Take a fresh look at your lifestyle.

‌డ్రగ్స్‌పై నివేదికను ఇడికి ఎందుకు ఇవ్వలేదు

  • అకున్‌ ‌సబర్వాల్‌ను విచారణ నుంచి ఎందుకు తప్పించారు
  • విచారణ కోరితే కెటిఆర్‌ ఎం‌దుకు శాంపిల్స్ ఇస్తామన్నారు
  • నగరం డ్రగ్స్‌కు అడ్డగా మారుతుంటే మంత్రిగా కెటిఆర్‌ ఏం ‌చేస్తున్నారు
  • రాజకీయంగా ఎదుర్కోలేక అడ్డమైన విమర్శలు సహించేది లేదు
  • గన్‌పార్క్ ‌వద్ద వి•డియాతో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌ఘాటు వ్యాఖ్యలు

ఎక్సైజ్‌ ‌శాఖ విచారణ నివేదికను ఎందుకు ఈడీకి ఇవ్వడం లేదో చెప్పాలని…ఐపీఎస్‌ అధికారి అకున్‌ ‌సభర్వాల్‌ ‌కమిటీ ఏమైందంటూ పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు. నివేదికను ఇడికి ఇవ్వకుండా ఎందుకు తొక్కిపెట్టారని అన్నారు. మంత్రి కేటీఆర్‌ ‌విసిరిన సవాల్‌ను స్వీకరించిన రేవంత్‌ ‌సోమవారం ఉదయం గన్‌పార్క్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ ‌మాట్లాడుతూ..అకున్‌ ‌సబర్వాల్‌కి మంచి ట్రాక్‌ ‌రికార్డ్ ఉం‌ది. డ్రగ్స్ ‌కేసు విచారణలో ఉండగానే అకున్‌ ‌సబర్వాల్‌ని తప్పించారు. బంజారాహిల్స్, ‌మాదాపూర్‌, ‌కొండాపూర్‌ ‌వరకూ పబ్బులు వ్యాప్తి చెందాయి. విదేశాల నుంచి వొచ్చిన డ్రగ్స్, ‌గంజాయి వాడకం ఎక్కువైంది. మంత్రిగా కేటీఆర్‌కి బాధ్యత లేదా అన్నదే మా ప్రశ్న అని అన్నారు.

సిఎం కెసిఆర్‌ ‌తనయుడిగా ఆయనను ప్రశ్నించడం లేదని, ఓ మంత్రిగా బాధ్యత ఉందా లేదా అని అన్నారు.  పిల్లలు డ్రగ్స్ ‌మహమ్మారి బారిన పడుతుంటే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత లేదా అని అన్నారు. అయితే  కేటీఆర్‌ ఎదురు దాడి చేస్తున్నారని రేవంత్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. ‘ఎవరు నేరగాళ్లనే చర్చ తర్వాత చేద్దాం. అమర వీరుల స్తూపం ముందు మేము రెడీగా ఉన్నాం. మా తండ్రి, తాత, ముత్తాత చరిత్ర కూడా చర్చిద్దాం. డ్రగ్స్ ‌కేసు చర్చ పక్కదారి పట్టించే ప్రయత్నం కేటీఆర్‌ ‌చేస్తున్నారు. వి• ఆస్తులు అడగడం లేదు. రానా, రకుల్‌ ‌ప్రీత్‌ ‌సింగ్‌ని ఈడీ పిలిచింది. వాళ్ళని నేను అంటుంటే కేటీఆర్‌ ఎం‌దుకు ఉలిక్కి పడుతున్నాడు. కేసులు వేస్తం అని బెదిరిస్తున్నారు. కేటీఆర్‌ ‌నీ స్థాయి పెద్దది అనుకుంటున్నావు.

నువ్వు ఎమ్మెల్యే కాకముందే నేను ఎమ్మెల్సీ అయ్యాను. నువ్వు మొదటిసారి ఎమ్మెల్యేగా కేవలం 100 వోట్లతోనే గెలిచావని అంటే విమర్శలు గుప్పించారు. రాజకీయాల పరంగా చూస్తే కేటీఆర్‌ ‌నువ్వు నా వెంట్రుకతో సమానం. డ్రగ్‌ ‌టెస్టుకు రా అని నేను అడిగానా.. నువ్వు అడిగావా? నువ్వు విసిరిన సవాల్‌నే నేను స్వీకరించా. మరో ఇద్దరికి సవాల్‌ ‌విసిరా. గన్‌ ‌పార్క్‌కి అర గంట ముందే కేటీఆర్‌ ‌వస్తారనుకున్నా. రాహుల్‌ ‌గాంధీని రమ్మని చెప్పిన కేటీఆర్‌.. ఇవాంక ట్రంప్‌ని కూడా రమ్మని అడుగు తారేమో. డ్రగ్స్‌తో నీకు సంబంధం ఉందని అన్నామా. నువ్వే డ్రగ్స్ ‌టెస్టుకు సిద్ధమని సవాల్‌ ‌చేశావు’ అని రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్‌ ‌డ్రగ్స్ ‌టెస్ట్ ‌సవాల్‌ ‌నేను స్వీకరించకపోతే…జనానికి అనుమానం వొస్తుంది. ఆయన చెప్పిన మాటలకు నేను వైట్‌ ‌ఛాలెంజ్‌ అని విసిరా.

కేటీఆర్‌ని కేసీఆర్‌ ‌టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌చేస్తే. కేటీఆర్‌ ‌స్లీపింగ్‌ ‌ప్రెసిడెంట్‌గా మారిపోయాడని రేవంత్‌ ‌విమర్శించారు. డ్రగ్స్ అమ్మకాలకు పబ్బులు కేరాఫ్‌ అ‌డ్రస్‌ ‌గామరాయని అన్నారు. తాను వైట్‌ ‌ఛాలెంజ్‌ ‌విసరకముందే..కేటీఆర్‌ ‌తన బ్లడ్‌ ‌శాంపిల్స్, ‌వెంట్రుకలు టెస్టుకు ఇస్తానన్నారని చెప్పారు. యువతకు ఆదర్శంగా ఉండాలనే వైట్‌ ‌ఛాలెంజ్‌ ‌చేశానన్నారు. కేటీఆర్‌ ‌సవాల్‌ ‌స్వీకరించకుండా తిట్లదండకం అందుకున్నారన్నారు. టెస్టుకు రమ్మంటే కేటీఆర్‌ ఎం‌దుకు ఉలిక్కి పడుతున్నారన్నారు. తాను దేశంలోనే పెద్ద పార్లమెంట్‌ ‌స్థానానికి ఎంపీనని.. కాంగ్రెస్‌ ‌పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడినన్నారు. రాజకీయ పరంగా కేటీఆర్‌ ‌తన వెంట్రుకతో సమానమని..కానీ తాను అలా అనని చెప్పారు.

- Advertisement -

డ్రగ్స్ అమ్మకాలకు పబ్బులు కేరాఫ్‌ అ‌డ్రస్‌గా మరాయన్నారు. పబ్బుల యజమానులు డ్రగ్స్ అం‌దుబాటులోకి తెస్తున్నారన్నారు. డ్రగ్స్ ఇష్యూపై విచారణ జరపాలని కోర్టులో పిటిషన్‌ ‌వేశానని..కోర్టు అన్ని శాఖలకు నోటీసులిచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలకు సహకరించ లేదన్నారు. విచారణ మధ్యలో ఉండగానే అకున్‌ ‌సబర్వాల్‌ను తప్పించారన్నారు.  హైదరబాద్‌ ‌సిటీలో డ్రగ్స్ ‌విస్తరించిందన్నారు. ఇకపోతే చిన్నారి హత్యకు కారణమైన సింగరేణి కాలనీ ఘటన పూర్తిగా ప్రభుత్వానిదే బాధ్యతని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. కేటీఆర్‌ ‌దత్తత తీసుకున్న సింగరేణి కాలనీలోనే ఈ ఘటన జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆయన నైతిక బాధ్యత వహించాలన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేస్తానని, వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువొస్తానని, శాంతి భద్రతలను కాపాడతానని పెట్టుబడిదారులకు, ప్రజలకు పదే పదే చెప్పారన్నారు.

మంత్రి దత్తత తీసుకున్న ప్రాంతంలో గంజాయి అమ్ముతున్నారని, ఆయన స్నేహితులు వెళ్లే పబ్‌లలో రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. గన్‌పార్క్ ‌వద్ద రేవంత్‌తో పాటు మల్లు రవి, షబ్బీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply