారు.  కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అలాగే వ్యాక్సిన్‌ ‌లాభాలు ప్రజలకు వివరించాలని అన్నారు. గ్రామాల్లో ప్రజలు కొవిడ్‌ ‌బారిన పడకుండా సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అధికారులు కోరారు. వ్యాక్సిన్‌ ‌వేయించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని కోరారు. గ్రామాల్లో కొవిడ్‌ ‌వ్యాక్సిన్‌పై ప్రజలకున్న అపోహలను గ్రామాల సర్పంచ్‌లు, వార్డుసభ్యులు తొలగించేందుకు తమవంతుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply