Take a fresh look at your lifestyle.

తెలంగాణ గడ్డ ఎందుకు మళ్లీ నక్సలిజాన్ని కోరుకుంటుంది.?

“ఈ ‌తెలంగాణ గడ్డ ఎంతోమంది ప్రాణ త్యాగాల అమరుల నెత్తుటి పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం తెలంగాణలో ప్రతి పక్ష పార్టీల నాయకులు ప్రజానీకం ఎన్నడూ లేని విధంగా ఎవరు మాట్లాడ లేనంత తీరుగా తిరిగి మళ్ళీ నక్సలిజాన్ని కోరుకుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరిగి మళ్లీ నక్సలైట్లు ఉంటే బాగుంటుంది అనే మాటలు మీడియా సాక్షిగా పత్రికల సాక్షిగా రాజకీయ నాయకులు మాటలను తూటాలుగా వదులుతున్నారు. ప్రాణత్యాగాలను లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో ఎన్నో ఉద్యమాలు పోరాటాలు రాస్తారోకోలు రైల్‌ ‌రోకోలు చివరికి జైలు గోడలు ద్వారా ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ నక్సలిజం నక్సలైట్లు అవసరమా అన్న మాటలు ఒకప్పుడు.. కానీ ఇప్పుడు నక్సలైట్లు ఉంటే బాగుండేదేమో అని బహిరంగంగా ప్రతిపక్ష పార్టీల నేతలే కోరుకోవడం తెలంగాణలో హాట్‌ ‌టాపిక్‌ ‌గా మారుతోంది.”

ఉద్యమ సమయంలో మావోయిస్టుల ఎజెండానే మా మా ఎజెండా అని అప్పుడు చెప్పిన ఉద్యమ నేతలు ఎందుకు ఆ మాటలను విస్మరించారు అనే పదము నుండి మొదలైన చర్చ ప్రస్తుతం తెలంగాణ టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి నక్సలైట్లు ఉంటే బావుంటుంది అని చేసిన ఘాటు వ్యాఖ్యలు ఒక్కసారిగా తెలంగాణలో దుమారం రేపుతుంది. ఈ తెలంగాణ గడ్డ ఎంతోమంది ప్రాణ త్యాగాల అమరుల నెత్తుటి పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం తెలంగాణలో ప్రతి పక్ష పార్టీల నాయకులు ప్రజానీకం ఎన్నడూ లేని విధంగా ఎవరు మాట్లాడ లేనంత తీరుగా తిరిగి మళ్ళీ నక్సలిజాన్ని కోరుకుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరిగి మళ్లీ నక్సలైట్లు ఉంటే బాగుంటుంది అనే మాటలు మీడియా సాక్షిగా పత్రికల సాక్షిగా రాజకీయ నాయకులు మాటలను తూటాలుగా వదులుతున్నారు. ప్రాణత్యాగాలను లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో ఎన్నో ఉద్యమాలు పోరాటాలు రాస్తారోకోలు రైల్‌ ‌రోకోలు చివరికి జైలు గోడలు ద్వారా ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ నక్సలిజం నక్సలైట్లు అవసరమా అన్న మాటలు ఒకప్పుడు.. కానీ ఇప్పుడు నక్సలైట్లు ఉంటే బాగుండేదేమో అని బహిరంగంగా ప్రతిపక్ష పార్టీల నేతలే కోరుకోవడం తెలంగాణలో హాట్‌ ‌టాపిక్‌ ‌గా మారుతోంది.

ఎన్కౌంటర్లు లేని తెలంగాణను నిర్మిస్తామని అప్పుడు చెప్పిన ఉద్యమ నేతలు తిరిగి అధికారంలోకి వచ్చాక శృతి, సాగర్‌ ఎన్కౌంటర్లు మొదలుకొని తెలంగాణలో ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులతో నిర్బంధించి జైలుకు పంపుతున్నారనీ కవి, రచయిత వరవరరావు లాంటి మేధావులతో పాటు ప్రశ్నించే గొంతులు న్యాయవాదులు ప్రజాస్వామికవాదులు జర్నలిస్టులు కూడా అక్రమ కేసులతో జైల్లో మగ్గుతున్నారనీ ప్రజా సంఘాల నాయకులు పౌర హక్కుల నేతలు ఉద్యమాలను కొనసాగిస్తున్నారు. ఇక ఇక్కడి నుంచి మొదలుపెడితే చివరికి ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ పరిస్థితుల్లో నక్సలైట్లు ఉంటే బాగుండు అనే మాటలు వారి నోటి నుండి ఎందుకు వస్తున్నాయి.. అస్సలు తెలంగాణలో ఏం జరుగుతుంది..? మానవ హక్కులు పౌర హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు తరలిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు ప్రత్యేకంగా వీటి కోసమే తెలంగాణ ఉద్యమం కొనసాగింది. అరెస్టులు లేని తెలంగాణలో మన పాలన ఉంటుందని అప్పుడు చెప్పిన ఉద్యమకారులు అధికారంలోకి వచ్చాక ప్రశ్నిస్తే చాలు అక్రమ కేసులు పెట్టే పరిస్థితి నెలకొందని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వలు ఉద్యమాలను ఎంత అణచివేయాలని చూస్తే చూస్తే అంత పైకి ఉద్యమం ఎగిసిపడుతుందని చరిత్ర చెబుతోంది.

తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎందుకు నక్సలిజాన్ని కోరుకుంటుంది .. దానికి కారణం ప్రభుత్వ వ్యవస్థనా.. అధికార యంత్రాంగమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్యాయం జరిగి ఈ వ్యవస్థలో ఎక్కడ కూడా న్యాయం జరగకపోతే ఈ ప్రజలకు గుర్తుకొచ్చేది అన్నలు..! ఓవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నక్సలిజాన్ని ఆపరేషన్‌ ‌సమాధాన్‌ అనే పేరుతో తుది ముట్టిస్తమని ప్రకటనలు చేస్తుంటే..ప్రతిపక్ష పార్టీలు మాత్రం అదే నక్సలిజాన్ని కోరుకుంటున్నారా..! మరి 1967 వ సంవత్సరంలో (సీపీఐఎంఎల్‌) ‌పార్టీ ఏర్పడి సుమారు 54 సంవత్సరాలుగా పార్టీ దశలు మార్చుకొని 2004 వ సంవత్సరంలో కామ్రేడ్‌ ఆర్కే అలియాస్‌ అక్కిరాజు 2004వ సంవత్సరంలో చర్చల అనంతరం మావోయిస్టు పార్టీగా మార్చి ఉద్యమ పంథాను కొనసాగించారు. ఆర్కే అలియాస్‌ అక్కిరాజు హరగోపాల్‌ ‌మీద తెలంగాణ ప్రజలకు ఉన్న అభిమానం అడవి నుండి మొదలుకొని ఎక్కడో మారుమూల గ్రామాల వరకు సైతం వెళ్ళింది. ఆయన చిత్రపటానికి సోషల్‌ ‌మీడియా సాక్షిగా చరవాణిలో నివాళులు అర్పించింది.

తెలంగాణ సమాజం అంటే మావోయిస్టు పార్టీ ముందుకు వెళుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేతతో వెనక్కి తగ్గుతుందా అనే అనుమానం కలగక తప్పదు. ఆర్కే చనిపోయేవరకు ఆయన చివరి మాటలు ఇప్పటికైనా రాజ్యాంగం కల్పించబడిన హక్కులను అమలు చేయాలని తుది శ్వాస విడిచారు. గత 54 సంవత్సరాల నుండి మావోయిస్టు పార్టీ తుపాకీ గొట్టం ద్వారా చేస్తున్న పోరాటం ప్రజల కోసమా.. వారి వ్యక్తిగతం కోసమా..! తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారాన్ని చెప్పట్టే రాజ్యాధికారమే నిజమైన రాజ్యాధికారం అని అప్పుడే ప్రజలకు నిజమైన హక్కులు అమలు చేయబడతాయనీ చారుమజుందార్‌ ‌లాంటి వారు చెప్పిన మాటలు ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న మాటలు సమానంగా తులతూగుతున్నయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రజల అవసరాలు తీరాయా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో అధికారంలో ఉన్న పార్టీలు ఈ ప్రజలకు అవసరమయ్యే భూమి కూడు గూడు గుడ్డ విద్య వైద్యం నిత్యవసర అవసరాలను ప్రజలకు అందుబాటులో ఉండేందుకు కృషి చేశారా అంటే భారత ప్రభుత్వల వ్యవస్థలో అలాంటిది ఏమీ లేదనే చెప్పాలి. అందుకే మా పోరాటం అంటూ మావోయిస్ట్ ‌పార్టీ నాయకులు లేఖలు విడుదల చేస్తూ ఉద్యమ పంత కొనసాగిస్తున్నారు..!

– ఏమ్‌ ..‌సత్యనారయణ…
సీనియర్‌ ‌జర్నలిస్ట్ ..‌హైదారాబాద్‌

Leave a Reply