Take a fresh look at your lifestyle.

సిఐడి కేసును పాలకులు ఎందుకు సక్షించలేదు

  • చెడ్డపేరు వచ్చేది ఎవరికని ఎందుకు తెలుసుకోలేదు
  • రఘురామ విషయంలో ఇప్పుడ పప్పులో కాలేసిందెవరు?

విజయవాడ : ఎంపి రఘురామరాజును పోలీస్‌ ‌కస్టడీలో కొట్టడం, దానిని సుప్రీం కోర్టు పరిగణించడం వంటి విషయాలను సిఎం జగన్‌ ‌తీరును తప్పుపట్టినట్లే. ఇది సిఐడి కేసు అని తప్పించుకోవడానికి లేదు. జగన్‌ అం‌డ్‌ ‌కో చేస్తున్న దుష్పాచ్రారానికి మూల్యం చెల్లిస్తున్నది జగన్‌ ‌మాత్రమే అని గుర్తించాలి. అధికారంలో ఉన్నందున జగన్‌ను తప్పుదోవ పట్టించే బదులు మంచినేతగా పురమాయించి ఉంటే అందరికీ మంచి పేరు వచ్చి ఉండేది. మేధావులం అని చెప్పుకునే కొంతమంది వంతపాడడం వల్లనే జగన్‌ ‌పాలన పక్కదారి పడుతున్నది. రఘురామరాజు సీఐడీ పోలీసులు తనను హింసించారని సీఐడీ కోర్టుకు ఆయన ఫిర్యాదు చేసిన సందర్భంగా ఆయన కమిలిన పాదాల ఫొటోలు విడుదలయ్యాయి. వాటిని చూసిన వారెవరికైనా లాఠీలతో ఆయన అరికాళ్లపై కొట్టారనే అనిపిస్తుంది.

అయితే రఘురామకు సొరియాసిస్‌ ‌వ్యాధి ఉందని, గోక్కోవడం వల్ల అరికాళ్లు అలా కనిపిస్తున్నాయని ప్రచారం చేశారు. ఆ తర్వాత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆయనకు అయిన గాయాలు, కొట్టడం వల్ల అని చెప్పలేమని పేర్కొనడం వైద్య వృత్తికి వారు కళంకం తెచ్చారు. ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో పెద్దగా విశ్లేషించాల్సిన పనిలేదు. ఆర్మీ ఆసుపత్రి నివేదికలో రఘురామ కాళ్లు వాచి ఉన్నా యని పేర్కొనడంతో ఆయనకు ఎడిమా వ్యాధి ఉందని ప్రచారం చేశారు. సుప్రీంకోర్టులో వాదన సందర్భంగా రఘురామరాజు తన కాళ్లను తానే గాయపరుచు కున్నారేమోనని సరికొత్త వాదన చేశారు. పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు అనుచితంగా ప్రవర్తించడం వల్లనే రఘురామకు గాయాలయ్యాయని ఆర్మీ ఆసుపత్రి నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం ప్రాథమికంగా అంచనాకు వచ్చామని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ పరువు పోయింది. రఘురామరాజును ఎవరు కొట్టారన్నది కూడా ప్రజలకు తెలుసు.

అసంబద్ధ నివేదిక ఇచ్చిన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులపై చర్యలు తీసుకునే విషయంలో కూడా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. తనతండ్రిని హింసించిన వారెవరో నిర్దారించి శిక్షించిడానికి సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ రఘు తరఫున ఆయన కుమారుడు భరత్‌ ‌దాఖలు చేసిన పిటిషన్‌ ‌మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. అధికారులు తమ పరిధి మరిచి అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తితే ఏమి జరుగుతుందో గతంలో జరిగిన కేసులను తెలుసుకుని మసలాలి. ఆనాడు పోరాట యోధులను జైళ్లకు పరిమితం చేయాలన్న దుష్ట తలంపుతో బ్రిటిష్‌ ‌సామ్రాజ్యవాద శక్తులు తీసుకు వచ్చిన చట్టాలలో సెక్షన్‌ 124ఏ ఒకటి.

అది ఇంకా కొనసాగించడం దుర్మార్గం కాక మరోటి కాదు. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే సెక్షన్‌ 124 ఏ ‌ను రద్దు చేస్తామని కాంగ్రెస్‌ ‌పార్టీ గత ఎన్నికల సందర్భంగా తమ ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. రఘురామరాజు విషయంలో సిఐడి సుమోటోగా కేసు నమోదు చసిందని అంటున్నారు. అలా అంతకుముందు ఎన్ని కేసులు నమోదు అయ్యాయో చెబితే అనుమానాలు రావు. సీఐడీ అధికారులు తమంతట తామే కేసు నమోదు చేశారని కూడా తేల్చి చెప్పారు. ఒకవేళ అలా చేస్తే వాటిని పరిశీలించుకోవాల్సిన బాధ్యత పాలకులదే. అలా చేయకుంటే వారు చేసిన తప్పులకు పాలకులు సమాధానం ఇచ్చుకోవాల్సి ఉంటుందని సిఐడి కేసు నిరూపించింది.

Leave a Reply