ప్రపంచంలో ప్రతీ నిమిషం ఎక్కడో ఒకచోట ఆత్మహత్యలు నమోదు కాబడుతున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనా. ఈ ఆత్మహత్యలకి గల కారణాలు ఒక్కో వ్యక్తికి ఒక్కోరకంగా ఉంటాయి. ఒకరికి ఆర్థిక కారణాలు, ఇంకొకరికి సాంఘీక కారణాలు, మరి కొందరికి వ్యక్తిగత జీవితంలోని సమస్యలు ఇలా భిన్నమైన కారకాలు మనుషులను ఆత్మహత్య చేసుకునే దిశగా ప్రేరేపిస్తాయని విశ్లేషణ. అయితే చాలా వ్యక్తుల ఆత్మహత్యలకి గల కారణాలను విశ్లేషిస్తే వారి సమస్యలకు పరిష్కారం కేవలం ఆత్మహత్యయే అని అనుకోవడం ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఒక బీదవాడు ఆత్మహత్య చేసుకుంటే కారణం పేదరికమని, నిరుద్యోగి చేసుకుంటే నిరుద్యోగం, విద్యార్ధి చేసుకుంటే చదువులో రాణించకపోవడం, ప్రేమికుడు చేసుకుంటే ప్రేమలో విఫలమవడం, రైతు చేసుకుంటే దిగుబడి రాకపోవడం, ఇలాప్రతిఒక్కరి ఆత్మహత్యకు ఖచ్చితమైన కారణాన్ని చూపించవచ్చు. కానీఅ న్ని విధాలా స్థిరపడ్డాక కూడా ఆత్మహత్యలకు పూనుకోవడం ఎక్కువుగా సినీ పరిశ్రమలో వింటాము. మొత్తం సమాజాన్ని మూడుగంటలపాటు మంత్రముగ్దుల్ని చేసే కథలలో నటిసు్త డబ్బు, పేరు, ప్రతిష్టలు సంపాదించి , ఉన్నతమైన జీవితాన్ని గడిపే సినీతారలు ఎందుకు అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారన్నది యావత్ మానవాళికి ఉన్న సందేహం.
నిజంగా వారి జీవితాలలో బయటి ప్రపంచానికి తెలియని లోటు ఉందా, అనే ప్రశ్న ప్రేక్షకులను వెంటాడుతుంది. లేకమూడుగంటల పాటు తమ జీవితాలను ఎంతో అందంగా తెరపై చూపించే దర్శకులు లాం• •వ్యక్తులను నిజ జీవితంలో కల్గిలేకపోవడమే కారణమా అన్న సందేహం కూడా సగటు ప్రేక్షకుని మదిలో రేకెత్తుతుంది. అలా కాకుండా కెమెరా ముందు నటించడానికి అలవాటుపడి, నిజ జీవితంలో ఎలా బ్రతుకాలో మర్చిపోయారా అన్నది ప్రశ్నగా ఉండి పోతుంది. అయితే సినీ రంగవ్యక్తుల ఆత్మహత్యలకు గల కారణాలను విశ్లేషిస్తే భిన్న కారకాలు, వారి ఆత్మహత్య నిర్ణయానికి ఆజ్యం పోశాయని చెప్పవచ్చు. అయితే కొంత మంది సినీ వ్యక్తుల బలవన్మరణానికి ఆర్థిక కారణాలు ప్రధానమైన విగా వెల్లడైంది. సినీ పరిశ్రమలో ఒకటి రెండు సినిమాలు విజయమంతమైతే రాత్రికి రాత్రి వారిసంపాదన కోట్లకు పరిగెడుతుంది. సంపా దనతో పాటు జీవనశైలి మారిపోవడం, విలాస వంతమైన జీవనానికి అలవాటుపడటం, భారీ నిర్వాహణ ఖర్చులకు లోనవడం జరుగుతుంది. ఒక్కోసారి ప్రతికూల పరిస్థితుల వల్ల అవకాశాలు సన్నగిల్లడం, ఆదాయంలో తగ్గుదల ఏర్పడటం, నిర్వహణ ఖర్చులు భారీ స్థాయిలో ఉండడంవల్ల ఆర్థిక ఒత్తిడికి లోనై, అటు చేతిలో సినిమాలు లే• •ఇటు మాములు జీవనం గడపడాని• •సుముఖత చూపకపోవడం లాంటి కారణాల వల్ల మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యలకు సిద్ధం కావడం జరుగుతుంది. ఇలాంటి ఘటనలు ఎక్కువుగా యువతారల మరియు బీదకుటుంబాల నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తుల విషయంలో జరుగుతుందని అంచనా. సాంఘీక కారణాలను గమనిస్తే డబ్బు, హోద, సకల సౌకర్యా లున్నప్పటికీ, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం, షూటింగ్ సమయంలో జన సమూ హంలో గడిపి, తరువాత ఒంటరిగా గడపాల్సి రావడం వల్ల ఒంటరితనం అనే సమస్య వీరిని వేటాడటం, సమస్యలను పంచుకు• •వారు ప్రక్కకు లేక పోవడం వల్ల మనసులోనే అణుచుకుంటూ పరిస్థితులు తీవ్ర రూపం దాల్చినప్పుడు సూసైడ్ ఆలోచనలు ఉద్భవిస్తాయనడంలో సందేహం లేదు. ఇంకొంత మంది ఆత్మహత్యలను పరిశీలిస్తే నటుడిగా తెరపై ప్రేక్షకులను మెప్పించే సత్తా, శకి్త సామర్థ్యాలు న్నప్పటికీ సినీ రంగంలోని రాజకీయాల వల ్లయువనటి, నటీ మణులకు తగిన ప్రోత్సాహం, ఆదరణ, అవకాశాలు సన్నగిల్లడం వల్ల వేరే ప్రత్యామ్నాయాలు లేక తమ జీవితాలను అర్థాంతరంగా ముగించు కోవడం జరుగుతుంది.
ప్రముఖ మానసిక నిపుణుల పరిశోధనలను పరిశీలిస్తే సూసైడ్లకు గల మరో కారణం ఒత్తిడిని జయించ లేకపోవడం. షూటింగుల కోసం నెలల పాటు ఇంటి బయట ఉండాల్సిరావటం, రాత్రి పగళ్లు పని చేయడం, అవకాశాలు పోగొట్టుకోకుండా ఉండేందుకు శక్తికి మించి ప్రాజెక్ట్‌లను ఒప్పుకోవడం, జరుగుతుంది. అయితే ఈ ప్రయాణంలో వారు వ్యక్తి గత జీవితాన్ని మర్చిపోవడం, ఓ దశలో డబ్బు తప్పవేరేది, వారి జీవితాలో్ల కనపడక పోవడం వల్ల తీవ్ర ఒత్తిడికిలోను కావడందాని నిజయించే క్రమంలో మత్తు పానీయాలకు బానిసలవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, నిద్రకోసం మాత్రలను తీసుకోవడం, ఇవి ఫలించనప్పుడు విషపు గుళికలను మింగడం పరిపాటిగా మారింది.ఇంకొన్ని మరణాలకు ప్రేమలు విఫలంఅని అభిప్రాయం. సినీతారలు తెరమీద చూపెట్టే ప్రేమ కథలకు వారి నిజ జీవితంలో ఏర్పడే ప్రేమలకు వ్యత్యాసం ఉంటుంది. నిజ జీవితంలో సినీ తారల మధ్య ఏర్పడే ప్రేమలు మనస్పర్థలు, భేదాభిప్రాయాలు, వ్యక్తిగత కెరీర్ ప్రణాళికలు, అభద్రతా భావం మొదలగు కారణాల వల్ల మధ్యలోనే చెరిగిపోవడం వల్ల కూడా ఆత్మహత్యలకు కారణంగా సూచించవచ్చు.అయితే సినీ తారలు చాలామంది పెద్దగా చదువుకోక పోవడం వారి జీవితాన్ని కేవలం సినీ పరిశ్రమకే ముడిపెట్టడం అక్కడ విఫ లమైనప్పుడు, ఇంకో రంగం లో తమ సామర్థ్యాలను, అదృ ష్టాన్ని పరీక్షించుకునే అవకాశం లేకపోవడం కూడా ఒత్తిడికి దారి తీస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ విధంగా రీల్ లైఫ్, రియల్ లైఫ్‌ను మేనేజ్ చేయలేక చాలామంది తారలు తమకు తాముగా మరణశయ్యపై పడుకుంటున్నారు.